గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్విని యో గం చేసుకొని వృద్ధిలోకి రావాలని రా ష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం గద్వాలలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏడో విడత భూ పంపిణీలో భాగంగా మంత్రి గద్వాల నియోజకవర్గంలోని 551 మంది రైతులకు 871.89 ఎకరాల ధ్రువీకరణ ప త్రాలను అందజేశారు. అలాగే 1400 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు భూమి హక్కులు ఉంటేనే సమాజం లో గౌరవం, రక్షణ లభిస్తుందని చె ప్పారు. సమాజంలో మహిళలను ఆ దరించినప్పుడే అంతరాలు తొలగిపోతాయన్నారు. భూ పంపిణీ పేదల జీవితాల్లో వెలుగును నింపుతుందన్నారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీ ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బంగారుతల్లి, అమృతహస్తం తదితర పథకాలను ప్రవేశపెట్టిన ట్లు తెలిపారు.
మహిళా సంఘాలు ఆ ర్థికంగా బలోపేతం కావడానికి వడ్డీలే ని రుణాలను అందిస్తున్నట్లు చెప్పా రు. నియోజకవర్గంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేరుస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు.
గతంలో పిల్లిగుండ్ల వద్ద పంపిణీ చేసిన పట్టాలలో అనేక తప్పులు జరిగాయ ని, వీటిపైన విచారణ జరిపించి ని జమైన లబ్ధిదారులకు పట్టాలను అం దించామన్నారు. కార్యక్రమంలో ఆ ర్డీఓ నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, తహశీ ల్దార్లు జగదీశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరి, సైదులు, నాయకులు మా ణిక్యరెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు పాల్గొన్నారు.
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
Published Mon, Jan 27 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement