మా పార్టీ అధికారం లో ఉంది
విజయనగరం ఆరోగ్యం: కాంగ్రెస్ పార్టీ దళారుల పార్టీ...దోపిడీ దొంగల పార్టీ అని విమర్శించిన టీడీపీ నేతలు తీరా అధికారంలోకి వచ్చాక.. గత పాలకులు అనుసరించిన విధానాలనే అవలంభిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు అధికారంలోకి రావడంతో గతంలో చెప్పిన నీతి సూత్రాలను మరిచిపోయి నాలుగు రాళ్లు వెనుకేసుకునే పనిలో పడ్డారు.అందుకు వివిధ శాఖల్లో ఆ దాయం వచ్చే కాంట్రాక్ట్‌లపై కన్నేస్తున్నారు. తాజాగా కేంద్రాస్పత్రి శానిటేషన్ సబ్ కాంట్రాక్ట్‌పై ఆ నేతల కన్ను పడింది. అనుకున్నదే తడువుగా ఆస్పత్రికి చెం దిన ఓ అధికారి ద్వారా శానిటేషన్ కాంట్రాక్టర్‌తో టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత రెండు రోజులు క్రితం మం తనాలు చేసినట్టు సమాచారం. ‘మా పార్టీ అధికారం లో ఉంది. మీకు బిల్లులు సకాలంలో చెల్లించాలంటే మా వాడికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని సదరు నేత... కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్టు భోగట్టా. దీంతో సదరు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.
కాంగ్రెస్ పాలకులే ఆదర్శం
గతంలో కూడా కేంద్రాస్పత్రిలో ఇదే అనవాయితీ నడిచేది. గతంలో హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు కేంద్రాస్పత్రిలో శానిటేషన్ చేసే కాంట్రాక్టు వచ్చింది. అయితే అప్పట్లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడికి సబ్ కాంట్రాక్టు ఇచ్చారు. అసలు కాంట్రా క్టర్ ఎప్పుడూ ఇక్కడ పనులు చేపట్టలేదు. మళ్లీ అదే అనావాయితీకి టీడీపీ తెరతీసింది. సబ్ కాంట్రాక్టు దక్కించుకు నేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
పారిశుద్ధ్య కార్మికులకు నష్టం
కేంద్రాస్పత్రిలో శానిటేషన్ కాంట్రాక్ట్‌ను సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడం వల్ల పారిశుద్ధ్య కార్మికులు నష్టపోనున్నా రు. అసలు కాంట్రాక్టర్ అయితే జీతాలు పూర్తిస్థాయి లో ఇస్తాడు. అదే సబ్ కాంట్రాక్టర్ జీతాలు సరిగ్గా ఇవ్వకపోగా.. కోత కూడా విధిస్తారు. గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో పారిశుద్ధ్య కార్మికుల్లో ఆం దోళన మొదలైంది. వీరికి నెలకు రూ. 6500 ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 2500 మాత్రమే ఇస్తున్నారు.