సాక్షి, ప్రతినిధి, నిజామాబాద్: ‘ఇంటింటికీ కాంగ్రెస్ జెండా - సోనియా గాంధీకి అండ’ పేరుతో టీ-కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర సభలను పది జిల్లాలలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రపథమంగా బోధన్‌లో జైత్రయాత్ర సభను నిర్వహించారు. జన సమీకరణ కోసం జిల్లా మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి వారం రోజులుగా తీవ్రంగా కృషి చేశారు. జిల్లా నేతలు కూడా తగిన విధంగానే సహాయ సహకారాలు అందించారు. సభకు జిల్లా నలుమూలల నుంచి 50 వేల మంది ప్రజలను తరలించాలని నిర్ణయించినప్పటికీ ఒక్క బోధన్ నియోజకవర్గం నుంచే అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, జుక్కల్, బాన్సు వాడ, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల నుంచి నాయకులు, ముఖ్య కార్యకర్తలే తరలివచ్చినట్లు తెలుస్తోంది.
ఆలస్యంగా సభ
సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా నాయకుల రాక ఆలస్యం కావడంతో నాలుగు గంటల తర్వాత మొదలైంది. సభ ముగిసే సమయానికి సభా ప్రాంగ ణంలో నాయకులు, కార్యకర్తలు మాత్రమే కని పించారు. దీంతో ముఖ్య నేతలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, రాం రెడ్డి వెంకట్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య కొద్ది సమయంతోనే ప్రసంగాలు ముగించాల్సి వచ్చింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, మంత్రి ప్రసాద్‌రావు, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ బి.మహేష్ కుమార్ గౌడ్ మరికొందరు ముఖ్య నేతలు ప్రసంగించకుండానే వెనుదిర్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రం సభలో తీర్మానాలను ప్రవేశ పెట్టడం ద్వారా సభలో ప్రసంగించామన్న సంతృప్తిని పొందారు.
సీమాంధ్ర పాలకులతోనే దుస్థితి
బహిరంగ సభలో మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఎంపీ మధుయాష్కీగౌడ్, డి శ్రీనివాస్ మాత్రం జిల్లాతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు సమస్యలు ప్రస్తావించేం దుకు ప్రయత్నిం చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిరక్షించడంతో పాటు నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నీటిని నిజామాబాద్, మెదక్ జిల్లాలకే వినియోగించాలని కోరారు. సీమాంధ్ర పాలకుల వివక్ష కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని తీవ్రంగా మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహా కొత్తగా రెండు మూడు మాసాలలో ఏర్పడునున్న తెలంగాణ పునర్‌నిర్మాణంపై మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేంత వరకు అప్రమత్తం గా వ్యవహరించాలని మంత్రి జానారెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన సోనియాగాంధీని ప్రతి ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సోనియాగాంధీ ఫొటోను ప్రతి ఇంటిలో పెట్టుకోవాలని, వచ్చే తరం కూడా సోనియాగాంధీని మరిచిపోకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కృతజ్ఞతాభావం చాటాలి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో 90 స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని చాటాలని పిలుపునిచ్చా రు. సోనియాగాంధీ చిత్రాన్ని సమాధి చేసిన టీడీపీ నాయకుల, కార్యకర్తల దుశ్చర్యలను తీవ్రంగా ఖం డించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీతోపాటు సమైక్య పాట పాడుతున్న పార్టీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సోని యాను అవమాన పరిచిన వ్యక్తులు, శక్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
అందరి నోటా సోనియా పాట
Published Sat, Oct 19 2013 3:35 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement