గవర్నర్ తో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శులు డీజీపీలు అనురాగ్ శర్మ, జేవీ రాముడు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాజధాని పరిధి, తదితర విషయాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్, తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.