నెల్లూరు (టౌన్): 2018 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు రూ.125, విద్యార్థి 3 సబ్జెక్ట్‌లకు రూ.110, 3 సబ్జెక్ట్ పైన రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. వచ్చే నెల 8వ తేదీలోపు అయితే అపరాధ రుసుం రూ.50, 20వ తేదీలోపు రూ.200, జనవరి 4వ తేదీలోపు అయితే అపరాధ రుసుం రూ.500లతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ప్రధానో ఎడ్యుకేషన్ స్పోర్ట్స్, అర్ట్స్, కల్చర్, జనరల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, అదర్ రిసిప్ట్స్ పద్దుల్లో చలానా రూపంలో చెల్లించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment