గద్వాల, న్యూస్‌లైన్: నడిగడ్డ చేనేత కార్మికుల కష్టలు ఇక తీరనున్నాయి.. పోచంపల్లి తరహాలో గద్వాల చేనేతపార్కును ఆధునికరీతిలో డిజైన్ చేసేందుకు ప్రభుత్వం సంకల్పిం చింది. అందులో భాగంగానే కార్మికులకు శి క్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధంచేసింది. గద్వాల మండలం అ నంతపురం గ్రామం వద్ద ఆధునిక మగ్గాలతో చేనేత పార్కును ఏర్పాటు చేసేం దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇ టీవల జిల్లా మంత్రి డీకే అరుణ ఇక్కడి కార్మికులను పోచంపల్లికి తీసుకెళ్లి అక్కడి పార్కును, అక్కడి కార్మికుల పనివిధానా న్ని చూపించారు. 25 ఎకరాల్లో కేంద్రం నుంచి వచ్చే ఆర్థికసహాయం కలిపి రూ. 40 కోట్ల అంచనాతో కొత్త చేనేతపార్కు ను ఏర్పాటుకు సంబంధితశాఖ జిల్లా అ ధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. గద్వాల ప్రాంతంలో ఉన్న వేలాది మంది చేనేత కార్మికులు సంప్రదాయంగా ఇప్పటివరకు వస్తున్న పద్ధతిలో చీరలను మాత్రమే తయారుచేస్తున్నారు.
అలా కాకుండా అన్నిరకాల దుస్తుల త యారీలో శిక్షణ పొందే విధంగా యూ ని ట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కోయూనిట్‌లో 40మగ్గాలు ఉండేలా కొత్తపార్కును ప్రతిపాదించారు. కార్మికులకు శిక్షణ ఇవ్వడంతోపాటు, అద్దకం, డిజైన్ల రూపకల్పన తదితర ఆధునిక పద్ధతుల ను అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక స హాయంతో పాటు బ్యాంకురుణాన్ని తీసుకుని పోచంపల్లి కన్నా ఆధునిక పద్ధతుల్లో అనంతపురం చేనేతపార్కును తీర్చిదిద్దనున్నారు. అలాగే మరో ఐదు ఎకరాల్లో కార్మికులు అక్కడే ఉండేందుకు క్వార్టర్స్‌ను కూడా నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా చేర్చారు.
పార్కు బోర్డుకే పరిమితం
చేనేత పార్కులో మౌలిక సదుపాయాలను కల్పించే పనులు చేపట్టాలని ఏపీఐసీసీకి అప్పగించినా.. నిధులు బదిలీచేసినా రూ.50 లక్షలు ఉన్నా ఏ పనులు చేయకుండా రెండేళ్లు కాలం గడిపిన ఏపీఐసీసీ నిర్వాకంతో బోర్డులకే చేనేతపార్కు పరిమితమైంది. 2007లో గద్వాల పట్టణానికి సమీపంలోని అనంతపురం వద్ద 50 ఎకరాల్లో చేనేతపార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.మూడుకోట్ల అంచనా వ్యయంతో మంజూరు ఇచ్చింది.
రెండేళ్ల క్రితం మొదటిదశ రూ.50 లక్షలు మంజూరుచేసినా పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. పోచంపల్లి చేనేత పార్కును గద్వాల ప్రాంత కార్మికులతో కలిసి సందర్శించినట్లు మంత్రి డీకే అరుణ తెలిపారు. అక్కడ ఉన్న ఆధునిక మరమగ్గాలు, ఇతర ఆధునిక పద్ధతులను గద్వాల చేనేతపార్కులో కార్మికులకు అందుబాటులో ఉండేలా మోడల్‌పార్కును తీర్చిదిద్దుతామన్నారు. అయితే ప్రభుత్వ ఆశయం ఏ మేరకు నెరవేరుతుందో వేచిచూడాల్సిందే.
చేనేతకు మహర్దశ
Published Thu, Jan 2 2014 3:31 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement