అమరావతి(పెదకూరపాడు): కమిటీ నిర్ణయం లేకుండా అంబేడ్కర్ బొమ్మ వద్ద నిచ్చెన వేస్తుండగా ప్రశ్నించిన తన భర్త రఘుపై దౌర్జన్యంగా దాడి చేశారని గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసి న తెలగతోటి ప్రసన్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. 2006 అప్పటి ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్, జిల్లా కలెక్టర్ సహకరంతో నా భర్త రఘుతో పాటు పలువురు దళిత నేతలు, కమిటీ సభ్యులు, ఉద్యోగులు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గుడెసె నిర్మలాదేవి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అన్యాయంగా ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు.
రీ కౌంటింగ్ కోసం కోర్డును ఆశ్రయించామని, విషయం ఇంకా అక్కడే ఉందన్నారు. అనంతరం నిర్మలాదేవిని టీడీపీలోకి చేర్చుకోని తమపై వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, ఎమ్మెల్యే శ్రీధర్ అండ చూసుకోని తమపై తరుచూ దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇదేనా టీడీపీలో ఉన్న సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు. శనివారం ఉదయం దౌర్జన్యంగా అంబేడ్కర్ బొమ్మ వద్ద నిచ్చెన ఏర్పాటు చేస్తున్న నిర్మలాదేవి కుమారుడు కిరణ్‌కుమార్‌ను ప్రశ్నించిన తన భర్త రఘుపై ఉద్దేశపూర్వకంగా ఏడుగురు కలసి దాడి చేశారని అన్నారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, విచారించి చర్యలు తీసుకుంటామని సీఐ కట్టా శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment