ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు ఎన్ని ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడటం ఖాయమని రాష్ట్ర మంత్రి బి.సారయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సీడబ్ల్యూసీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. దాంతో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ఎమైన వెనక్కి తగ్గుతుందా అన్న విలేకర్లు అడిగిన ప్రశ్నకు సారయ్య పై విధంగా సమాధానం ఇచ్చారు.
'సీమాంధ్రులు ఎన్ని చేసిన తెలంగాణ ఖాయం'
Published Sun, Sep 1 2013 1:56 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement