ఆటోలో యువతిని ముద్దాడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి | Techie held for Kissing Girl in Auto at Kukatpally | Sakshi
Sakshi News home page

ఆటోలో యువతిని ముద్దాడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

Published Sun, Jan 5 2014 2:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆటోలో యువతిని ముద్దాడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి - Sakshi

ఆటోలో యువతిని ముద్దాడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

హైదరాబాద్: కొంటె పని చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కటకటాలపాలయ్యాడు. ఆటోలో చేసిన ఆకతాయి పని అతడిని అవస్థలపాలు చేసింది. తప్పుడు పని చేసి పారిపోవాలనుకున్న అతని పన్నాగం ఫెయిలయి అన్పాపులర్ అయ్యాడు. కూకట్‌పల్లిలోని నిజాంపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలావున్నాయి. పేరుపొందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడు ఆటోలో వెళ్తున్న యువతులను టీజ్‌ చేశాడు. అయ్యగారు అక్కడితో ఆగలేదు.

నెమ్మదిగా వెళుతున్న ఆటో దగ్గరకు వెళ్లి అందులో ప్రయాణిస్తున్న ఓ యువతిని అమాంతంగా ముద్దుపెట్టుకుని పారిపోబోయాడు. దీన్ని గమనించిన స్థానికులు శ్రీనివాస్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ముద్దుబాబుకు బుద్ధొచ్చేలా బాది తర్వాత పోలీసులకు అప్పగించారు. కూకట్పల్లి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన కొందరు యువతుల పట్ల ఈ శ్రీనివాస్‌ అలియాస్‌ వైరస్‌ అసభ్యంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఎంతో మంది ఎన్నో విధాలుగా హెచ్చరించినా అతడి బుద్ధి మారలేదు. చివరకు ముద్దుబాబు జైలుపాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement