సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌చార్జీలను పెంచొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌చార్జీలను పెంచాలంటూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తిరస్కరించాలన్నారు. కరెంటు కోసం ఎన్టీపీసీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. విద్యుత్‌చార్జీలను పెంచితే ప్రజల పక్షాన పోరాడుతామని ఆమె హెచ్చరించారు.
రాజీవ్ రహదారి పనుల్లో అక్రమాలు: జీవన్‌రెడ్డి
రాజీవ్ రహదారి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులివ్వడంతో తెలంగాణ వనరులను దోచుకుపోతున్నారని అప్పట్లో టీఆర్‌ఎస్ నేతలు విమర్శించారని, రాష్ట్రం వచ్చిన తర్వాత వారికెలా పనులు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు.
విద్యుత్‌చార్జీలను పెంచొద్దు: డి.కె.అరుణ
Published Fri, Feb 13 2015 12:44 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement