నడిరోడ్డుపై ఘోరం | Terrible on the road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై ఘోరం

Published Sun, Jul 17 2016 1:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Terrible on the road

- కొడుకును టీవీఎస్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తున్న వ్యక్తిపై సైక్లిస్ట్ దాడి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

 కంకిపాడు : స్వల్ప వివాదంతో తలెత్తిన ఘర్షణ ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని పునాదిపాడులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీసీ కెమేరాలో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంకిపాడు మండలంలోని కోలవెన్నుకు చెందిన కొల్లూరి సాంబశివరావు(38)తన చిన్న కుమారుడు పావన్‌కు జ్వరంగా ఉండటంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లేందుకు టీవీఎస్‌పై శుక్రవారం రాత్రి  బయలుదేరాడు.

ఈ క్రమంలో సైకిల్‌పై రోడ్డు దాటుతున్న దేవరపల్లి కిరణ్  అడుపడడంతో  వారి మధ్య వాగ్వాదం జరిగి కిరణ్ సాంబశివరావుపై తీవ్రంగా దాడి చేయడంతో కుప్పకూలాడు. కుటుంబీకులు బాధితుడ్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం సాంబశివరావు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement