కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మేడారంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ పూర్తయ్యాయని, గత జాతరలో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కిషన్ తెలిపారు. భక్తుల రాక ఈసారి చాలా రోజుల ముందు నుంచే ప్రారంభమైనా జాతర ప్రారంభమైన తర్వాత ముఖ్యమైన ఆ మూడురోజుల్లో మరింత రద్దీ ఉంటుందన్నారు. జాతరలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
గత ంలో అమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు క్యూలైన్ల వద్ద ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గుర్తించి నేను స్వయంగా సందర్శించి క్యూలైన్లు మార్చాలని సూచించా. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల వల్ల దర్శనం కాస్త ఆలస్యమైనా తొక్కిసలాట జరగకుండా ఉంటుం ది. బాగా ఆలోచించే ఇలా ఏర్పాటు చేశాం. ఫలితంగా దర్శనం సమయంలో చాలా సమస్యలు తగ్గుతాయి. గద్దెల వద్ద కూడా కొన్ని మార్పులు చేశాం. దీనివల్ల భక్తులు గద్దెలకు రెండువైపుల నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది.
ట్రాఫిక్ సమస్యలు రానివ్వం
జాతర సందర్భంగా మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటి వరకైతే అవసరం ఉన్నంత మేర పనులు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు ఏవైనా మిగిలితే జాతర తరువాత చేయాలని చెప్పాం. ఆదివారం సాయంత్రానికి పనులు పూర్తయినట్టే భావించవచ్చు. బ్రిడ్జి పను లు, వెంగళాపూర్, పగిడాపూర్ రోడ్లలో డైవర్షన్లు ఇరుగ్గా లేకుండా చర్యలు తీసుకున్నాం. స్నానఘట్టాల వద్ద భక్తులకు ఇబ్బందిలేకుండా అవసరం మేర పెంచాం. అధికారులు జాతర మూడు రోజులూ అందుబాటులో ఉంటారు.
నాణ్యతపై రాజీలేదు
పనులు వేగంగా చేసినంత మాత్రాన నాణ్యత లేకుంటే మాత్రం వదిలిపెట్టేది లేదు. తాత్కాలిక పనులను పక్కన పెడితే శాశ్వత పనుల విషయంలో నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ముందునుంచీ చెబుతూ వస్తున్నాం. ఆ ప్రకారం చర్యలు ఉంటాయి. ఇక జాతర విధులు కేటాయించిన అధికారుల్లో చాలామందికి బదిలీ అయింది. అయితే జాతర ముగిసిన తర్వాత ఒకేరోజు అందరినీ రిలీవ్ చేస్తాం.
సకలం పూర్తి
Published Mon, Feb 10 2014 3:24 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement