D.k Aruna
-
విద్యుత్‌చార్జీలను పెంచొద్దు: డి.కె.అరుణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌చార్జీలను పెంచొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌చార్జీలను పెంచాలంటూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తిరస్కరించాలన్నారు. కరెంటు కోసం ఎన్టీపీసీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. విద్యుత్‌చార్జీలను పెంచితే ప్రజల పక్షాన పోరాడుతామని ఆమె హెచ్చరించారు. రాజీవ్ రహదారి పనుల్లో అక్రమాలు: జీవన్‌రెడ్డి రాజీవ్ రహదారి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులివ్వడంతో తెలంగాణ వనరులను దోచుకుపోతున్నారని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు విమర్శించారని, రాష్ట్రం వచ్చిన తర్వాత వారికెలా పనులు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు. -
గులాబీయింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దూషణలు.. నినాదాలు.. తోపులాటలు.. వెరసి నాటకీయ, ఉద్రిక్త పరిణామాల మధ్య జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 9వ జెడ్పీ చైర్మన్‌గా గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్‌కు ఆ అదృష్టం దక్కింది. గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి కాంగ్రెస్, టీడీపీ సభ్యుల మద్దతుతో పాగావేసింది. అధిక సంఖ్యలో జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఆ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులతో కలిసి జిల్లా పరిషత్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు రెండు ప్రత్యేక వాహనాల్లో జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఎన్నిక నిర్వహించేందుకు 33 మంది సభ్యులు అవసరం కాగా, మొత్తం 37మంది ప్రత్యేక సమావేశానికి హాజరయ్యా రు. ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో టీఆర్ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యా దవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి స మావేశమందిరానికి వచ్చారు. సభ్యుల హాజ రును లెక్కిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులతో పాటు సమావేశ మందిరంలోకి చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్‌తో వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ సభ్యులతో పాటు కూర్చున్న కాంగ్రెస్ సభ్యులను వారికి నిర్ధేశించిన స్థానాల్లో కూర్చునేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. సభ్యుల హాజరు(కోరం)మాత్రమే తనకు ముఖ్యమని, సభ్యులు ఎక్కడ కూర్చోవాలనేది వారి ఇష్టమని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నిక నిర్వహణకు సహకరించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నినాదాలు.. దూషణలు కాంగ్రెస్ సభ్యులు కొందరు టీఆర్ఎస్ శిబిరంలోకి చేరడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశమందిరంలో టీఆర్ఎస్ సభ్యులు కూర్చున్న బల్లల వైపునకు దూసుకువెళ్లేందుకు పలుమార్లు యత్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నిక వాయిదా వేయాలని, పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ సభ్యులను తమ వైపు పంపాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు నినాదాలు, దూషణలతో జెడ్పీహాల్ దద్దరిల్లింది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు అనూరాధ, కట్ట సరిత కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై దూషణపర్వానికి దిగిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని కలెక్టర్ పలుమార్లు మందలించారు. సభా గౌరవాన్ని కాపాడాలని, సభ్యులు ప్రమాణస్వీకారం చేసి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని పలుమార్లు సూచించారు. ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి ఎన్నిక ప్రక్రియను నిలిపేయాలని, నిబంధనలు పాటించాలని పట్టుబట్టారు. విప్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికను అడ్డుకుంటే బయటకు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ పలుమార్లు కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించారు. సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్నిక జరగడం ఓ దశలో అసాధ్యమనిపించింది. రెండు గంటలు దాటినా పరిస్థితి సద్దుమణగకపోవడం, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తంచేయడంతో కలెక్టర్ గిరిజాశంకర్ పోలీసుల సాయం కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలను మహబూబ్‌నగర్ డీఎస్పీ మల్లికార్జున్ నేతృత్వంలో బయటకు తరలించే క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్ సభ్యులు హాల్ నుంచి నిష్ర్కమించారు. ఈ క్రమంలో నంది ఎల్లయ్య, డీకే అరుణ, చిన్నారెడ్డి ఎన్నిక ప్రక్రియ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితమివ్వని విప్ జెడ్పీ చైర్మన్ ఎన్నికలో సభ్యులు గోడదాటకుండా ఉండేందుకు కాంగ్రెస్, టీడీపీలు విప్ జారీచేసినా ఫలితం దక్కలేదు. ప్రత్యేక సమావేశానికి సభ్యులు గైర్హాజరు కావాలంటూ టీడీపీ జారీచేసిన విప్‌ను పార్టీ నాయకులు ఎన్పీ వెంకటేశ్ శనివారం ఉదయం కలెక్టర్‌కు అందజేశారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు బి.