'దివీస్' కు వ్యతిరేకంగా పాదయాత్ర: రాళ్ల దాడి | tdp workers attack on divis laboratory dharna | Sakshi
Sakshi News home page

'దివీస్' కు వ్యతిరేకంగా పాదయాత్ర: రాళ్ల దాడి

Published Thu, Feb 18 2016 12:14 PM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

tdp workers attack on divis laboratory dharna

తగరపువలస: విశాఖపట్టణం జిల్లా తగరపువలస సమీపంలోని భీమిలి వద్ద దివీస్ ల్యాబొరేటరీ 3వ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం పాదయాత్ర నిర్వహిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు, 5 గ్రామాల ప్రజలు శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళకారులను చెదరగొట్టారు.

వైఎస్సార్‌సీపీ తగరపువలస మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సీపీఎం నేత మూర్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో వెయ్యి మంది ప్రజలు పాల్గొన్నారు. పాదయాత్ర కొనసాగుతోంది. దివీస్ ల్యాబొరేటరీ యూనిట్ నిర్మిస్తే కంచేరుపాళెం గ్రామాన్ని ఖాళీచేయాల్సి వస్తుంది. దాంతో చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement