నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత
గుంటూరు: నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీటి విడుదల విషయంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఏపీ అధికారులు కుడికాల్వద‍్వారా నీటిని విడుదల చేయడాన‍్ని సోమవారం తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు.
అయితే.. తమకు రావాల్సిన వాటా పూర్తికాకుండానే నీటి విడుదలను తెలంగాణ అధికారులు ఎలా అడ్డుకుంటారని ఏపీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు.