కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే విజయ్ వట్టీ తివార్ గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా అభిప్రాయ సేకరణ చేపట్టారు. పార్టీ నూతన విధానంలో భాగంగా అభిప్రాయ సేకరణ, వ్యక్తిగత అంశాల పరిశీలన ద్వారా పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన జిల్లాకు వచ్చారు.
డీసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం 2నుంచి రాత్రి 8గంటల వరకు ఆయన ఆశావాహుల నుంచి దరఖాస్తులు, మద్దతుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా నాయకులు బలప్రదర్శనకు దిగారు. పోటాపోటీగా నినాదాలతో డీసీసీ కార్యాలయం మార్మోగింది.
000
ముందుగా ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని దరఖాస్తు అందచేశారు. ఎమ్మెల్యేకు పోటీ చేస్తారా, ఎంపీకి పోటీ చేస్తారా? అని పరిశీలకుడు ప్రశ్నించారు.
పార్టీ అధిష్టానం, మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశిస్తే దేనికైనా పోటీ చేస్తానని అడ్లూరి సమాధానమిచ్చారు. ఆయనకు మద్దతుగా సర్పంచ్‌లు, మండల శాఖల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు పరిశీలకుడిని కలిశారు. యూత్ కాంగ్రెస్ లోక్‌సభ స్థానం ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి ప్రకాశ్, అంబేద్కర్ సంఘం నాయకుడు జానపట్ల స్వామి తమకు టికెట్ ఇవ్వాలని కోరారు.
పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశి స్తున్న మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి వేలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా వచ్చారు. కార్యాలయం లోపల పరిశీలకుడి ని కలిసి తన అర్హతను వివరించిన గీట్ల, బ యటకు వస్తే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవచ్చని సూచించారు. దీంతో పరి శీలకుడు ఫంక్షన్‌హాల్‌కు వచ్చి అభిప్రాయా లు సేకరించారు. గీట్లకు టికెట్ ఇచ్చి కాంగ్రె్ స పార్టీని బతికించండంటూ కొంతమంది పరిశీలకుని కాళ్లు పట్టుకోవడంతో నాయకు లు వారించారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గుర్రాల మల్లేశం, కోట రాంరెడ్డి, మాదాసు వెంకన్న పటేల్, గజభీంకర్ జగన్, గుర్రాల లావణ్య, కన్న అశోక్‌గౌడ్, రవీందర్, మహేందర్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ్ తదితరులు గీట్లకు టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు తన మద్దతుదారులతో పరిశీలకుడిని కలిశారు. మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ నాయకులతో బలప్రదర్శన చేశారు. కొక్కిస రవీందర్‌గౌడ్, సురేశ్‌గౌడ్, మహేశ్వర్‌రావు, బొల్లం లక్ష్మణ్, కొమురయ్య తదితరులు భానుప్రసాద్‌రావుకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఆయనకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.
మత్స్యపారిశ్రామిక సంస్థ చైర్మన్ చేతి ధర్మయ్య తన మద్దతుదారులతో వచ్చారు. బలహీనవర్గాల కోటాలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ ఈర్ల కొమురయ్య, నాయకులు సి.సత్యనారాయణరెడ్డి, వేమల రామ్మూర్తి తమకు అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.
రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కౌశిక హరి భారీ ప్రదర్శనతో వచ్చి పరిశీలకుడిని కలుసుకున్నా రు. కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్‌రావు, బాబర్‌సలీంపాషా తమ మద్దతుదారుల నినాదాల నడుమ దరఖాస్తు చేసుకున్నారు. గంట సత్యనారాయణరెడ్డి, బడికెల రాజలింగం, రియాజ్‌అహ్మద్, రాయమల్లుగౌడ్, తానిపర్తి గోపాల్‌రావు తమకు టికెట్ ఇవ్వాలంటూ బయోడేటా సమర్పించారు.
మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే టికెట్ ఇవ్వాలంటూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్‌రావు, డీసీసీ అధికారప్రతినిధి శశిభూషణ్‌కాచె తదితరులు పరిశీలకునికి దరఖాస్తు అందచేశారు.
పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జానపట్ల స్వామి దరఖాస్తు చేసుకున్నారు.
గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తే లోకసభతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను సైతం గెలుచుకుంటామని నేతకాని సంఘం నాయకులు వినతిపత్రం అందచేశారు. నేతకాని కులస్తుల ఓట్లు ఈ సెగ్మెంట్ పరిధిలో రెండు లక్షల పైచిలుకు ఉన్నాయని, ఆ కులానికి చెందిన గోమాస శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తే గెలుపుఖాయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం నర్సయ్య, పుల్లయ్య కాంబ్లి కోరారు. ఇప్పటివరకు మాదిగ కులానికి పార్టీ అవకాశం ఇవ్వలేదని, ఈసారి టికెట్ మాదిగలకే ఇవ్వాలని కాసిపేట లింగయ్య విన్నవించారు.
ఓపిగ్గా అభిప్రాయ సేకరణ
ఆశావాహులు, మద్దతుదారుల నుంచి పరిశీ లకుడు ఓపిగ్గా అభిప్రాయాలు విన్నారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలను అడగడంతో పా టు, మద్దతునిస్తున్న నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులను ఎందుకు ఆ నాయకుడికి మద్దతునిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సదరు నియోజకవర్గం పరిస్థితి ఏమి టి, గతంలో పార్టీ ఎందుకు గెలవలేకపోయింది, ప్రత్యర్థి పార్టీ ఎందుకు విజయం సాధించిందనే వివరాలు ఆరా తీశారు.
గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులతో పరిశీలకుడు ప్రత్యేకంగా సంభాషించా రు. ముకుందరెడ్డికి టికెట్ ఇవ్వమంటున్నారు... మీకోసం ఎందుకు అడగడం లేదంటూ పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఆయనైతేనే అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతారని వారు బదులిచ్చారు. ముకుందరెడ్డి కో డలుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంద ని ఆరా తీయగా, ఆయనకే అవకాశం ఇవ్వాలంటూ నా యకులంతా కోరారు.
రామగుండంలో మైనార్టీ కో-ఆర్డినేటర్లు అంటూ వినతిపత్రం ఇవ్వడంపై పరిశీలకుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది మైనార్టీ కో-ఆర్డినేటర్లు ఉంటారని నిలదీ శారు. గ్రూపుకో కో-ఆర్డినేటర్ ఉన్నట్లున్నారని, ఇలాంటి వ్యవహారం నడవద న్నా రు. తాను సేకరించిన పేర్లను నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున తయారుచేసి రాహుల్‌గాంధీ కి ఇస్తామని విజయ్ తెలిపారు. డీసీసీ అధ్యక్షు డు కొండూరు రవీందర్‌రావు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.
బలప్రదర్శన
Published Fri, Jan 24 2014 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement