సాక్షి, కాకినాడ: తెలుగు పద్యం చెప్పలేదని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులపట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఈ అనాగరిక ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం భీమవరం ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. తెలుగు పద్యాన్ని అప్పజెప్పనందుకు ఓ ఉపాధ్యాయుడు 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏటీడబ్ల్యూవోను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.
తెలుగుపద్యం చెప్పలేదని.. దారుణం!
Published Sun, Dec 3 2017 11:45 AM | Last Updated on Sun, Dec 3 2017 1:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment