తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి | Telugu states Pays Tribute To YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి

Published Sat, Sep 2 2017 2:05 PM | Last Updated on Sat, Jul 7 2018 3:36 PM

Telugu states Pays Tribute To YS Rajasekhara Reddy

సాక్షి, హైదరాబాద్‌: నేడు తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమం‍త్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. పార్టీ ముఖ్యనేతలు.. వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దేశం నలుమూలల ఉన్న వైఎస్సార్‌ అభిమానులు ఆ అపర భగీరధుడుని గుర్తు చేసుకొన్నారు.

శనివారం ఉదయం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుటుంబ సభ్యులతో పాటు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ చేరుకొని సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా బతికే ఉన్నారని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ట్విట్‌ చేశారు.

వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ నేతలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పసుపులేటి సుధాకర్‌, పోలా శ్రీనివాసుల రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డిలు, పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, విజయ్‌ ప్రతాప్‌ రెడ్డి, శారదమ్మ, ఘనంగా నివాళులు అర్పించి ఆయన చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు.

►  వనపర్తి జిల్లా పెద్దగూడెంలో వైఎస్సార్సీపీ నేతలు విష్ణువర్దన్‌ రెడ్డి,  వెంకటేశ్‌లు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

►  కృష్ణాజిల్లా నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్‌ విగ్రహాకిని పూల మాల వేసి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ నివాళులు అర్పించారు. పామర్రులోని వైఎస్సార్సీపీ నేత కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

►  చిత్తూరు జిల్లా డీసీసీబీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పురుషోత్తమ్‌ రెడ్డి ఆధ్వర్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

గుంటూరు జిల్లా వినుకొండలో వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు.

►  అనంతపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డిలు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

►  విశాఖ జిల్లా అనకాపల్లిలోవైఎస్‌ఆర్‌ వర్ధంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ నేతలు మల్ల బుల్లిబాబు, సూరిబాబు, రమణ అప్పారావు, జూజూ రమేష్‌, మునగపాకలో బొడ్డేడ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు.

►  తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో వైఎస్సార్సపీ నేత తోట సుబ్బారావునాయుడు మహానేతకు నివాళులు అర్పించారు.

►  నెల్లూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలవేసిన ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌, కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

సుళ్లూరపేట, నాయుడు పేటల్లో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఇందులోదువ్వూరు బాల చంద్రారెడ్డి, రామ్మెహన్‌ రెడ్డి, రఫీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement