- 201 పరుగులకే ఆలౌట్ అయిన కృష్ణా జట్టు
విజయనగరం మున్సిపాలిటీ: అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో భాగంగా జిల్లాలో జరుగుతున్న రెండ వ రౌండ్ మ్యాచ్‌లో అతిథ్య విజయనగరం జట్టు క్రీడాకారులు రెండవ రోజు శుక్రవారం బౌలింగ్ విభాగంలో అదరగొట్టారు. పట్టణ శివారులో గల విజ్జిస్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పి.తేజస్వి 51 పరుగులిచ్చి ఐదు వికె ట్లు, పి.తపశ్వి 78 పరుగులిచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 70 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు క్రీడాకారులు 73.4 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేశారు. జట్టులో ఎ.మనోజ్‌కుమార్ ఐదు ఫోర్లతో 42 పరుగులు, వి.అనిరుధ్ నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన విజయనగ రం జట్టు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్ల లో వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది.
5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసిన ప.గోజట్టు
డాక్టర్ పీవీజీ.రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నెల్లూరు-ప.గో జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్ రెండవ రోజు ఆటలో పశ్చిమగోదావరి జట్టు క్రీడాకారులు 36.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టాని కి 105 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 23 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు వద్ద ప.గో జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. జట్టులో మునీష్‌వర్మ 11 ఫోర్లతో 52 పరుగులు చేయగా, మరో క్రీడాకారుడు జీఎస్‌ఎస్ స్వామినాయుడు ఐదు ఫోర్లతో 26 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో నెల్లూరు క్రీడాకారులు హర్ష, మణికంఠ లు చెరో రెండు వికెట్లు తీశారు.
బౌలింగ్‌లో.. జిల్లా జట్టు అదుర్స్
Published Sat, Jun 21 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement
Advertisement