అసెంబ్లీకి పోటీ చేయనున్న శ్రీనివాస్ గౌడ్! | Telangana NGOs leader Srinivas Goud to join Congress or TRS? | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి పోటీ చేయనున్న శ్రీనివాస్ గౌడ్!

Published Fri, Jan 17 2014 11:01 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

అసెంబ్లీకి పోటీ చేయనున్న శ్రీనివాస్ గౌడ్! - Sakshi

అసెంబ్లీకి పోటీ చేయనున్న శ్రీనివాస్ గౌడ్!

హైదరాబాద్ : టీఎన్జీవో అధ్యక్షుడు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కో కన్వీనర్  శ్రీనివాస్ గౌడ్  అసెంబ్లీకి పోటీచేయనున్నారా ? అంటే అవుననే చెబుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.  ఆయన తన స్వస్థలం  మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం.  ఇటీవల కాలంలో శ్రీనివాస్ గౌడ్ తరచూ తన సొంత జిల్లాలో తరచూ పర్యటిస్తున్నారు.

చిన్నాచితకా కార్యక్రమాల్లోనూ  పాల్గొంటున్నారు. జేఏసీ నుంచి కొంతమందికి  టిక్కెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తారని చెబుతున్నా..కారు పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వకుంటే అధికార పార్టీ నుంచైనా  పోటీ చేయడానికి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తి చూపిస్తున్నటు సమాచారం.

ఈమేరకు కాంగ్రెస్ పార్టీతోనూ ఆయన టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు.  ఒకవేళ రెండు పార్టీలు కాదన్నా..సొంతంగా అయినా పోటీ చేయాలని  భావిస్తున్నట్టు సమాచారం.  గౌడ్కు నియోజకవర్గంలో  వ్యక్తిగత పరిచయాలతోపాటు తన సామాజికవర్గం ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్  ఇవన్నీ తనకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement