గద్వాల, న్యూస్‌లైన్: ఈనెల 29వ తేదీన గద్వాలలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ వెల్లడించారు. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పీసీసీ అధ్యక్షులు రానున్నారని వివరించారు. ఆదివారం మంత్రి స్థానిక తనక్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తె లిపేందుకు గాను జైత్రయాత్ర స భలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సభలు తెలంగాణలోని అన్ని జి ల్లాల్లో నిర్వహిస్తామని, అందులో భాగంగా గద్వాల లోని తేరుమైదానంలో నిర్వహించతలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఓఎంను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణకు అన్నిరంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని జీఓఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పశుగణాభివృద్ధికి రూ.15.86 కోట్లు
జిల్లాలో పశుగణాభివృద్ధి శాఖకు ఆర్‌ఐడీఎం ద్వారా రూ.15.86 కోట్లు మంజూరయ్యాయని మంత్రి అరుణ తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో పశుగణాభివృద్ధి ఆస్పత్రులు, రైతుశిక్షణ సెంటర్లు, గోపాలమిత్ర సెంటర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్‌ఐడీఎం ఫేజ్-1 ద్వారా మంజూరైన నిధులతో జిల్లాలోని 66 ప్రాంతాల్లో పశువుల ఆస్పత్రులు, రైతుశిక్షణ సెంటర్లు, గోపాలమిత్ర సెంటర్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆర్‌ఐడీఎం ఫేజ్-2లో జిల్లాలోని 15 ప్రాంతాల్లో పశుగణాభివృద్ధికి సంబంధించిన ఫార్మర్ సెంటర్స్, గోపాలమిత్ర సెంటర్లు, ఇతర కార్యక్రమాలకు రూ.3.29 కోట్లు వచ్చాయన్నారు. జిల్లాలో పాడిపరిశ్రమ, పశుసంపద అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. స మావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, గద్వాల మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
29న గద్వాలలో ‘తెలంగాణ జైత్రయాత్ర’
Published Mon, Oct 21 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement