ఈత కొలనుపై రాజకీయ క్రీనీడలు
చివరకు క్రీడలపైనా రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. ఆ వేదికలను ఇప్పుడు తమ అధికార బల నిరూపణకు, పెత్తనానికి వాడు కుంటున్నారు. దీని కోసం నిస్సిగ్గుగా వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్, టీడీపీ వర్గాల వారు బాహాబాహీకి దిగారు. గాయాలయ్యేలా తన్నుకున్నారు. స్థానికులను, క్రీడాకారులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారు. ఇందంతా ఎందకయ్యా అంటే... ఆ కాంప్లెక్స్‌పై పెత్తనం కోసమట... ఒక పార్టీ కబ్జాలో ఉన్న ఈ ఈత కొలనును మరో పార్టీ నేతలు కబ్జాకు యత్నించే సమయంలో దాడులు చేసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్‌లో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్‌డీఓ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజకీయాలకు వేదికైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులు డీఎస్‌డీఓ నిర్వహణలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై పెత్తనం చెలాయిస్తున్నారు. అక్కడ వారు చెప్పిందే వేదం. వారి ఇష్టం మేరకే ఏమైనా జరగాలి. అక్కడేం జరిగినా అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. గత అధికారపక్షమైన కాంగ్రెస్ హాయం నుంచి నాయకుల కనుసన్న లో ఈకాంప్లెక్స్ నడుస్తోంది. ఇప్పుడు ఈఅక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై టీడీపీ నేతల దృష్టి పడింది. పెత్తనం తమ చేతికి తెచ్చుకోవాలనుకున్నారు. గాజులరేగకు చెందిన టీడీపీ కార్యకర్తొకరు ఆధిపత్యం కోసం బీజం నాటే ప్ర యత్నం చేశారు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వారితో సమావేశం ఏర్పాటు చేసి, దానికి ఎమ్మెల్యేను, జెడ్పీ చైర్‌పర్సన్‌ను అహ్వానించి పాగా వేయాలని పావులు కదిపారు.
అయితే, అప్పటికే పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని పసిగట్టి, కొత్తగా జెం డా పాతేందుకు ప్రయత్నించిన వారితో ఇటీవల గొడవకు దిగారు. చినికి చినికి గాలివానగా మారి కొట్లాట కు దారితీసింది. గాయాలయ్యేలా కొట్టుకోవడమే కాకుండా ఇళ్లపై దాడి చేసేంతవరకు పరిస్థితి వెళ్లింది. ఇంత జరిగినా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు ఇరువర్గాలూ ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్నాయి. నువ్వా...నేనా అంటూ సవాల్ విసురుకుంటున్నాయి. ఆ రెండు వర్గాలకు సంబంధిత పార్టీల నాయకులు అండగా నిలుస్తున్నారు. ఎంతవర కు వెళ్తుందో చూద్దామనే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోం ది. మొత్తానికి వివాదం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. కాకపోతే, దీనిని రెండు వర్గాల గొడవగా చిత్రీకరించా రు.
పెత్తనం కోసం పోరాటంగా ఎక్కడా బయటపడలేదు. మొత్తానికి ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని ఆ వర్గాల మధ్య తాము బలి పశువు కావల్సి వస్తుందేమోనని అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే క్రీడాకారులు భయపడుతున్నారు. ఏదేమైనా స్మిమ్మింగ్ పూల్, జిమ్ ఉన్న అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వర్గ రాజకీయాలకు వేదికైంది. అధికారుల ఆధ్వర్యంలో నడాల్సిన కాంప్లెక్స్‌లో నాయకుల పెత్తనం కొనసాగుతోంది. అధికార యంత్రాంగం కూడా ఎందుకొచ్చిందని చోద్యం చూస్తోంది. ఇదే విషయమై జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి మనోహర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అక్కడ గొడవ జరిగిన విషయం తమదృష్టికొచ్చిందని, కొట్టుకున్నట్టు సమాచారం ఉందని, పోలీసులు కూడా వచ్చి ఆరాతీసారని, వారి మధ్య ఉన్న మనస్పర్ధలే గొడవకు కారణమని చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఆధిపత్యం, పెత్తనమనేది అక్కడ లేదని, తమ ఆధ్వర్యంలోనే నడుస్తోందని వివరణిచ్చారు.