telangana jaitra yatra
-
29న గద్వాలలో ‘తెలంగాణ జైత్రయాత్ర’
గద్వాల, న్యూస్‌లైన్: ఈనెల 29వ తేదీన గద్వాలలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ వెల్లడించారు. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పీసీసీ అధ్యక్షులు రానున్నారని వివరించారు. ఆదివారం మంత్రి స్థానిక తనక్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తె లిపేందుకు గాను జైత్రయాత్ర స భలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సభలు తెలంగాణలోని అన్ని జి ల్లాల్లో నిర్వహిస్తామని, అందులో భాగంగా గద్వాల లోని తేరుమైదానంలో నిర్వహించతలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఓఎంను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణకు అన్నిరంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని జీఓఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పశుగణాభివృద్ధికి రూ.15.86 కోట్లు జిల్లాలో పశుగణాభివృద్ధి శాఖకు ఆర్ఐడీఎం ద్వారా రూ.15.86 కోట్లు మంజూరయ్యాయని మంత్రి అరుణ తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో పశుగణాభివృద్ధి ఆస్పత్రులు, రైతుశిక్షణ సెంటర్లు, గోపాలమిత్ర సెంటర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్ఐడీఎం ఫేజ్-1 ద్వారా మంజూరైన నిధులతో జిల్లాలోని 66 ప్రాంతాల్లో పశువుల ఆస్పత్రులు, రైతుశిక్షణ సెంటర్లు, గోపాలమిత్ర సెంటర్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆర్ఐడీఎం ఫేజ్-2లో జిల్లాలోని 15 ప్రాంతాల్లో పశుగణాభివృద్ధికి సంబంధించిన ఫార్మర్ సెంటర్స్, గోపాలమిత్ర సెంటర్లు, ఇతర కార్యక్రమాలకు రూ.3.29 కోట్లు వచ్చాయన్నారు. జిల్లాలో పాడిపరిశ్రమ, పశుసంపద అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. స మావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, గద్వాల మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. -
హస్తినకు ‘పంచాయితీ’!
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో రాజుకున్న చిచ్చు ఇంకా ఆరలేదు. వర్గాల మధ్య పంచాయితీ ఢిల్లీలోని పార్టీ అధిష్టానం పెద్దల వద్దకు చేరింది. బోధన్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర సభకు హాజరైన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆమె కూడా ఈ వ్యవహారంపై అమీతుమీ తేల్చుకునేందుకు సోనియాగాంధీని ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇరువురు ప్రధాననేతల మధ్య విభేదాలు ఇప్పుడు జిల్లా, రాష్ట్రస్థాయిని దాటి హ స్తినకు చేరుకున్నాయి. మంత్రి రాంరెడ్డికి మద్దతుగా టీ మంత్రుల బృందం రేణుకపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తే.. రేణుకాచౌదరి నేరుగా సోనియాగాంధీకే ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ జైత్రయాత్ర పేరుతో బోధన్‌లో నిర్వహించిన తొలి సభకు జిల్లా నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభ సమయానికి కొన్ని గంటల ముందే రాంరెడ్డి, పొంగులేటి నిజామాబాద్ చేరుకుని రేణుక విషయమై టీ మంత్రులు, ఎంపీలతో చర్చించారు. ఈ బృందమంతా వారికి బాసటగా నిలవడంతో పాటు ఈ వ్యవహారంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె విషయమై ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ కూడా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సమైక్యవాదిగా ఉంటూ తెలంగాణ జిల్లాల నేతల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని, తెలంగాణలో ఏ జిల్లాలో జైత్రయాత్ర నిర్వహించినా ఆమెను ఆహ్వానించబోమని, ఖమ్మంలో కూడా ఇదే నిర్ణయం ఉంటుందని ఎంపీలు రాహుల్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన మంత్రికి కొండంత ధైర్యం వచ్చి బోధన్ జైత్రయాత్ర సభలో.. ‘ఈ ప్రాంతంలో పుట్టకున్నా తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకోవడం మన సంస్కృతికి వ్యతిరేకం, ఏ గ్రామంలో పుట్టావో చెప్పాలి’ అని రేణుకనుద్దేశించి మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ జిల్లా శ్రేణులు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. కాగా, మంత్రి తనపై కావాలనే వ్యాఖ్యలు చేస్తూ జిల్లా పార్టీ నేతల మధ్య చీలిక తెస్తున్నారని ఆరోపిస్తూ బోధన్ సభలో ఆయన చేసిన విమర్శలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రేణుక సిద్ధమవుతున్నారని తెలిసింది. రేణుక జిల్లా పర్యటన ఎప్పుడో...? ఈ నెల 13, 14 తేదీల్లో రేణుక జిల్లాకు వస్తారని ఊహించిన ఆమె అనుచర నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. ఇంత రభస జరుగుతున్నా ఆమె జిల్లాకు రాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రి రాంరెడ్డి తొలుత ప్రకటించినట్లుగా ఈనెల 21న జిల్లాలో జరగాల్సిన తెలంగాణ సభను రేణుకాచౌదరే రద్దు చేయించారని అమె అనుచరులు ప్రచారం చేశారు. అయితే మంత్రి బోధన్ జైత్రయాత్రలో రేణుకపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కలకలం రేగింది. కాగా, మంత్రి విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు రేణుక పావులు కదుపుతున్నారని, త్వరలో ఆమె జిల్లాకు వస్తారని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా రేణుక వర్గంలోని కొందరు నేతలు ఇప్పటికే రాంరెడ్డి గూటికి చేరేందుకు ఆయన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. -
అందరి నోటా సోనియా పాట
సాక్షి, ప్రతినిధి, నిజామాబాద్: ‘ఇంటింటికీ కాంగ్రెస్ జెండా - సోనియా గాంధీకి అండ’ పేరుతో టీ-కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర సభలను పది జిల్లాలలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రపథమంగా బోధన్‌లో జైత్రయాత్ర సభను నిర్వహించారు. జన సమీకరణ కోసం జిల్లా మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి వారం రోజులుగా తీవ్రంగా కృషి చేశారు. జిల్లా నేతలు కూడా తగిన విధంగానే సహాయ సహకారాలు అందించారు. సభకు జిల్లా నలుమూలల నుంచి 50 వేల మంది ప్రజలను తరలించాలని నిర్ణయించినప్పటికీ ఒక్క బోధన్ నియోజకవర్గం నుంచే అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, జుక్కల్, బాన్సు వాడ, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల నుంచి నాయకులు, ముఖ్య కార్యకర్తలే తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా సభ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా నాయకుల రాక ఆలస్యం కావడంతో నాలుగు గంటల తర్వాత మొదలైంది. సభ ముగిసే సమయానికి సభా ప్రాంగ ణంలో నాయకులు, కార్యకర్తలు మాత్రమే కని పించారు. దీంతో ముఖ్య నేతలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, రాం రెడ్డి వెంకట్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య కొద్ది సమయంతోనే ప్రసంగాలు ముగించాల్సి వచ్చింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, మంత్రి ప్రసాద్‌రావు, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ బి.మహేష్ కుమార్ గౌడ్ మరికొందరు ముఖ్య నేతలు ప్రసంగించకుండానే వెనుదిర్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రం సభలో తీర్మానాలను ప్రవేశ పెట్టడం ద్వారా సభలో ప్రసంగించామన్న సంతృప్తిని పొందారు. సీమాంధ్ర పాలకులతోనే దుస్థితి బహిరంగ సభలో మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఎంపీ మధుయాష్కీగౌడ్, డి శ్రీనివాస్ మాత్రం జిల్లాతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు సమస్యలు ప్రస్తావించేం దుకు ప్రయత్నిం చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిరక్షించడంతో పాటు నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నీటిని నిజామాబాద్, మెదక్ జిల్లాలకే వినియోగించాలని కోరారు. సీమాంధ్ర పాలకుల వివక్ష కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని తీవ్రంగా మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహా కొత్తగా రెండు మూడు మాసాలలో ఏర్పడునున్న తెలంగాణ పునర్నిర్మాణంపై మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేంత వరకు అప్రమత్తం గా వ్యవహరించాలని మంత్రి జానారెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన సోనియాగాంధీని ప్రతి ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సోనియాగాంధీ ఫొటోను ప్రతి ఇంటిలో పెట్టుకోవాలని, వచ్చే తరం కూడా సోనియాగాంధీని మరిచిపోకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృతజ్ఞతాభావం చాటాలి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో 90 స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని చాటాలని పిలుపునిచ్చా రు. సోనియాగాంధీ చిత్రాన్ని సమాధి చేసిన టీడీపీ నాయకుల, కార్యకర్తల దుశ్చర్యలను తీవ్రంగా ఖం డించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీతోపాటు సమైక్య పాట పాడుతున్న పార్టీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సోని యాను అవమాన పరిచిన వ్యక్తులు, శక్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. -
జైత్రయాత్రకు డుమ్మా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: తెలంగాణ జైత్రయాత్రకు అధికారపార్టీ నేతలు డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రకటన అనంతరం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన తొలి బహిరంగసభకు జిల్లా నాయకులు ముఖం చాటేశారు. జిల్లాలో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల ప్రభావం కాబోలు.. మెజార్టీ ఎమ్మెల్యేలు జైత్రయాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కేవలం మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే కేఎల్లార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీ ఇన్చార్జి అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి మినహా మిగతా నేతలు సభకు దూరంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా సభల నిర్వహణను చేపట్టినప్పటికీ, జిల్లా నేతలు మాత్రం వీటిపై అంతగా ఆసక్తి చూపడంలేదు. దీనికితోడు అధికారపార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కూడా ఈ సభకు తరలి వెళ్లడంపై ప్రభావం చూపాయి. అంతేగాకుండా జిల్లాలో సీమాంధ్ర ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండడం, గెలుపోటముల్లో వీరు నిర్ణాయక శక్తి కావడంతో శివారు ఎమ్మెల్యేలు జైత్రయాత్రలో పాలుపంచుకోకపోవడమే మంచిదనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెటిలర్ల ఓట్లపై తమ రాజకీయ భవితవ్యం ఆధారపడినందున సభ జోలికి వెళ్లకపోవడమే మంచిదనే భావనలో ఈ ప్రాంత నేతలున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు జైపాల్, సర్వే సహా మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి, రాజేందర్, శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు సభకు వెళ్లలేదు. ఇదిలావుండగా నవంబర్ 10న వికారాబాద్‌లో జైత్రయాత్ర సభ నిర్వహణకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీసీసీ.. 50వేల మందిని తరలించాలని నిర్ణయించింది. ఈ సభను జయప్రదం చేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అంశంతో గట్టెక్కాలని అధికారపార్టీ భావిస్తోంది. -
'భౌగోళికంగానే విభజన.. మానసికంగా కాదు'
నిజామాబాద్: తెలంగాణ వెనుకబాటుకు పాలకులే కారణమని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. అమర వీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ ఏర్పాటు అని ఆయన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ తెలంగాణ జైత్రయాత్ర సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ విభజన అనేది భౌగోళిక విభజనే తప్ప, మానసిక విభజన కాదన్నారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడి పోవడానికి పాలకులే ప్రధాన కారణమని తెలిపారు. సీమాంధ్రులు విభజనకు అడ్డు పడ్డకుండా సహకరించాలని ఆయన కోరారు. ఆ ప్రాంతానికి ఉన్న డిమాండ్లను తెలిపాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. ఆనాడు మాజీ ప్రధాని నెహ్రూ కోరిక మేరకే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపారని సూచించారు. పెద్ద ప్రజల ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఇంకా సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నించవద్దన్నారు. ప్రత్యేక తెలంగాణ అనేది ఎన్నో ఏళ్ల పోరాటమన్నారు. ఈ విషయాన్ని తెలుగు ప్రజలందరూ గుర్తించాలని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.