అరుణ (ఫరూఖ్‌నగర్), కె.కవితమ్మ (ధన్వాడ), ఖగనాథ్‌రెడ్డి(ఇటిక్యాల), నవీన్‌కుమార్‌రెడ్డి (కొత్తూరు), రమేశ్‌గౌడ్(ఖిల్లాఘనపూర్) సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ నుంచి కె.రామకృష్ణారెడ్డి (అచ్చంపేట), బి.లలితమ్మ (కోయిలకొండ), వెంకటమ్మ (దామరగిద్ద), ఎ.వెంకటయ్య (వనపర్తి), వెంకటేశ్వరమ్మ (వడ్డేపల్లి) కూడా టీఆర్ఎస్ శిబిరంలో చేరారు. వీరిలో ఖగనాథ్‌రెడ్డి (కాంగ్రెస్), వెంకటయ్య (టీడీపీ) సమావేశానికి హాజరైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 35 మంది సభ్యుల మద్దతుతో గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ (టీఆర్ఎస్) జెడ్పీచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కొత్తూరు జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. -
మళ్లీ ‘గుట్ట’ సర్వే..!
వివాదాస్పదంగా మారిన మన్నాపురం క్వారీ వద్ద శుక్రవారం మళ్లీ రగడ చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు మరో మారు ఆధునిక పద్ధతుల్లో సర్వేకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డి , దీనిపై పిటీషన్ వేసిన వైఎస్సార్సీపి నియోజకవర్గ సమన్వయ కర్త కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మరోవైపు అక్కడి రైతులు క్వారీ వల్ల తమకు వస్తున్న ఇబ్బందులపై అధికారులను నిలదీశారు. ధరూరు, న్యస్లైన్ : మంత్రి డీకే అరుణ కుమార్తె స్నిగ్దారెడ్డి పేరున నడుస్తున్న క్వారీ వద్ద శుక్రవారం మైనింగ్, సర్వే, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో మరోసారి సర్వే చేపట్టారు. మండల పరిధిలోని మన్నాపురం సమీపంలో ఉన్న గుట్ట వద్ద (సర్వే నెంబర్ 327, 135) రాయిని తీసుకునేందుకు మైనింగ్ శాఖ నుంచి ఒక హెక్టారును లీజుకు తీసుకుని అంతకంటే ఎక్కువగా తవ్వకాలు జరిపారని గతేడాదినవంబరు 11న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి హై కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కోర్టు ఆదేశాల మేరకు జనవరి 29న మైన్స్ డై రెక్టర్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో క్వారీ వద్ద విచారణ జరిపి సర్వే నిర్వహించారు. అప్పుడు హద్దులను ఏర్పాటు చేసిన అధికారులు తిరిగి శుక్రవారం క్వారీ వద్దకు చేరుకుని మరోసారి విచారణ చేశారు. ఆధునిక సామగ్రితో కచ్చితత్వాన్ని సాధించేందుకు వినియోగ పడుతుందని ఆ విధానంలో సర్వే చేపట్టినట్టు ఆ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గుట్టతో పాటు గుట్టకు చేరుకునే నలుమూలల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే వద్దకు పిటీషనరు తరపున ఐదుగురిని, క్వారీకి సంబంధించిన వారిని ఐదుగురిని మాత్రమే పంపారు. గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి, తహశీల్దార్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. మామా, అల్లుళ్ల మాటల యుద్ధం మంత్రి డీకే అరుణ భర్త, మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి.. ఆమె మేనల్లుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డిలు ఈ సందర్భంగా పరస్పరం దూషించుకున్నారు. ‘నువ్వెంత...అంటే నువ్వెంత’ అనే రీతిలో ఇరు పార్టీల కార్యకర్తలు, పోలీసుల ముందే పత్రికలు రాయలేని విధంగా, తీవ్ర పద జాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యవహారమంతా గద్వాల సీఐ షాకీర్ హుస్సేన్ ఎదురుగానే జరగింది. వెంటనే తేరుకున్న సీఐ వారిద్దరినీ అక్కడి నుంచి పక్కకు పంపించారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, న్యాయవాది షఫీఉల్లాల మధ్య కొంత సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. తీసుకున్న దానికంటే కొసరుకున్నదే ఎక్కువ - వైఎస్సార్ సీపీ కృష్ణమోహన్‌రెడ్డి మన్నాపురం గుట్ట వద్ద మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నది హెక్టారే. కానీ నిబంధనలకు విరుద్ధంగా 40-50 ఎకరాల్లో తవ్వకాలు జరిపిన భరతసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. శుక్రవారం జరిపిన పర్వే నిష్పక్షపాతంగా ఉండాలి. పోలీసులు ఏ కపక్షంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. చుట్టుముట్టిన రైతులు గుట్ట చుట్టు ఉన్న తమ పొలాల్లో బాస్టింగ్ కారణంగా దుమ్ము థూళి పేరుకుపోయి పంటలు పండని పరిస్థితి నెలకొందనీ ఏళ్ల తరబడిగా తాము వేసుకుంటున్న పంటలు చేతికందడం లేదనీ తమకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మన్నాపురం, సోంపురం గ్రామాల రైతులు తిరుగు ముఖం పడుతున్న అధికారులను చుట్టు ముట్టి నిలదీశారు. న్యాయం చేసేలా చూస్తామనడంతో వారు శాంతించారు. -
అంతా...హస్తినకు...!
పునర్విభజన అంకం జిల్లా రాజకీయాలనూ రసవత్తరంగా మారుస్తోంది. బిల్లు ‘ఢిల్లీ’కి వెళ్లడంతో అక్కడి కథ ఏమిటో తెలుసుకునేందుకు ఇక్కడి నేతలూ ‘చలో హస్తిన’ అంటూ కదిలారు. ఇందులో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుండగా ఇతర పక్షాల వారు తామూ ఉన్నామని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం జిల్లాకో, రాజధానికో పరిమితమై ‘బాబు’పై భారం వేసి తమ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర పునర్విభజన బిల్లు ఢిల్లీకి చేరుకోవడంతో జిల్లా నేతలందరూ దేశ రాజధాని బాట పట్టారు. బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నట్లు చెప్తున్నారు. మంత్రి డీకే అరుణతో పాటు షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం మూడు రోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎంపీ కేసీఆర్‌తో పాటు మరో ఎంపీ జగన్నాథం, పార్టీ ఏకైక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా, నాగం జనార్దన్ రెడ్డి రెండు రోజుల కిందటే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఓ వైపు సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో చంద్రబాబుతో కలిసి హడావుడి సృష్టిస్తున్నారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనో, సొంత నియోజకవర్గంలోనో గడుపుతున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హస్తినలో ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు ఎం.చంద్రశేఖర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీత, రేవంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి స్థానిక కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు. నేడు తిరుగుముఖం? రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడంతో ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరు రాజ్యసభ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో ఓటింగ్ అనివార్యంగా మారింది. దీంతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రానికల్లా హైదరాబాద్‌కు చేరుకునే ప్రయత్నాల్లో వున్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తర్వాత తిరిగి పరిస్థితులను బట్టి ఢిల్లీకి వెళ్లేది లేనిదీ తేల్చుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారు. -
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్విని యో గం చేసుకొని వృద్ధిలోకి రావాలని రా ష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం గద్వాలలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏడో విడత భూ పంపిణీలో భాగంగా మంత్రి గద్వాల నియోజకవర్గంలోని 551 మంది రైతులకు 871.89 ఎకరాల ధ్రువీకరణ ప త్రాలను అందజేశారు. అలాగే 1400 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు భూమి హక్కులు ఉంటేనే సమాజం లో గౌరవం, రక్షణ లభిస్తుందని చె ప్పారు. సమాజంలో మహిళలను ఆ దరించినప్పుడే అంతరాలు తొలగిపోతాయన్నారు. భూ పంపిణీ పేదల జీవితాల్లో వెలుగును నింపుతుందన్నారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీ ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బంగారుతల్లి, అమృతహస్తం తదితర పథకాలను ప్రవేశపెట్టిన ట్లు తెలిపారు. మహిళా సంఘాలు ఆ ర్థికంగా బలోపేతం కావడానికి వడ్డీలే ని రుణాలను అందిస్తున్నట్లు చెప్పా రు. నియోజకవర్గంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేరుస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో పిల్లిగుండ్ల వద్ద పంపిణీ చేసిన పట్టాలలో అనేక తప్పులు జరిగాయ ని, వీటిపైన విచారణ జరిపించి ని జమైన లబ్ధిదారులకు పట్టాలను అం దించామన్నారు. కార్యక్రమంలో ఆ ర్డీఓ నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, తహశీ ల్దార్లు జగదీశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరి, సైదులు, నాయకులు మా ణిక్యరెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా..!
నిన్న మిడ్జిల్‌లో రగిలిన ‘ఫ్లెక్సీలు’, మొన్న రథం రగడ, యాత్రల పేరిట నేతల హంగామా. సాక్షాత్తూ జిల్లా కాంగ్రెస్‌లో ప్రముఖులనుకున్నవారే ఎడమొహం, పెడమొహం. క్షేత్ర స్థాయిలో పోటా పోటీ కార్యక్రమాలు. వెరసి సార్వత్రిక ఎన్నికల్లో పట్టు సాధించుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలు. చాపకింద నీరులా కిందివారిని ఎగదోసి తమ వారికి టికెట్ల కోటాలో పెద్దపీట వేయించుకొని తాము రాష్ట్రంలోనో, కేంద్రంలోనో చక్రం తిప్పాలన్న తపన..ఇదీ ‘హస్తం’ పెద్దల తీరు. వర్గాల పెంచుతున్న వైనం. -సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డీకే అరుణ కేంద్రంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం లేదా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి డీకే అరుణ ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ఇద్దరు నేతలు తెలంగాణ రాష్ట్రంలో ‘కీలకమైన పదవి’ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో వారు వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరి ప్రాపకం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశీస్సులు లేనిదే టికెట్ దక్కడం అసాధ్యమనే భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల రెండు వర్గాలకు చెందిన నాయకులు టికెట్ల వేటలో ఉండటంతో ఎన్నికలకు ముందే ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నారు. డీకే అరుణతో సఖ్యత లేకపోవడంతో ఇటీవల కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ఇటీవల గురునాథ్‌రెడ్డి కలిసి వచ్చినట్లు సమాచారం. డీసీసీ అధికార ప్రతినిధి సలీం, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ముదిగండ్ల కృష్ణ, మాజీ జడ్పీటీసీ మల్కిరెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్న వారిలో వున్నారు. అవకాశం కలిసి వస్తే డీకే అరుణ సోదరుడు నారాయణపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నా రు. మాజీ పీసీసీ చీఫ్ డీఎస్, మాజీ ఎంపీ విఠల్‌రావు త దితరుల సహకారంతో మరోమారు టికెట్ దక్కించుకునేందుకు సూగప్ప ఆరాట పడుతున్నారు. మాజీ ఎమ్మె ల్యే వీరారెడ్డి కూడా టికెట్ ఆశించే అవకాశం వుంది. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, 2010 ఉప ఎన్నికలో పోటీ చేసిన ముత్యాల ప్రకాశ్ మహబూబ్‌నగర్ టికెట్ ఆశిస్తున్నారు. విద్యా సంస్థల అధిపతి కేఎస్ రవికుమార్ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. డీకే అరుణ సహకారంతో మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. స్థానిక నినాదాన్ని తెరమీదకు తెస్తున్న బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సాదు వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి వర్గీయులుగా టికెట్ ఆశిస్తున్నారు. దేవరకద్రలో కాంగ్రెస్ అనధికార ఇంచార్జిగా డీకే అరుణ ఆశీస్సులతో డోకూరు పవన్‌కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. కొత్తకోటకు చెందిన విశ్వేశ్వర్, దేవరకద్రకు చెందిన ప్రదీప్ కుమార్ గౌడ్ కూడా టికెట్‌పై ఆశతో వున్నారు. మక్తల్ నుంచి డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి లేదా అతని భార్య సుచరిత టికెట్ కోరే అవకాశం వుంది. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపైనా చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మళ్లీ టికెట్ ఖాయమనే ధీమాతో నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి డీకే అరుణ గద్వాల నుంచి మరోమారు పోటీ కి సిద్దమవుతున్నారు. గతంలో చల్లా వెంకట్రాంరెడ్డి మద్దతుతో అలంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్రహాం ప్రస్తుతం ఒంటరిపోరు చేస్తున్నారు. గతంలో మాజీ ఎంపీ విఠల్‌రావు పీఏ సంపత్‌కుమార్ కూడా టికెట్‌ను ఆశించే అవకాశం ఉంది. నాగర్‌కర్నూలు నుంచి జడ్పీ మాజీ చైర్మన్ కూచకుళ్ల దామోదర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.మోహన్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి దిలీపాచారి తమ వంతు ప్రయత్నాల్లో వున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పోటీగా అచ్చంపేట ఎస్సీ స్థానం నుంచి ఎవరూ టికెట్ అడిగే అవకాశం కనిపించకపోవడంతో గ్రూపుల ప్రభావం లేదు. జైపాల్‌రెడ్డి స్వయంగా కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. జైపాల్‌రెడ్డి మద్దతుతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి, డీకే అరుణ సహకారంతో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి వున్నా కొత్తూరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీర్లపల్లి శంకర్, మాజీ సర్పంచ్‌లు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, కొందూటి నరేందర్ టికెట్ ఆశిస్తుండటంతో విభేదాలు లోలోన భగ్గుమంటున్నాయి. కొల్లాపూర్‌లో డీకే ఆరుణ మద్దతుతో మరోమారు విష్ణువర్దన్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నా, విలీనమైనా కొల్లాపూర్ రాజకీయం మరోమారు ఉత్కంఠగా మారనుంది. -
రాజుకున్న రాజకీయం
జిల్లాలో ఈ ఏడాది రాజకీయంగా రసవత్తర మలుపు తిరిగింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప్రధాన పార్టీల జాతకాలు మారిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటి, డీసీసీబీ పీఠాన్ని దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు మంత్రి డీకే అరుణ పెద్దదిక్కుగా ఉన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేయగా, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం గులాబీదశంలో చేరిపోయారు. వైఎస్సార్ సీపీ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రధాన పార్టీలకు దీటుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ఏడాది అంతా జిల్లాలో ఉద్యమాలు కొనసాగాయి. టీజేఏసీ, తెలంగాణ వాదులు, విద్యార్థి సంఘాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. యూపీఏ సర్కారు జులై 30న తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రధాన పార్టీల్లో కలకలం మొదలైంది. తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగినప్పుడు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదికి వచ్చినా కాంగ్రెస్, టీడీపీకి చెందిన ప్రతినిధులు అటువైపు తిరిగి చూడలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ లోటును భర్తీ చేసి, మనుగడ కోసం ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. తెలంగాణ ప్రకటించాక ప్రజలకు మేం దగ్గరయ్యామని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. ఆ పార్టీపై తెలంగాణ వాదుల్లో సదభిప్రాయం లేకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 2013లో జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీ పరిస్థితి ఇలా ఉంది. న్యూస్‌లైన్, పాలమూరు జనవరి 6న జిల్లా కేం ద్రంలోని ము న్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన సదస్సులో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి, అందరికీ లబ్ధి కలిగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 7, 8 తేదీలలో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నల్లమల ప్రాంతంలో పర్యటించారు. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. 18వ తేదీన డీసీసీబీ చైర్మన్‌గా వీరారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి డీకే అరుణ రాజకీయ పలుకుబడితో ఆయన ఆప్కాబ్ పీఠాన్ని దక్కించుకున్నారు. మార్చి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మార్చి 23న శంకుస్థాపన చేశారు. 26వ తేదీన కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమంల్లో మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. ఏప్రిల్ రైతు చైతన్య యాత్రల్లో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏప్రిల్ 22న జడ్చర్లకు వచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.13న టీఆర్ఎస్ అధినేత, ఎంపీ కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ గిరిజాశంకర్‌తో సమీక్షించారు. మే కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మే 27న జిల్లా కేంద్రానికి వచ్చారు. పాలమూరులో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. జాన్ 2వ తేదీ హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం, టీడీపీ నేత మర్రి జనార్దన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 3వ తేదీన నాగం జనార్దన్‌రెడ్డి నగారా సమితిని రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీలో విలీనం చేశారు. జూన్ 29న వైఎస్సార్ సీపీ విసృ్తతస్థాయి సమావేశంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పాల్గొన్నారు. కేసీఆర్, గద్దర్ ఈ నెలలో జిల్లాలో పర్యటించారు. జులై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్మీ జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఓదార్చి, ఆర్థిక సహాయం అందించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష పదవికి కల్వకుర్తికి చెందిన వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 440, టీడీపీ 328, టీఆర్ఎస్ 129, వైఎస్సార్ సీపీ 198, బీజేపీ 59, ఇతరులు 174 స్థానాలు గెలుచుకున్నారు. 30వ తేదీన తెలంగాణ ప్రకటన రాగానే జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఆగస్టు 3వ తేదీన తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సోనియా గాంధీ కృతజ్ఞత సభ చేపట్టారు. ఇందులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు. సెప్టెంబరు 28న జిల్లాకేంద్రంలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు పార్లమెంటులో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. 30వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జిల్లా మీదుగా కడపకు వెళుతుండగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్టోబరు 4న జిల్లా కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 29వ తేదీ గద్వాలలో కాంగ్రెస్ విజయోత్సవ సభను మంత్రి చేపట్టారు. ఇందులో ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ్మ, జానారెడ్డి, డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, వీహెచ్, శ్రీధర్‌బాబు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నవంబరు 21వ తేదీన అచ్చంపేటలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి డీకే అరుణ ఎదుటే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగారు. జిల్లాలో పలు చోట్ల సీఎం ఫొటోలు తీసేసి రచ్చబండ నిర్వహించాలని తెలంగాణ వాదులు ఆందోళనలు చేశారు. డిసెంబర్ డిసెంబర్ 5న రాయల తెలంగాణ ఏర్పాటు చేయనున్నారంటూ వార్తలు రావడంతో, అందుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీజేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగింది. టీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు విద్యార్థి సదస్సులో పాల్గొన్నారు. -
అరుణ సభలో రభస
తలకొండపల్లి, న్యూస్‌లైన్: తలకొండపల్లి మండలం పడకల్లో మంత్రి డీకే అరుణ వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రభస చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను వేదికమీదకు ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి డీకే అరుణ ఇక్కడికి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పిలువాలని, ఆయన లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ సభా ప్రాంగణలోకి చొచ్చుకు వచ్చారు. అప్రమత్తమైన పోలీస్‌లు వారిని అడ్డుకున్నారు. ఇంతలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇది అధికారిక సమావేశం కాదనీ, పార్టీ కార్యకర్తల సమావేశమని ఈ విషయం తెలిపామని చెప్పారు. అధికారికి సమావేశం కాకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తూ అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగి గొడవపడ్డారు. కుర్చీలు విసురుకొన్నారు. ఫలితంగా సమావేశం గందరగోళంగా తయారైంది. పరిస్థితి విషమించడంతో పోలీస్‌లు లాఠీలు ఝలిపించి టీడీపీ నాయకులను చెదరగొట్టి సమావేశ ప్రాంగణం నుంచి బయటికి పంపించి వేశారు. తదుపరి సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. -
కల్యాణం..కమనీయం
మల్దకల్, న్యూస్‌లైన్: మల్దకల్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదిశిలా క్షేత్రంలో నేత్ర పర్వంగా కొనసాగింది. మార్గశిర పర్యదినాన్ని పురస్కరించుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివార్ల కల్యాణోత్సవానికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తరుఫున మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆదివారం రాత్రి 12.00గంటలకు లక్ష్మీవేంకటేశ్వరస్వామిల కల్యాణాన్ని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి శ్రీ 1008 విద్యాధీశ తీర్థ శ్రీపాదుల స్వామిజీ వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. వివిధ మండలాలు, గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గజ వాహనంపై ఊరేగిన స్వామి వారు స్థానిక స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గజ వాహనంపై కూర్చోబెట్టి దశమికట్ట వరకు భాజాభ్రజంతీల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో జ్యోషి అగమయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని తిలకించేందుకు మహిళలు, భక్తులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దైవచింతనతోనే పరిపూర్ణమైన ఆరోగ్యం: దైవ చింతనతో ప్రజలు పరిపూర్ణమైన ఆరోగ్య జీవితం గడపవచ్చునని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీశతీర్థ శ్రీపాదులు తెలిపారు. వెంకటేశ్వరస్వామి పల్లకి సేవకు ఆయన హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ గురురాజులు, మండల నాయకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు రోజూ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటే పరిపూర్ణమైన ఆరోగ్య జీవితం గడపవచ్చన్నారు. సత్యం, ధర్మంతో కూడిన పనులు చేయాలన్నాయి. పోయిన డబ్బు, భూమి సంపాదించుకోవచ్చని, గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేమని చెప్పారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రంసింహారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాణిక్యరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రంగస్వామినాయుడు, నాయకులు సీతారాంరెడ్డి, పటేల్ ప్రభాకర్ తదిరతులు పాల్గొన్నారు. -
బాలల చలన చిత్రోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్
వారం రోజుల పాటు రాష్ట్ర రాజధాని వేదికగా లక్షలాది విద్యార్థులు, విదేశీ అతిథులకు ఆనందాన్ని పంచిన 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కొరత తీరింది!
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: నిధుల్లేక మునిసిపాలిటీలు ఏ చిన్న సమస్యను తీర్చాలన్నా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మూడేళ్ల తరువాత నిధుల వరద పారింది. 13వ ఆర్థికసంఘం నిధుల కింద జిల్లాకు రూ.10.49కోట్లను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రి డీకే అరుణ గురువారం వెల్లడించారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మునిసిపాలిటీలకు ఈనిధులు చాలావరకు ఊపిరిపోసినట్టేనని తెలుస్తోంది. ఇక ఈ నిధుల విషయానికొస్తే కౌన్సిల్ లేని కారణంగా నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్వయంగా మునిసిపల్ రీజినల్ డెరైక్టర్ సత్యనారాయణ జిల్లాకు వచ్చినప్పుడు ప్రకటించారు. దీంతో కౌన్సిల్ ఏర్పాటు అయ్యేంత వరకు ఈ నిధులు రావని భావించిన తరుణంలోనే మంజూరుకావడం మునిసిపాలిటీలను గట్టెక్కించినట్లయింది. మూడేళ్లుగా మునిసిపాలిటీలకు పైసా గ్రాంట్ లేని కారణంగా వసూలైన పన్నులతోనే అరకొరగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి వచ్చింది. ఇక ఆ పరిస్థితికి విముక్తి కలిగినట్లే. ఇక ఈనిధులతో డ్రైనేజీలతో పాటు సీసీరోడ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు తాగునీటి పైప్లైన్లు, పారిశుధ్య నిర్వాహణ, వీధి దీపాల మరమ్మతులను పూర్తిచేయాలి. మంజూరైన నిధులు ఇలా.. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీకి రూ.3.65కోట్లు, గద్వాలకు రూ.1.23 కోట్లు, నారాయణపేటకు రూ.1.90కోట్లు, షాద్‌నగర్‌కు రూ.89లక్షలు, వ నపర్తికి రూ.84లక్షలు, అయిజకు రూ.51లక్షలు, కొల్లాపూర్‌కు రూ.51లక్ష లు, కల్వకుర్తికి రూ.48లక్షలు, నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీకి రూ.35లక్ష ల చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మునిసిపల్‌శాఖ సంబంధిత మునిసిపాలిటీలకు ఆదేశాలను జారీచేసింది. ఇక జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల కంటే మహబూబ్‌నగర్ మునిసిపాలిటీకే అధిక నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతోనైనా మునిసిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఈ నిధులను సకాలంలో వినియోగిస్తారా? లేక ఖాతాకే పరిమితం చేస్తారో వేచిచూడాలి. -
బాధిత రైతులను ఆదుకుంటాం: మంత్రి
అచ్చంపేట/రూరల్, న్యూస్‌లైన్: భారీవర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని మంత్రి డీకే అరుణ భరోసాఇచ్చారు. శనివారం సాయంత్రం ఆమె అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు. అచ్చంపేట మండలం రంగాపూర్ చంద్రవాగు, చంద్రసాగర్, బొమ్మనపల్లి-సిద్ధాపూర్ రహదారిలోని మనుగుబ్బలవాగు కల్వర్టు పరిశీలించి ఉప్పునుంతల మండలం పిర్వాట్వానిపల్లి రైతులతో మాట్లాడారు. జిల్లాలో దెబ్బతిన్నరోడ్లను పునరుద్ధరించి తెగిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతులు చేపడతామన్నారు. ఇప్పటివరకు రూ.40కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, మరోసారి పూర్తి స్థాయి అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కొట్టుకపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను పునరుద్ధరించేందుకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని మంత్రి డీఎంహెచ్ఓను ఆదేశించారు. పంటనష్ట అంచనాలు ఆదర్శరైతులకు కాకుండా వీఆర్వోలకు ఇవ్వాలని, వారు తయారుచేసిన జాబితానే జిల్లా అధికారులకు అందించాలని సూచించారు. మంత్రి వెంట అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మార్కెట్ చైర్మన్ శ్రీపతిరావు తదితరులు ఉన్నారు. -
29న గద్వాలలో ‘తెలంగాణ జైత్రయాత్ర’
గద్వాల, న్యూస్‌లైన్: ఈనెల 29వ తేదీన గద్వాలలో తెలంగాణ జైత్రయాత్ర సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ వెల్లడించారు. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పీసీసీ అధ్యక్షులు రానున్నారని వివరించారు. ఆదివారం మంత్రి స్థానిక తనక్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తె లిపేందుకు గాను జైత్రయాత్ర స భలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సభలు తెలంగాణలోని అన్ని జి ల్లాల్లో నిర్వహిస్తామని, అందులో భాగంగా గద్వాల లోని తేరుమైదానంలో నిర్వహించతలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జీఓఎంను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణకు అన్నిరంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని జీఓఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పశుగణాభివృద్ధికి రూ.15.86 కోట్లు జిల్లాలో పశుగణాభివృద్ధి శాఖకు ఆర్ఐడీఎం ద్వారా రూ.15.86 కోట్లు మంజూరయ్యాయని మంత్రి అరుణ తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో పశుగణాభివృద్ధి ఆస్పత్రులు, రైతుశిక్షణ సెంటర్లు, గోపాలమిత్ర సెంటర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్ఐడీఎం ఫేజ్-1 ద్వారా మంజూరైన నిధులతో జిల్లాలోని 66 ప్రాంతాల్లో పశువుల ఆస్పత్రులు, రైతుశిక్షణ సెంటర్లు, గోపాలమిత్ర సెంటర్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆర్ఐడీఎం ఫేజ్-2లో జిల్లాలోని 15 ప్రాంతాల్లో పశుగణాభివృద్ధికి సంబంధించిన ఫార్మర్ సెంటర్స్, గోపాలమిత్ర సెంటర్లు, ఇతర కార్యక్రమాలకు రూ.3.29 కోట్లు వచ్చాయన్నారు. జిల్లాలో పాడిపరిశ్రమ, పశుసంపద అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. స మావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, గద్వాల మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణపై అనుమానాలొద్దు
గద్వాల టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే అన్న వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిలబెట్టుకుందని మంత్రి డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చినమాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమంతో తెలంగాణ ఏర్పా టు ఆగుతుందన్న అనుమానాలు అవసరం లేదని, రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. ఆదివారం స్థానిక వైఎస్ఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విజ యోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం నేడు నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అందుకు బహుమతిగా 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జిల్లాలో కొంతమంది స్వార్థపూరిత నాయకులు తెలంగాణ కోసం కాకుండా డీకే. అరుణను ఏకైక లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూనే, జిల్లా అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. గద్వాల ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతోనే జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరికీ ఆత్మకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా శాంతి చేకూరుతుందన్నారు. ఆరు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతున్నా అన్ని వర్గాల ప్రజల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు. గద్వాలను జిల్లా చేసేందుకు కృషి గద్వాల నియోజకవర్గంలో భారీ తాగునీటి పథకంతో పాటు, ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నీరందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెంటనే గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే అన్ని వసతులు, సౌకర్యాలు, వనరులు గద్వాల ప్రాంతంలో ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా డీకే. అరుణను నియమించే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మహాంకాళి శ్రీనివాసులు, బీఎస్ కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రామచంద్రారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్ఆర్. శ్రీనివాసులు, బండల వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.