ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి నాయకత్వంలో సంఘ నాయకులు, ఉపాధ్యాయులు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీ వైవీతో కేక్ కట్ చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.వెంకటేశ్వరరెడ్డి, జి.చంద్రశేఖర్, పి.శేషిరెడ్డి, సీహెచ్ భాస్కరరెడ్డి, పులి అంజిరెడ్డి, శిగా మోహన్‌రావు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, జె.శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, నాయబ్స్రూల్ పాల్గొన్నారు.
బీఈడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
బీఈడీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ నాయకులు జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఇతర అధికారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు జీఎస్‌ఆర్ సాయి, ఎన్.శరత్‌బాబు, జిల్లా నాయకులు పి.రమణకుమార్, కె.రవికాంత్, దశరథరామిరెడ్డి, ఎల్.నారాయణరెడ్డి, ప్రసాద్, బి.కోటేశ్వరరావు, కాలేషావలి పాల్గొన్నారు.
ఆపస్ ఆధ్వర్యంలో..
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) గోడపత్రికను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. ఆపస్ టేబుల్ క్యాలెండర్‌ను బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సీతారామయ్య, కె.మల్లికార్జునరావు, రాష్ట్ర కోశాధికారి సీహెచ్ శ్రావణ్, కార్యదర్శి ఎ.బలరామకృష్ణ, జిల్లా బాధ్యులు ఎస్.హనుమంతురావు, కె.శేషారావు, జి.ప్రతాప్, దిలీప్‌చక్రవర్తి, చంద్రశేఖర్, వీఎన్‌ఆర్ మూర్తి పాల్గొన్నారు.
పండిత పరిషత్ ఆధ్వర్యంలో..
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పండిత పరిషత్ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో పండిత పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పి.మహబూబ్‌ఖాన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌బాబు,వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖయూంబాషా, కోశాధికారి రఘుబాబు, వీరేంద్ర, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఎస్‌టీయూ ఆధ్వర్యంలో..
రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) నూతన సంవత్సరం 2015 డైరీ, క్యాలెండర్లను కలెక్టర్ విజయకుమార్ ఆవిష్కరించారు. 2014 సంవత్సరంలో విడుదలైన జీవోల పుస్తకాన్ని జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాసులు, కె.ఎర్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వెంగళరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్‌వీ ప్రసాద్, అజయ్‌కుమార్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగన్‌మోహన్, సతీష్, సురేష్, బాలగురవయ్య, తిరుపతిస్వామి, సుబ్బారావు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో..
ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆ సంఘ ఉపాధ్యాయులు కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఖజానా శాఖ ఉపసంచాలకులు కె.లక్ష్మీకుమారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ సుబ్బారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.శ్రీనివాసులు, కె.శ్యాంసుందరరావు, ఎం.రాఘవరావు, పీపీ రంగారెడ్డి, ఎ.అమ్మయ్య, ఏవీ సుబ్బారావు, పి.ఆంజనేయులు, ఐ.హనుమంతురావు, పి.వెంకటేశ్వర్లు, ఎన్.వీరయ్య పాల్గొన్నారు.
ఏపీజీటీఏ ఆధ్వర్యంలో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2015 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.మాల్యాద్రిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి.సంజీవి, జిల్లా అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ప్రధానకార్యదర్శి జీవీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు జేవీ సుబ్బయ్య, ఓంకారయ్య పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల నూతన సంవత్సర వేడుకలు
Published Fri, Jan 2 2015 2:26 AM | Last Updated on Wed, Oct 17 2018 4:32 PM
Advertisement
Advertisement