T-congress
-
తెల౦గాణ కాంగ్రేస్లో డిస్టబెన్స్
-
కాంగ్రెస్ నేతల హస్తినయాత్రలు!
-
కాంగ్రెస్ నేతల హస్తినయాత్రలు!
నేడు జానా, షబ్బీర్, పొన్నం, భట్టి, డీకే అరుణలు ? ఢిల్లీలోనే మకాం వేసిన పొన్నాల, వివేక్ వివేక్, పొన్నం, షబ్బీర్ పేర్లను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించి మరొకరికి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నందున ఆ పదవిని ఆశిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో జానారెడ్డి అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ భేటీ ఏర్పాటు చేశారు. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా జానారెడ్డి కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఆ పదవిని ఆశిస్తున్న శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ బుధవారం జానారెడ్డితోపాటే ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా బుధవారం హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి బలంగా వీచినప్పటికీ పాలమూరులో మాత్రం ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని కాంగ్రెస్ తరపున గెలిపించిన జిల్లా పాలమూరేనని ఆమె హైకమాండ్‌కు గుర్తు చేయనున్నారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పాలమూరుకు కీలకమైన మంత్రి పదవి దక్కలేదని, ఈసారైనా పార్టీ ముఖ్యపదవి అప్పగించాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ వివేక్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఈ పదవి కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం బుధవారం లేదా గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ఇప్పటికే పలుమార్లు ఇదే పనిపై ఢిల్లీ వెళ్లొచ్చారు. తాజాగా ఢిల్లీపెద్దల పిలుపు కోసం ఆయన వేచి చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అయితే రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తున్నారు. తనకు మరికొంత గడువిస్తే పార్టీ బలోపేతం చేస్తానని ప్రతిపాదిస్తున్నారు. జనం తిరస్కరించిన నేతకు పార్టీ పగ్గాలా? టీపీసీసీ చీఫ్ నియామకం కోసం గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతల పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సీఎల్పీ నేత జానారెడ్డి సైతం షబ్బీర్‌అలీ లేదా వివేక్ పేరును ప్రతిపాదిస్తున్నారని కథనాలు రావడంతో ఆయనపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో జనం తిరస్కరించిన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రజల్లోకి ఏ సంకేతాలు వెళతాయని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మనో ధైర్యం కలిగించాలంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో సమర్థులకు పగ్గాలు అప్పగించడమే మేలంటూ పలువురు నేతలు రూపొందించిన వినతి పత్రాలను మంగళవారం కాంగ్రెస్ అధిష్టానానికి ఫ్యాక్స్ చేశారు. కాగా టీపీసీసీ అధ్యక్ష పదవికి తన పేరును ప్రతిపాదించొద్దని సీఎల్పీనేత జానారెడ్డికి సూచించిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు సైతం బుధవారం ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది. -
ఇచ్చింది....అయినా పోయింది!
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ‘‘తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్సే.. ఒకవేళ తెలంగాణ రాకపోతే చచ్చేది కూడా కాంగ్రెస్సే’’- పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు టీ-కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పిన మాటలివి. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చినా.. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చచ్చినంత పనైంది. చేయి విరగ్గొట్టిన ప్రజలు * అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి * బిత్తరపోయిన టీ-కాంగ్ నేతలు * ఓటమికి కారణాలపై అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రభావం, సొంత పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రాష్ర్ట విభజనకు ఆమోదించింది. ఈ దెబ్బతో సెంటిమెంట్ పండుతుందని.. కనీసం ఒక ప్రాంతంలోనైనా అధికారం దక్కుతుందని భావించింది. కానీ జరిగింది మరొకటి! ఎవరూ ఊహించని రీతిలో ఆ పార్టీని ప్రజలు కసిదీరా ఓడించారు. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పేరు వింటేనే జనం ఛీకొట్టిన విధంగా తీర్పును వెలువరించారు. ఏ నియోజకవర్గంలో చూసినా కాం గ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అదే సమయంలో అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఘోరంగా పరాజ యం పాలయ్యారు. ఫలితంగా 119 అసెంబ్లీ స్థానాల్లో కనాకష్టంగా రెండు పదులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇక పార్లమెంట్ విషయంలో అత్యంత హీనమైన ఫలితాలను చవిచూసింది. మొత్తం 17 ఎంపీ సీట్లకుగాను రెండింటికే పరిమితమైంది. తెలంగాణలో ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలెవరూ ఊహించలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుం దని, పెద్ద పార్టీగా కాంగ్రెస్సే అవతరిస్తుందని అంచనా వేసిన టీ-కాంగ్ నేతలు తాజా ఫలితాలతో బిత్తరపోయారు.పార్టీ సంస్థాగత లోపాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత వంటి పలు అంశాలు కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. సెంటిమెంట్ ఆదుకోలేదు పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఐదేళ్ల రాజకీయ సంక్షోభాన్ని తెలంగాణ సెంటిమెంట్‌తో అధిగమించవచ్చని భావించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఏ మాత్రం కనికరించలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ముంచినట్లే తెలంగా ణలోనూ ఇంచుమించు అదే స్థాయిలో తీర్పునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే.. సాధించిన పార్టీయే మిన్న అని తమ ఓటుతో జనం స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల అస్తవ్యస్థ పాలన, రాజకీయ సంక్షోభం, అధిక ధరలు.. ఇలా ఒక్కటేమిటి? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా అనేక ప్రతికూల అంశాలు కాంగ్రెస్‌ను చుట్టుముట్టాయి. వెరసి హస్తానికి అధికారం దూరమైంది. నాయకత్వ వైఫల్యమూ కారణమే పార్టీ ఓటమికి నాయకత్వ లేమి కూడా ప్రధాన కారణమైంది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయోత్సవాలు జరుపుకోవడంలో, ఇదంతా తమ ఘనతేనని చెప్పుకోవడంలోనూ టీ-కాంగ్రెస్ నాయకత్వం దారుణంగా విఫలమైంది. బిల్లు ఆమోదం తర్వాత నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు తెలంగాణలో ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించలేక పోయారంటే వారి వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ చాంపియన్‌గా దూసుకుపోతుంటే ఆయనను ఢీకొనే నాయకుడే కాంగ్రెస్‌లో లేకుండా పోయాడు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవరికి వారే తాము గెలిస్తే చాలు, సీఎం కావచ్చుననే భావనలో సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసిన నాయకుడు ఒక్కరూ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోపంగా మారింది. చివరకు సీఎం రేసులో ఉన్న నాయకులు సైతం తాము గెలుస్తామో లేదోనన్న భయంతో కాంగ్రెస్ అతిరథులు సోనియా, రాహుల్ గాంధీలను తమ నియోజకవర్గానికే పిలిపించుకుని ప్రచారం చేయించుకోవడం గమనార్హం. టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల్లోని అభద్రతాభావానికి ఇదే పెద్ద నిదర్శనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం ఓడిపోతాననే భయం తో సినీ నటులు విజయశాంతి, జయప్రద, జయసుధలతో తన నియోజకవర్గంలో ప్రచారం చేయించడం టీ-కాంగ్రెస్ దుస్థితికి అద్దం పట్టినట్లయింది. అంతా హైకమాండే చేసింది !! పార్టీ ఘోర పరాభవానికి అధిష్టానం పెద్దలూ కారణమని చెప్పుకోవచ్చు. తెలంగాణ అంశం మొదలు పార్టీలో బాధ్యతలు అప్పగించడం, ఎన్నికల్లో ప్రచారం వరకు అన్నింట్లోనూ హైకమాండ్ పెద్దల జోక్యం ఎక్కువైంది. టీ-కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల అభీష్టానికి భిన్నంగా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోనే ఈ ప్రాంత నేతల్లో అసంతృప్తి మొదలైంది. అభ్యర్థులకు నిధులు, ప్రచార సామగ్రి, ఎన్నికల ప్రచార సభల నిర్వహణలో హైకమాండ్ జోక్యం పెరగడంతో తెలంగాణ నాయకత్వమంతా ఎన్నికల్లో అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. అంతా వారి వల్లే! తెలంగాణ విషయంలో కీలకంగా వ్యవహరించిన హైకమాండ్ పెద్దల్లో దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాజు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ముఖ్యులు. తెలంగాణ ప్రాంత బాధ్యతలను సోనియా గాంధీ వీరికే అప్పగించారు. పార్టీ పదవులు, అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచారం వరకు.. అన్నిం ట్లోనూ వీరి మాటకే అధినేత్రి విలువనిచ్చారు. తెలంగాణ జేఏసీ నేతలెవరూ గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ శ్రేణులు కోడైకూసినా దిగ్విజయ్ త్రయం వినిపించుకోలేదు. తెలంగాణలో రాజకీయంగా బలం గా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి నాయకత్వం అప్పగించకూడదనే ఉద్దేశంతో ఈ ముగ్గురు నేతలు చేసిన ప్రయత్నం వికటించింది. ఎన్నికల్లో ఓడిపోయిన టీ-కాంగ్ ప్రముఖులంతా దిగ్విజయ్, జైరాం, కొప్పుల రాజు వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. -
అందరి నోటా సోనియా పాట
సాక్షి, ప్రతినిధి, నిజామాబాద్: ‘ఇంటింటికీ కాంగ్రెస్ జెండా - సోనియా గాంధీకి అండ’ పేరుతో టీ-కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర సభలను పది జిల్లాలలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రపథమంగా బోధన్‌లో జైత్రయాత్ర సభను నిర్వహించారు. జన సమీకరణ కోసం జిల్లా మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి వారం రోజులుగా తీవ్రంగా కృషి చేశారు. జిల్లా నేతలు కూడా తగిన విధంగానే సహాయ సహకారాలు అందించారు. సభకు జిల్లా నలుమూలల నుంచి 50 వేల మంది ప్రజలను తరలించాలని నిర్ణయించినప్పటికీ ఒక్క బోధన్ నియోజకవర్గం నుంచే అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, జుక్కల్, బాన్సు వాడ, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల నుంచి నాయకులు, ముఖ్య కార్యకర్తలే తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా సభ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా నాయకుల రాక ఆలస్యం కావడంతో నాలుగు గంటల తర్వాత మొదలైంది. సభ ముగిసే సమయానికి సభా ప్రాంగ ణంలో నాయకులు, కార్యకర్తలు మాత్రమే కని పించారు. దీంతో ముఖ్య నేతలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, రాం రెడ్డి వెంకట్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య కొద్ది సమయంతోనే ప్రసంగాలు ముగించాల్సి వచ్చింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, మంత్రి ప్రసాద్‌రావు, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ బి.మహేష్ కుమార్ గౌడ్ మరికొందరు ముఖ్య నేతలు ప్రసంగించకుండానే వెనుదిర్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రం సభలో తీర్మానాలను ప్రవేశ పెట్టడం ద్వారా సభలో ప్రసంగించామన్న సంతృప్తిని పొందారు. సీమాంధ్ర పాలకులతోనే దుస్థితి బహిరంగ సభలో మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఎంపీ మధుయాష్కీగౌడ్, డి శ్రీనివాస్ మాత్రం జిల్లాతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు సమస్యలు ప్రస్తావించేం దుకు ప్రయత్నిం చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిరక్షించడంతో పాటు నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నీటిని నిజామాబాద్, మెదక్ జిల్లాలకే వినియోగించాలని కోరారు. సీమాంధ్ర పాలకుల వివక్ష కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని తీవ్రంగా మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహా కొత్తగా రెండు మూడు మాసాలలో ఏర్పడునున్న తెలంగాణ పునర్నిర్మాణంపై మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేంత వరకు అప్రమత్తం గా వ్యవహరించాలని మంత్రి జానారెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన సోనియాగాంధీని ప్రతి ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సోనియాగాంధీ ఫొటోను ప్రతి ఇంటిలో పెట్టుకోవాలని, వచ్చే తరం కూడా సోనియాగాంధీని మరిచిపోకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృతజ్ఞతాభావం చాటాలి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో 90 స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని చాటాలని పిలుపునిచ్చా రు. సోనియాగాంధీ చిత్రాన్ని సమాధి చేసిన టీడీపీ నాయకుల, కార్యకర్తల దుశ్చర్యలను తీవ్రంగా ఖం డించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీతోపాటు సమైక్య పాట పాడుతున్న పార్టీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సోని యాను అవమాన పరిచిన వ్యక్తులు, శక్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.