Sports Complex
-
సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
సికింద్రాబాద్: డెక్కన్ మాల్ ఘటనలో ముగ్గురు మృతి
-
సికింద్రాబాద్: డెక్కన్ స్టోర్‌లో అదుపులోకి రాని మంటలు
-
సికింద్రాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదానికి కారణాలు
-
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 1,500 పడకలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 1,500 పడకలు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం ఆయన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడ 3వేల మందికి సరిపడా నీళ్ల ట్యాంకులు అందుబాటులో ఉంచుతామని, 10 లక్షల లీటర్ల నీరు పట్టేలా సంప్ నిర్మించాలని అధికారులకు సూచించారు. ప్రతి నల్లా దానంతటదే ఆగిపోయేలా ఉండాలని, ప్రతీ బాత్రూం శుభ్రంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలిక బాత్రూంలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులన్నీ శాశ్వత ప్రాతిపదికన చేస్తామన్నారు. ఆయా పనుల్లో నాణ్యమైన పరికరాలనే వాడాలని అధికారులకు సూచించారు. పడకలు శుభ్రంగా ఉంచాలని, స్టాఫ్‌కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్ద సంస్థకు భోజన క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వాలని, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు రోజుల్లో మూడు ఫ్లోర్లు, ఆ తర్వాత మూడు రోజుల్లో మరో మూడు ఫ్లోర్లు సిద్ధం చేయాలన్నారు. దీనిని 20 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ అవసరం పడకపోవచ్చు కానీ సిద్ధంగా ఉంచాలన్న సీఎం ఆదేశంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొందరు సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సైకోలు, శాడిస్టులు పెట్టే వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఎక్కడా రెడ్జోన్లు లేవన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి ఈటల వివరించారు. -
వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన సీఎం జగన్
-
వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన సీఎం జగన్
-
వైఎస్సార్ మెడికల్ కాలేజ్‌కు శంకుస్థాపన
సాక్షి, పులివెందుల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శంకుస్థాపనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందజేస్తామని తెలిపారు. మొత్తంగా రూ. 1329 కోట్లతో నియోజకవర్గంలో తొలి దశ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.‘నాన్నను అమితంగా ప్రేమించారు.. ఇప్పుడు నా వెన్నంటే ఉంటున్నారు. మీ బిడ్డగా రుణంగా తీర్చుకుంటాను’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే పులివెందుల మినీ సచివాలయానికి రూ. 10 కోట్లు, ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ కోసం రూ. 20 కోట్ల కేటయిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గండికోట రిజర్వాయర్ దిగువన 20 టీఎంసీల నిల్వతో డ్యామ్ నిర్మిచనున్నట్టు చెప్పారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ కుటుంబసభ్యులు, ప్రజలతో కలిసి పాల్గొన్నారు. కాగా, నేటితో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల జిల్లా పర్యటన ముగియనుంది. సాయంత్రం ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళతారు. సీఎం వైఎస్ జగన్ చేసిన శంకుస్థాపనల వివరాలు.. రూ.347 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల గాలేరు- నగరి సుజల స్రవంతి మెయిన్ కెనాల్ నుంచి అలవలపాడు ట్యాంక్, వేముల, వేంపల్లె మండలాలకు నీరందించే ఎత్తిపోతల పథకం. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లె ట్యాంక్, లింగాల, పులివెందుల మండలాలతోపాటు వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామాలకు నీరందించే ఎత్తిపోతల పథకం. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్ల నిధులతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు రూ.65కోట్లతో పులివెందులలో తాగునీటి సరఫరాకు పైపుల లైన్ల నిర్మాణం వేంపల్లెలో రూ.63 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు నియోజకవర్గంలో 7 మార్కెటింగ్ గిడ్డంగులు, మార్కెట్ యార్ట్ ఆధునికీకరణ ఉద్యానవన పంటల కోసం కోల్డ్ స్టోరేజ్ వెంపల్లి ఆస్పత్రిలో 30 పడకల నుంచి 50 పడకలకు పెంపు రూ.17.50 కోట్లతో ఇంటిగ్రెటేడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు.. ఇక్కడ 14 రకాల ఆటలకు శిక్షణ 32 గ్రామ సచివాలయ భవనాలు జేఎన్టీయూలో రూ.20 కోట్లతో లెక్చరర్ కాంప్లెక్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వేంపల్లెలో డిగ్రీ , ఉర్దూ జూనియర్ కళాశాలలు. వేంపల్లెలో బీసీ బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణాలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోలీసులకు ‘కరెంట్’ షాక్!
సాక్షి, విజయవాడ : అత్త సొమ్ము అల్లుడు దానం.. అన్న సామెతగా ఓ ప్రభుత్వరంగ సంస్థ ఉన్నతాధికారి తనకు సంబంధం లేని స్థలాన్ని పోలీసు శాఖకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. గుణదలలో ఏపీఎస్పీడీసీఎల్ స్టోర్స్ యార్డు స్థలం విషయంలో కొద్ది రోజులుగా విద్యుత్, పోలీసు శాఖల మధ్య వివాదం నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గుణదల విద్యుత్ కార్యాలయంలో ఏపీఎస్పీడీసీఎల్ ఆధీనంలో ఉన్న 800 స్క్వేర్ యార్డ్స్ స్థలంలో పోలీసు శాఖ మాచవరం పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ స్థలం తాము ఏపీ ట్రాన్స్‌కో నుంచి తీసుకున్నామని పోలీసు శాఖ చెపుతోంది. అయితే, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు మాత్రం అది ట్రాన్స్‌కోకు సంబంధం లేని స్థలం అని చెబుతున్నారు. ఆ స్థలం పూర్తిగా తమదేనని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆ స్థలంలో పోలీసు అధికారులు భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. దాన్ని విద్యుత్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరిగి మాచవరం పోలీసులు ఆ స్థలంలో బోర్ వేసేందుకు వెళ్లారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అక్కడ బోర్ వేయటానికి వీలులేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసు శాఖ సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. గతంలో ట్రాన్స్‌కో సీఎండీగా పని చేసిన విజయానంద్ మాచవరం పోలీస్ స్టేషన్ నిర్మించుకునేందుకు 800 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని పోలీసు శాఖకు దారాదత్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆ స్థలం ట్రాన్స్‌కోకు సంబంధం లేదని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఇప్పుడుచెబుతున్నారు. ట్రాన్స్‌కోకు సంబంధం లేదు: విద్యుత్ శాఖ గుణదలలో గత 40 ఏళ్ల నుంచి ఏపీఎస్సీడీసీఎల్ ఆధీనంలో స్టోర్స్‌గా ఉపయోగిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, పురాతనమైన మెటీరియల్స్‌తో స్టోర్స్ యార్డుగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్ సబ్ సేషన్లకు సంబంధించి వందలు, వేల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మీటర్లు, ఇతర సామాన్లకు యార్డుగా వినియోగిస్తున్న తమ స్థలం పోలీసులకు ఇచ్చేది లేదని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎన్. వెంకటేశ్వర్లు అంటున్నారు. ఈ విషయమై తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
పూలింగ్ పితలాటకం
సాక్షి, విశాఖపట్నం : పెరుగుతున్న జనాభాకనుగుణంగా భవిష్యత్‌లో విశాఖ పరిసరాల్లో కనీసం 30 వేల ఇళ్లు అవసరమవుతాయని అంచనా. దీనికి తోడు ప్రతిపాదనల్లో ఉన్న పలు ప్రాజెక్టులకు అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ఈ కారణంతో అమరావతి తరహాలోనే ఇక్కడా ల్యాండ్ పూలింగ్ అమలు చేయాలని నిర్ణయించారు. భూముల కొరత కారణంగా భారీ టౌన్‌షిప్‌లు నిర్మించాలని తలపోశారు. ’సరసమైన గృహ నిర్మా ణం’ పేరిట అమలు చేస్తున్న ఈ పథకానికి విశాఖ జిల్లానే ప్రయోగా త్మకంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం గత ఏడాదిగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న కసరత్తులు కొలిక్కి వచ్చాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసర మైన అనుమతులను సత్వరమే మంజూరు చేస్తారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రాయితీలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. సరసమైన గృహ నిర్మాణ పథకం కింద ఆర్థికంగా వెనుకబడినవర్గాల లబ్దిదారుల ఎంపిక, రాయితీ చెల్లింపు రుణ కల్పన, ఈఎంఐ ఖరారు తదితర ప్రక్రియలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇక్కడే ప్రైవేట్ జోక్యం ఈ టౌన్‌షిప్‌ల్లో 70 శాతం స్థలంలో వాణిజ్య అవసరాలకు, 30 శాతం స్థలంలో బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించి ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక్కడే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చోటు కల్పించాలన్నది ప్రభుత్వ పన్నాగం. ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణాల బాధ్యతను తమకు అనుకూలమైన ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చాలన్న ది పెద్దల పన్నాగంగా కనిపిస్తోంది. కాగా ఇప్పుడున్న జీవో ప్రకారం అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో అర్హులైన డీ పట్టాదారులకు 1200 చదరపు గజా లు, ఆక్రమణదారులకు 500 గజాలు చొప్పున స్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంత పెద్ద స్థలాలు కాకుండా డీ పట్టాదారులకు 900 గజాలు, ఆక్రమణదారులకు 250 గజాలు చొప్పున మాత్రమే ఇచ్చేలా కొత్త జీవో జారీ కానుంది. ట్రై జంక్షన్లో పూలింగ్ గాజువాక–సబ్బవరం–పరవాడల మధ్య ట్రై జంక్షన్లో ఉన్న 1600 ఎకరాలను మెగా టౌన్‌షిప్‌ల కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పరదేశీపాలెం, మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఓక్కో చోట 60 నుంచి 80ఎకరాల చొప్పున సుమారు 400 ఎకరాలు గు ర్తించారు. ట్రై జంక్షన్‌లోని 1600 ఎకరాల్లో 700 ఎకరాల వరకు కొండ ప్రాంతాలున్నాయి. 900 ఎకరాల్లో డి పట్టాదారులు, ఆక్రమణదారులున్నా రు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తున్నామన్న విషయాన్ని తెలియనీయకుండా ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి అనుభవదారులు, ఆక్రమణదారులు 300 మందికి పైగా ఉన్నారని ఇప్పటికే గుర్తించారు. కాగా ల్యాండ్ పూలింగ్ గైడ్‌లైన్స్ రూపొందించిన రెవెన్యూ, ఫైనాన్స్, లా సెక్రటరీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక డిప్యూటీ సీఎం వద్ద ఉంది. ఎవరెవరికి ఎంత భూమి ఇవ్వాలనేది కేబినెట్లో చర్చించిన నిర్ణయం తీసుకుంటారు. నెలాఖరులోగా జీవో వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వెంటనే భూ సమీకరణ ప్రారంభమవుతుంది. ట్రై జంక్షన్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ట్రై జంక్షన్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించే భూముల్లో 150 ఎకరాలు అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు కేటాయించనున్నారు. తొలుత స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 250 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని భావించారు. కానీ భూములిచ్చేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఇచ్చినా అందుకు రెట్టింపు విస్తీర్ణంలో భూములు తమకు ఇవ్వాలని మెలిక పెట్టింది. దీంతో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే భూముల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి వీలుగా ఆనందపురం మండలం వేములవలస వద్ద వందెకరాలు, పాలవలసలో 83 ఎకరాలు, మునగపాక మండలం పంచదార్లలో 90 ఎకరాలు, అచ్యుతాపురం మండలం రాజుకోడూ రు, వేల్చేరు, కృష్ణపాలెం గ్రామాల్లోని 70 ఎకరాలు, అచ్యుతాపురంలో 150 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించారు. వీటిలో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ తదితర కేటగిరీల్లో టౌన్‌షిప్‌లు ని ర్మిస్తారు. ల్యాండ్ పూలింగ్‌ద్వారా సమీకరించనున్న భూములతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో మెగా టౌన్ షిప్‌ల నిర్మాణ బాధ్యతలను ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) సంస్థకు అప్పగించనుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా టెండర్లు ఖరారు చేయనున్నారు. -
మరో ‘రింగు’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రానున్న 150 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. రీజనల్ రింగు రోడ్డు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎకోటూరిజం, శాటిలైట్ టౌన్‌షిప్పులు నిర్మించనున్నారు. వరంగల్ మహా నగర మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రూపకల్పనపై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (కుడా) కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సమావేశంలో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మేయర్ నన్నపునేని నరేందర్, రాజ్యసభç సÜభ్యుడు బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అరవింద్‌కుమార్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, హరితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లీ కన్సల్టెన్సీ రూపొందించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వివరాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గౌతమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై సుదీర్ఘంగా చర్చించారు. చివరగా రాష్ట్ర పురపాలక కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలు, సలహాలను తీసుకుని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు తుది రూపం ఇస్తామన్నారు. అనంతరం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి 90 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని చెప్పారు. వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వివరించారు. కొత్తగా రీజనల్ రింగురోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో కొత్తగా రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించారు. ఇప్పటికే ఇన్నర్‌రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులు ఉన్నాయి. రానున్న 150 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రీజనల్ రింగురోడ్డుకు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డుకు చుట్టూ స్టేషన్‌ఘన్‌పూర్– వర్ధన్నపేట–సంగెం–గీసుకొండ–ఆత్మకూరు–ఎల్కతుర్తి –వేలేరు, చెల్పూరు–స్టేషన్‌ఘన్‌పూర్ వరకు రీజనల్ రింగురోడ్డు ఉంటుంది. ఈ రోడ్డును 132 కిలోమీటర్ల నిడివితో రానున్న పదేళ్లలో నిర్మించాలని మాస్టర్‌ప్లాన్ ముసాయిదాలో చేర్చారు. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఔటర్ రింగురోడ్డు , రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య ఉన్న ప్రదేశాల్లో పరిశ్రమలు, ఐటీ పార్కులు, విద్యాసంస్థలు నెలకొల్పేలా రూపకల్పన చేశారు. ఈ రెండు రోడ్ల మధ్యలో ఐదు వందల నుంచి రెండు వేల ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి శాటిలైట్ టౌన్‌షిప్‌లను ‘కుడా’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఆరు ఆదర్శ రహదారులు నగరానికి లైఫ్‌లైన్‌గా ఉన్న 163 జాతీయ రహదారిలో పెద్ద పెండ్యాల నుంచి ధర్మారం వరకు మొత్తం 36 కిలోమీరట్ల రోడ్డును మోడల్ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఫాతిమానగర్ – కేయూసీ, ములుగురోడ్డు–పెద్దమ్మగడ్డ– కేయూసీ, డీఈఓ కార్యాలయం నుంచి హంటర్ రోడ్డు – నాయుడు పెట్రోల్ పంప్ వరకు, నాయుడు పెట్రోల్ పంపు నుంచి వయా ఖిలావరంగల్ – బస్టాండ్ – వెంకట్రామ థియేటర్, పోచమ్మమైదాన్ – సీకేఎం కళాశాల – ఆరేపల్లి వరకు, లేబర్‌కాలనీ నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వరకు గల ప్రధాన రహదారులను మోడల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇరువైపులా డ్రెయినేజీ, ఫుట్‌పాత్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీని పెంచుతారు. దీంతో పాటు కనీసం పది ట్రాఫిక్ జంక్షన్లను విస్తరించి అభివృద్ధి చేయాలని ముసాయిదాలో పొందుపరిచారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్.. ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ఇక్కడ సుమారు 200కు పైగా ఎకరాలను గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. సైనిక పాఠశాలకు ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. ఈ రెండు విద్యాసంస్థలకు కేటాయించిన స్థలాన్ని మినహాయిస్తే ఇంకా 120 ఎకరాల స్థలం అందుబాటులో ఉంటుంది. ఇందులో సకల సౌకర్యాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో స్పోర్ట్స్ హాస్టల్, ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటాయి. జాతీయ రహదారికి పక్కన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం పలురకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేవనూర్, ముప్పారం గ్రామాల మధ్య థీం పార్కు ఏర్పాటు చేయలాలని నిర్ణయించారు. దేవనూర్ ఇనుపరాతి గుట్టల్లో గ్రీనరీ మరింతగా పెంచి ఎకో టూరిజానికి అనువుగా మార్చాలని ప్రతిపాదించారు. దీని పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువును అనుసంధానం చేసుకుని రిక్రియేషన్ జోన్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని చెరువుల సంరక్షణకు ఎఫ్టీఎల్ నిర్ధారించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. భæద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి, ఉర్సు చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రణాళికలో రూపొందించారు. -
ఆటలను కెరీర్‌గా ఎంచుకోండి!
ప్రధాని మోదీ పిలుపు అహ్మదాబాద్: క్రీడాకారుల పట్ల మన ప్రజల ఆలోచనా విధానం మారాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వారు కూడా సైనికుల తరహాలోనే దేశం కోసం పోరాడతారని ఆయన గుర్తు చేశారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వాతావరణం దేశంలో ఎక్కువగా లేదని, దానిని తాను మార్చాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఇక్కడ ‘ది ఎరీనా’ పేరుతో రూపొందించిన భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ వేదికలో అత్యుత్తమ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఆటగాళ్లతో సంభాషించే సమయంలో మనలో కొంత మంది మీరు బతకడానికి ఏం చేస్తుంటారు అని అడుగుతుంటారు. ఇది సరిహద్దుల్లో ఉండే సైనికులను మీరేం చేస్తుంటారని ప్రశ్నించడంలాంటిదే. ఈ ధోరణి మారాలి. ఆటగాళ్లు తమ విజయాలతో దేశం గర్వపడేలా చేస్తారు. క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవాలని నేను కోరుతున్నా. ఒకవేళ అది సాధ్యం కాకపోయినా ప్రతీ ఒక్కరు ఏదో ఒక ఆటను ఆడే సంస్కృతిని అలవర్చుకోవాలి. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఎలా ఉండాలో క్రీడలు నేర్పిస్తాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), గగన్ నారంగ్ (షూటింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్), బైచుంగ్ భూటియా (ఫుట్‌బాల్), అనూప్ కుమార్ (కబడ్డీ), క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, పుజారా, పార్థివ్, ఉనాద్కట్, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు స్మార్ట్ సిటీల అభివృద్ధికి మోదీ శ్రీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రాజెక్టు పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 25న శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని తొలి స్మార్ట్ సిటీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి మొత్తం రూ. 1,770 కోట్ల విలువైన 69 అభివృద్ధి పనులను పుణే వేదికగా మోదీ ప్రారంభిస్తారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తొలిదశలో 20 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా పుణెలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. అలాగే, కాకినాడలో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులతోపాటుగా ఈ-రిక్షాల పంపకం, ఈ-పాఠశాల ప్రాజెక్ట్‌లనూ మోదీ ప్రారంభిస్తారు. పౌరులనుంచి స్మార్ట్ సిటీ నిర్మాణాలకు అవసరమైన సూచనల కోసం మేక్ యువర్ సిటీ స్మార్ట్ పేరుతో పోటీలనూ ప్రారంభిస్తారు. నిర్మాణాత్మక సూచనలు చేసిన వారికి రూ. 10 వేల నుంచి లక్ష వరకూ నగదు ప్రోత్సాహాకాన్ని అందజే స్తారు. పట్టణాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి తగిన ఆలోచనలను పంచుకునేందుకు ‘స్మార్ట్ నెట్ పోర్టల్’ను కూడా అదేరోజు ఆవిష్కరిస్తారు. -
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై క్రీనీడ
విజయనగరం మున్సిపాలిటీ: గతమెంతో ఘనం..వర్తమానం దైన్యం..అన్నట్లు తయారైంది క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన విజయనగరంలో క్రీడామైదానాల పరిస్థితి. అందరికీ అందుబాటులో జిల్లాకేంద్ర నడిబొడ్డున గల రాజీవ్ క్రీడామైదానం ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2014వ సంవత్సరంలో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ ధాటికి కొన్ని వనరులు పాడవగా..కేవలం నష్ట అంచనాలు రూపొందించడం మినహా అంతకుమించి ఒక్కడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా మైదానం నిర్వహణ భారం మోయలేమని బాధ్యతలను తీసుకోవడానికి క్రీడాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాంప్లెక్స్‌లోని మౌలిక సౌకర్యాలు మరుగునపడుతున్నాయి. నిర్వహణకు నెలకు రూ20వేలు అవసరం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు నిధులు కరువయ్యాయి. నెలవారీ దీని నిర్వహణకు సుమారు రూ.20 వేల వరకూ అవసరం ఉంటుంది. అయితే ఆ నిధులు ప్రత్యేకంగా ఎక్కడ నుంచీ వచ్చే అవకాశం లేకపోవడం వల్ల డీఎస్ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల వరకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడాపోటీలను ఉడా అనుమతితో నిర్వహించి, అందుకు అయిన ఖర్చును పోటీల నిర్వాహకుల నుంచి వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. ఫలితంగా మైదానం ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే ఇండోర్‌లోని ఉడెన్ గ్రౌండ్, వసతి గదులు, ప్రధాన ప్రవేశద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపం నెలకొంది. రాత్రి , పగలు తేడా లేకుండా మైదానం ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. గతంలోనే సూచించినా ప్రయోజనం శూన్యం మైదానం నిర్మాణ సమయంలోనే వాణిజ్య దుకాణాలు నిర్మించడం ద్వారా వాటిపై వచ్చే అద్దెతో నిర్వహణ చేయాలని ప్రతిపాదన వచ్చినా అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేడియం పడమర, ఉత్తర ప్రాంతాల్లో ప్రహరీ ఆనుకొని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తే వాటి ఆదాయంతో నిర్వహణ సమస్య తీరుతుందని పలువులు సూచించారు. అయితే ఆ ప్రతిపాదనను అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు తోసిపుచ్చడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నిర్వహణకు స్థిరాదాయ వనరులు కావాలి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహణకు స్థిరంగా ఆదాయం వచ్చే వనరులు కావాల్సి ఉందని డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. కాంప్లెక్స్ పరిసరాలలో వాణిజ్య భవనాలు నిర్మించే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. స్వతహాగా తమ శాఖకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే బాధ్యతలను తీసుకోలేదని వివరించారు. భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నిధులను వెచ్చిస్తే కాంప్లెక్స్ అభివృద్ధి సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. -
ఆటకేదీ ఆదరణ?
సిటీలోని ప్రముఖ స్టేడియాలు... ♦ అంబర్‌పేట స్టేడియం ♦ గోల్కొండ ప్లేగ్రౌండ్ ♦ పటేల్ ప్లేగ్రౌండ్, శాలిబండ ♦ విక్టరీ ప్లే గ్రౌండ్ , చాదర్‌ఘాట్ ♦ విజయనగర్ కాలనీ స్పోర్టింగ్ గ్రౌండ్ ♦ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల మేరకు లేఔట్లలో 10 శాతం ఖాళీ స్థలాలుండాలి. వీటిని ఆటస్థలాలు, ఉద్యానవనాలకు వినియోగించాలి. కానీ నగరంలో ఈ నిబంధన కాగితాలకే పరిమితమైంది. ఖాళీ స్థలాలు 3 శాతం మించి లేవు. ఉన్న వాటిల్లోనూ ఆటస్థలాలకు వినియోగిస్తున్నవి తక్కువే. అసలే అరకొరగా ఉన్న ఆటస్థలాలు ఏటికేడు అదృశ్యమవుతున్నాయి. కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నగరంలో ఒకప్పుడు 725 ప్లేగ్రౌండ్స్ ఉండగా, అవి 600కు తగ్గాయి. తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే ప్రస్తుతం 521 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎన్ని ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి. పాలకులు, అధికారులు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరకొర సౌకర్యాలు... ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల్లో సదుపాయాలు లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్నాయని జీహెచ్ఎంసీ సెలవిస్తుండగా, వాస్తవంలో మాత్రం భిన్నంగా ఉంది. ఆటస్థలాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు ఆసక్తి కొద్దీ వెళ్లే పేద క్రీడాకారులకు క్రీడాపరికరాలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు సొంతంగా పరికరాలు కొనుక్కోలేక క్రీడాసక్తిని చంపుకోవాల్సి వస్తోంది. ఆరుబయట ఆటస్థలాలు లేక, అపార్టుమెంట్లలో కొనసాగుతున్న విద్యాసంస్థల్లోనూ క్రీడలకు అవకాశాల్లేక భవిష్యత్ తరాలు ఆటలకు దూరమవుతున్నాయి. పాయింట్ అవుట్... ► జోన్‌కు ఐదు చొప్పున ఐదు జోన్లలో 25 ప్లేగ్రౌండ్స్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ► 46 ఏళ్ల పాటు నిరాటంకంగా నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు 2015లో స్వస్తి పలికారు. 2014లో 1260 సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, 2015లో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. ► కనీసం 10 శాతం ఖాళీ స్థలాలుండాల్సి ఉండగా, మూడు శాతం కూడా లేని దుస్థితి. ఉన్న వాటిలోనూ ఆటస్థలాలు 25 శాతమే. అక్కడక్కడ కొన్ని ఖాళీ స్థలాలు పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగపడుతుండగా, వాటినీ లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► క్రీడాకారులకు ఎంతో సదుపాయంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సైతం కళాభారతి నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ► 1000 జిమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏడాదైనా వాటి జాడ లేదు. వీటి కోసం బడ్జెట్లో భారీగా నిధులు కూడా కేటాయించారు. ► ఆయా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఆటస్థలాల నిర్వహణ, ఇతరత్రా సదుపాయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లు కేటాయించగా.. రూ.కోటి మాత్రమే ఖర్చు చేశారు. ► స్పోర్ట్స్ విభాగం పేరిట ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.60 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఆధునీకరణ తదితర పనులు వీటిలో ఉన్నాయి. కానీ ఇదీ కార్యరూపం దాల్చలేదు. ► క్రీడా విభాగానికి సంబంధించిన 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద్దెకు ఆటస్థలాలు నగరంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని, నానాటికీ తగ్గిపోతున్న ఆటస్థలాలను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ ప్రస్తుత కమిషనర్ జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాసంస్థలకు ఆటస్థలాలను అద్దెకిచ్చేందుకు నిర్ణయించారు. అయినప్పటికీ విద్యాసంస్థల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ప్రోత్సాహం కరవు అరవింద్, అంబర్‌పేట నగరంలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేదు. ఆటస్థలాలకు క్రీడా పరికరాలు సరఫరా చేయడం లేదు. ఎవరి క్రీడా పరికరాలు వారే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆటస్థలాల అభివృద్ధిలో జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గ్రౌండ్స్‌లో ఏదైనా పాడైపోతే మరమ్మతులకే నెలల సమయం పడుతోంది. ఈ పరిస్థితి మారాలి. ఆటస్థలాల అభివృద్ధికి కృషి చేసే వారికే నా ఓటు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరిలో ‘ఆట’విడుపునకు అంగుళం స్థలం కూడా దొరకని పరిస్థితి. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి ఆటస్థలాలు అదృశ్యమవుతున్నాయి. కొన్ని ఉన్నా వాటిలో సదుపాయాల లేమి. అరకొర వసతులతో క్రీడాకారులకు అష్టకష్టాలు. అభివృద్ధి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైన.. పాలకుల నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యాల ఫలితమిది. గ్రేటర్ ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం జపిస్తూ.. హామీలతో అదరగొడుతున్న నాయకులారా.. ఆటస్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే వారికే తమ ఓటు అంటున్నారు సిటీజనులు. - సాక్షి, సిటీబ్యూరో, అంబర్‌పేట భ్రమలో అధికారులు.. రజినీకాంత్, బాగ్ అంబర్‌పేట ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలు అసలైన క్రీడాకారులకు అందుబాటులో ఉండడం లేదు. వ్యాయామం, విశ్రాంతి కోసం వచ్చే వారితో మైదానాలు నిండిపోతున్నాయి. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆట స్థలాలున్నాయి.. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామనే భ్రమలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. ఆటస్థలాలు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకొనే నాయకులకే నా ప్రాధాన్యం. -
ఢిల్లీలో అకాడమీని ప్రారంభించిన సైనా
గౌర్ సిటీలో ఏర్పాటు కోచ్‌గా కొత్త అవతారం న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కెరీర్లో మరో ముందడుగు వేసింది. క్రీడాకారిణిగా కొనసాగుతూనే.. తన తొలి అకాడమీని కూడా ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీలో సకల సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేసింది. గౌర్ సిటీలోని 18 ఏకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో డేనైట్ క్రికెట్ స్టేడియం, ఫుట్‌బాల్ ఫీల్డ్, అథ్లెటిక్స్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులు, బాక్సింగ్ రింగ్, 25 మీటర్ల షూటింగ్ రేంజ్, వుడెన్ బాస్కెట్‌బాల్ కోర్టుతో పాటు 25 వేల కుటుంబాలు నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సిటీలో బ్యాడ్మింటన్ అకాడమీ కూడా ప్రారంభమైంది. అకాడమీ కోచ్‌గా తానే పని చేస్తానని సైనా తెలిపింది. ‘వీలైనంత ఎక్కువ సమయం పిల్లలకు కోచింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆరంభంలో ఇది ఎలా నడుస్తుందో చూద్దాం. పిల్లలు బాగా రాణిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌లను తెచ్చేందుకు ప్రయత్నిస్తా. మరింత ప్రొఫెషనల్‌గా దీన్ని తీర్చిదిద్దుతా. ఈ అకాడమీ ద్వారా నాణ్యమైన క్రీడాకారులను తయారు చేస్తా’ అని సైనా వ్యాఖ్యానించింది. -
ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూలు
విజయవాడ స్పోర్ట్స్ :రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.315 కోట్లతో స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వీసీ అండ్ ఎండీ కె.ఆర్.వి.హెచ్.ఎన్.చక్రవర్తితెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్‌తో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూళ్లను అనుసంధానం చేస్తామన్నారు. రాజీవ్ ఖేల్ అభియాన్ ద్వారా ప్రతి మండలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం వంటి అంతర్జాతీయస్థాయి సదుపాయాలు ఉన్న స్టేడియాల నిర్మాణం ఇక్కడా జరగాల్సి ఉందన్నారు. విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని క్రీడా మైదానాలు, మౌలిక వసతులను ఆయన డీఎస్డీఓ పి.రామకృష్ణతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే 2017 నేషనల్ గేమ్స్‌ను బిడ్ ద్వారా ప్రాథమికంగా గోవా రాష్ట్రానికి కేటాయించారని, అయినా విభజన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని చెప్పారు. కనీసం 2019లో నేషనల్ గేమ్స్‌ను ఏపీలో నిర్వహించడానికి గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. త్వరలో శాప్ కార్యాలయం విజయవాడలో ఏర్పాటుకు స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. సుమారు రూ.45 కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్రంలో ఆధునిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌లు, ఆస్ట్రోటర్ఫ్ ఫీల్డ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్టంలో క్రీడాభివృద్ధికి దాతలు, కార్పొరేట్ సంస్థల సాయం కోరతామన్నారు. వారిచ్చే నిధులకు టాక్స్ మినహాయింపు ఇస్తామన్నారు. స్టేడియాలకు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.50 వేలకు పైగా నిధులు ఇచ్చే దాతల పేర్లు పెట్టడం, లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇవ్వడం వంటి పద్ధతులు అవలంబిస్తామని తె లిపారు. జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి ఇసుక సీనరేజ్ (3 శాతం), ప్రాపర్టీ టాక్స్ (3 శాతం), ఎక్సైజ్ శాఖ (5 శాతం) నిధులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సమకూరేలా జీఓలను అమలు చేస్తామని వివరించారు. కోచ్‌ల ప్రతిభ ప్రకారం మరింత ప్రోత్సహిస్తామన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని, విద్యాధరపురంలో స్టేడియం కోసం కేటాయించిన స్థలాన్ని చక్రవర్తి పరిశీలించారు. -
ఈత కొలనుపై రాజకీయ క్రీనీడలు
చివరకు క్రీడలపైనా రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. ఆ వేదికలను ఇప్పుడు తమ అధికార బల నిరూపణకు, పెత్తనానికి వాడు కుంటున్నారు. దీని కోసం నిస్సిగ్గుగా వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్, టీడీపీ వర్గాల వారు బాహాబాహీకి దిగారు. గాయాలయ్యేలా తన్నుకున్నారు. స్థానికులను, క్రీడాకారులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారు. ఇందంతా ఎందకయ్యా అంటే... ఆ కాంప్లెక్స్‌పై పెత్తనం కోసమట... ఒక పార్టీ కబ్జాలో ఉన్న ఈ ఈత కొలనును మరో పార్టీ నేతలు కబ్జాకు యత్నించే సమయంలో దాడులు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్లో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్డీఓ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజకీయాలకు వేదికైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులు డీఎస్డీఓ నిర్వహణలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై పెత్తనం చెలాయిస్తున్నారు. అక్కడ వారు చెప్పిందే వేదం. వారి ఇష్టం మేరకే ఏమైనా జరగాలి. అక్కడేం జరిగినా అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. గత అధికారపక్షమైన కాంగ్రెస్ హాయం నుంచి నాయకుల కనుసన్న లో ఈకాంప్లెక్స్ నడుస్తోంది. ఇప్పుడు ఈఅక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై టీడీపీ నేతల దృష్టి పడింది. పెత్తనం తమ చేతికి తెచ్చుకోవాలనుకున్నారు. గాజులరేగకు చెందిన టీడీపీ కార్యకర్తొకరు ఆధిపత్యం కోసం బీజం నాటే ప్ర యత్నం చేశారు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వారితో సమావేశం ఏర్పాటు చేసి, దానికి ఎమ్మెల్యేను, జెడ్పీ చైర్‌పర్సన్‌ను అహ్వానించి పాగా వేయాలని పావులు కదిపారు. అయితే, అప్పటికే పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని పసిగట్టి, కొత్తగా జెం డా పాతేందుకు ప్రయత్నించిన వారితో ఇటీవల గొడవకు దిగారు. చినికి చినికి గాలివానగా మారి కొట్లాట కు దారితీసింది. గాయాలయ్యేలా కొట్టుకోవడమే కాకుండా ఇళ్లపై దాడి చేసేంతవరకు పరిస్థితి వెళ్లింది. ఇంత జరిగినా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు ఇరువర్గాలూ ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్నాయి. నువ్వా...నేనా అంటూ సవాల్ విసురుకుంటున్నాయి. ఆ రెండు వర్గాలకు సంబంధిత పార్టీల నాయకులు అండగా నిలుస్తున్నారు. ఎంతవర కు వెళ్తుందో చూద్దామనే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోం ది. మొత్తానికి వివాదం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. కాకపోతే, దీనిని రెండు వర్గాల గొడవగా చిత్రీకరించా రు. పెత్తనం కోసం పోరాటంగా ఎక్కడా బయటపడలేదు. మొత్తానికి ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని ఆ వర్గాల మధ్య తాము బలి పశువు కావల్సి వస్తుందేమోనని అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే క్రీడాకారులు భయపడుతున్నారు. ఏదేమైనా స్మిమ్మింగ్ పూల్, జిమ్ ఉన్న అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వర్గ రాజకీయాలకు వేదికైంది. అధికారుల ఆధ్వర్యంలో నడాల్సిన కాంప్లెక్స్‌లో నాయకుల పెత్తనం కొనసాగుతోంది. అధికార యంత్రాంగం కూడా ఎందుకొచ్చిందని చోద్యం చూస్తోంది. ఇదే విషయమై జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి మనోహర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అక్కడ గొడవ జరిగిన విషయం తమదృష్టికొచ్చిందని, కొట్టుకున్నట్టు సమాచారం ఉందని, పోలీసులు కూడా వచ్చి ఆరాతీసారని, వారి మధ్య ఉన్న మనస్పర్ధలే గొడవకు కారణమని చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఆధిపత్యం, పెత్తనమనేది అక్కడ లేదని, తమ ఆధ్వర్యంలోనే నడుస్తోందని వివరణిచ్చారు. -
బౌలింగ్‌లో.. జిల్లా జట్టు అదుర్స్
- 201 పరుగులకే ఆలౌట్ అయిన కృష్ణా జట్టు విజయనగరం మున్సిపాలిటీ: అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో భాగంగా జిల్లాలో జరుగుతున్న రెండ వ రౌండ్ మ్యాచ్‌లో అతిథ్య విజయనగరం జట్టు క్రీడాకారులు రెండవ రోజు శుక్రవారం బౌలింగ్ విభాగంలో అదరగొట్టారు. పట్టణ శివారులో గల విజ్జిస్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పి.తేజస్వి 51 పరుగులిచ్చి ఐదు వికె ట్లు, పి.తపశ్వి 78 పరుగులిచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 70 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు క్రీడాకారులు 73.4 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేశారు. జట్టులో ఎ.మనోజ్‌కుమార్ ఐదు ఫోర్లతో 42 పరుగులు, వి.అనిరుధ్ నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన విజయనగ రం జట్టు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్ల లో వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసిన ప.గోజట్టు డాక్టర్ పీవీజీ.రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నెల్లూరు-ప.గో జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్ రెండవ రోజు ఆటలో పశ్చిమగోదావరి జట్టు క్రీడాకారులు 36.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టాని కి 105 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 23 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు వద్ద ప.గో జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. జట్టులో మునీష్‌వర్మ 11 ఫోర్లతో 52 పరుగులు చేయగా, మరో క్రీడాకారుడు జీఎస్ఎస్ స్వామినాయుడు ఐదు ఫోర్లతో 26 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో నెల్లూరు క్రీడాకారులు హర్ష, మణికంఠ లు చెరో రెండు వికెట్లు తీశారు.