=సందడిగా టెక్నోజియాన్-2013
=నేటితో ముగియనున్న కార్యక్రమం
=నేడు ఐఎస్‌ఓ బృందం సందర్శన
నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో నిర్వహిస్తు న్న టెక్నోజియాన్-2013 రెండో రోజు శని వారం ఉత్సాహంగా సాగింది. విద్యార్థిని విద్యార్థులు అద్భుతాలను ఆవిష్కరించారు. రేసింగ్, రోబోల ఫుట్‌బాల్, వాటర్ బాటిల్ రాకెట్, హోవర్ క్రాఫ్ట్, ఆర్మ్ రోవర్ తదితర ఈవెంట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిట్ స్టేడియంలో రాత్రి నిర్వహించిన లేజర్‌షోలో దీపపు కాంతులు ఇంద్ర ధనస్సును తలపించాయి. ఈ షో రెండు గంటలపాటు కొనసాగింది. మంటలతో విద్యార్థుల విన్యా సాలు ఆకట్టుకున్నాయి. టెక్నో ఫెస్టివల్ నిర్వహణలో ఐఐటీ ముంబై తర్వాత నిట్ వరంగ ల్ రెండో స్థానంలో నిలిచింది. టెక్నోజియాన్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు లభించడంతో ఆదివా రం ఐఎస్‌ఓ బృందం సందర్శించనుంది.
లైవ్ కౌంటర్ స్ట్రైక్
లైవ్ కౌంటర్ స్ట్రైక్ బ్యాటిల్‌గన్ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో రెండు బృందాలు టైస్టు, మిలటరీగా విడిపోయి ఒక రూమ్‌లోకి వెళ్తారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించి లేజర్ గన్స్ ద్వారా కాల్పులు జరుపుకుంటాయి. చివరగా టెర్ర రిస్టులపై మిలటరీ బృందం గెలుస్తుంది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొం దించడానికి ఈ ఈవెంట్ నిర్వహించారు.
వ్రెక్ రేస్ ఆర్1, ఆర్2
విద్యార్థులే స్వయంగా కార్లను తయారు చేసి వాటిని రిమోట్‌కు అనుసంధానం చేశారు. బాస్కెట్‌బాల్ కోర్టులో ఏర్పాటు చేసిన వ్రెక్ రేస్ ఆర్1, ఆర్2 ట్రాక్‌ల్లో ఈ కార్లను విద్యార్థులు పరుగులు తీయించారు. మొదటి రౌండ్‌లో కారు సమాంతర దారిలో, రెండో రౌండ్‌లో ఎత్తుపల్లాల మధ్య ఈ బుల్లి కార్లు పరుగులు పెట్టాయి.
మౌస్ ట్రాప్ రేసర్ ఆర్2
మౌస్ ట్రాప్ రేసర్ ఆర్2లో రేసర్లు ఫ్లెక్సీపై ఉన్న నల్లని గీతను ఫాలో అవుతూ ముందుకుసాగాలి. ఆ గీత తప్పితే లెక్కలోకి తీసుకో రు. ఇలా రెండు సార్లు బ్లాక్ గీతాలను అనుసరిస్తూ రేసర్ ముందుకుసాగుతుంది. రెం డు రౌండ్లను పూర్తి చేస్తే మార్కులు వేస్తారు. దీన్ని లైన్ ఫాలోవర్ రేసర్ కుడా అంటారు.
హవర్ మానియా ఆర్2
హవర్ మానియా ఆర్2లో భాగంగా విద్యార్థులు తయారు చేసిన హోవర్‌క్రాఫ్ట్ నేల, నీటి మీద నిర్ధేశిత దారిలో వెళ్లాల్సి ఉంటుం ది. రెండో రౌండ్‌లో ఎత్తులు, మలుపులతో ఉన్న దారిలో హోవర్‌క్రాప్ట్ తిరుగుతుంది. ఈ హోవర్‌క్రాఫ్ట్ పరికరం తయారీకి రూ.12 వేలు ఖర్చు చేసినట్లు ఓ విద్యార్థి తెలిపారు.
స్పేస్ రోవర్
చంద్రమండలానికి వెళ్లిన తర్వాత రోవర్ ద్వారా ఏవిధంగా మట్టిని తీసుకురావాలి, మెటల్స్‌ను ఎలా సేకరించాలి, రోవర్ పని విధానం ఏ విధంగా ఉంటుందో నిట్ ఈఈఈ ఇంజినీరింగ్ విద్యార్థులు నవీన్, బి.అవినాష్, కె.రాహుల్ ప్రదర్శించారు.
త్రస్ట్‌తో వాటర్ రాకెట్
మెటలర్జికల్ విభాగానికి చెందిన నిట్ ఇంజి నీరింగ్ విద్యార్థులు త్రస్ట్ ద్వారా వాటర్ బాటిల్‌తో రాకెట్‌ను ప్రయోగించి చూపించా రు. ఒక వాటర్ బాటిల్‌లో నీళ్లు కొంత భాగం నింపి దానిలో పంపు ద్వారా గాలి నింపుతారు. గాలి నిండగానే వాటర్ బాటిల్ ఎంత దూరంలో వెళ్లి పడుతుందో పరిశీలిస్తారు.
ఆర్మ్‌రోవర్
రోవర్ ద్వారా బాల్స్‌ను తీసుకవచ్చి ఒక గుంతలో వేయాలి. ఇలా రోవర్ వెళ్లి పేర్చి ఉన్న బాల్స్‌ను పట్టుకుని గుంతలో వేస్తూ పోవాలి. సమయం, రోవర్ వేసే బాల్స్‌ను బట్టి మార్కులు కేటాయిస్తారు.
ఇంక్ యువర్ ఓట్
ఓటింగ్‌పై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఇంక్ యువర్ ఓట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఎంబ్లమ్‌తో కూడిన బ్యాడ్జీలు ధరించిన విద్యార్థులు ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
నేటి కార్యక్రమాలు
టెక్నోజియాన్-2013 కార్యక్రమం ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు స్పాట్‌లైట్‌లో భాగంగా ఏవియన్ ఈ ఆర్2, వ్రెకెజీ ఆర్3, హైడ్రాలిక్ రేస్, మౌస్ ట్రాప్ రేసర్ ఆర్3, రోబో గల్ప్ ఆర్3, రోబో షూటర్ ఆర్3, డార్క్ పర్‌సెప్షన్ ఆర్2, ఆర్3, బ్యాక్‌యార్డు సైన్స్ ఆర్2, టెక్‌ఫ్రెషర్4, జోడియాక్ ఆర్4, జస్ట్ గుగుల్ ఆర్3 ప్రదర్శనలు ఉంటార ుు. అలాగే, బిజినెస్ స్కిల్స్‌పై బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ యాష్ సక్సేనాతోపాటు రోబో రీసర్చర్, ప్రోగ్రామర్ దివాకర్‌వైష్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడనున్నారు.
అద్భుతాలు ఆవిష్కృతం
Published Sun, Dec 29 2013 3:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
Advertisement
Advertisement