తల్లి ఎదుటే కిడ్నాప్‌కు యత్నించిన యువకుడు | Teenager Tried To Kidnap A Girl In West Godavari Palakoderu | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరిలో కిడ్నాప్‌ కలకలం

Published Tue, Apr 30 2019 5:15 PM | Last Updated on Tue, Apr 30 2019 6:38 PM

Teenager Tried To Kidnap A Girl In West Godavari Palakoderu - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్‌ కలకలం రేపింది. విస్సాకోడేరు సెంటర్‌లో వెళుతున్న యువతిని.. ఓ యువకుడు కారులోకి లాక్కోని వెళ్లిపోయాడు. వివరాల్లోకి అరుణకుమారి తన కూతరు అనుషాతో కలిసి వెళుతున్న సమయంలో కారులో వచ్చిన ఒక యువకుడు అనుషాను కారులో బలవంతంగా ఎక్కించాడు. ఇది చూసిన అరుణకుమారి కారు డోర్‌ పట్టుకుని వేలాడుతూ అడ్డుపడ్డారు. కానీ ఆ యువకుడు అవేమీ పట్టించుకోకుండా కారును వేగంగా ముందుకు తోలాడు.

దీనిని గమనించిన స్థానికులు ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఈలోపే ఆ యువకుడు అనుషాను విస్సాకోడేరు నుంచి భీమవరం మండలం తాడేరు వరకు దాదాపు 10 కి.మీ తీసుకునివెళ్లాడు. అనుషాను రక్షించిన స్థానికులు ఆ యువకుడిని చితకబాది.. పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కిడ్నాప్‌కు యత్నించిన సదురు యువకుడిని కాలేష్‌గా గుర్తించారు. కాగా, కాలేష్‌ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ  అనుషా వెంట పడుతున్నట్టుగా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement