బీజేపీతో పొత్తు కొనసాగుతుంది: కామినేని
బీజేపీతో పొత్తు కొనసాగుతుంది: కామినేని
Published Tue, Nov 4 2014 10:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపితో పొత్తు అంశంపై తాము పునరాలోచన చేసుకుంటామని మంత్రి రావెల కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలపై కామినేని మాట్లాడటానికి నిరాకరించారు.
రాష్ట్రంలో 1000 జనరిక్ మందుల షాపుల ఏర్పాటకు ప్రణాళిక సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గ్రామీణ ఆస్పత్రుల్లో కూడా కార్పోరేట్ స్థాయి వైద్యానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
Advertisement
Advertisement