మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మృతి | The death of the former Minister Chaudhry rambhupal | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మృతి

Published Thu, Apr 9 2015 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మృతి - Sakshi

మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మృతి

కర్నూలు: అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి(74) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడలో 1942 ఆగస్టు 1న జన్మించిన ఆయన ఇంజినీరింగ్ (బీఈ) చదువుకున్నారు.  కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 

నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడి ్డ  హయాంలో మంత్రిగా పని చేశారు. 1983లో మొదటిసారిగా టీడీపీ తరపున కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరి రెండోసారి, 1994లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2013 నవంబర్‌లో కాంగ్రెస్‌ను వీడి మళ్లీ టీడీపీలో చేరారు. గురువారం ఉదయం అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.
 
చంద్రబాబు, కేసీఆర్ సంతాపం

మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. చౌదరి మృతికి కేంద్రమంత్రి సుజనా చౌదరి సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement