సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రాజెక్టు పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 25న శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని తొలి స్మార్ట్ సిటీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి మొత్తం రూ. 1,770 కోట్ల విలువైన 69 అభివృద్ధి పనులను పుణే వేదికగా మోదీ ప్రారంభిస్తారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తొలిదశలో 20 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా పుణెలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు.
అలాగే, కాకినాడలో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులతోపాటుగా ఈ-రిక్షాల పంపకం, ఈ-పాఠశాల ప్రాజెక్ట్‌లనూ మోదీ ప్రారంభిస్తారు. పౌరులనుంచి స్మార్ట్ సిటీ నిర్మాణాలకు అవసరమైన సూచనల కోసం మేక్ యువర్ సిటీ స్మార్ట్ పేరుతో పోటీలనూ ప్రారంభిస్తారు. నిర్మాణాత్మక సూచనలు చేసిన వారికి రూ. 10 వేల నుంచి లక్ష వరకూ నగదు ప్రోత్సాహాకాన్ని అందజే స్తారు. పట్టణాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి తగిన ఆలోచనలను పంచుకునేందుకు ‘స్మార్ట్ నెట్ పోర్టల్’ను కూడా అదేరోజు ఆవిష్కరిస్తారు.
రేపు స్మార్ట్ సిటీల అభివృద్ధికి మోదీ శ్రీకారం
Published Fri, Jun 24 2016 12:59 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement