తొలి రోజే తెలంగాణకు కేంద్ర నిధులు అందాయి | The Government of India starts providing funds to Telangana | Sakshi
Sakshi News home page

తొలి రోజే తెలంగాణకు కేంద్ర నిధులు అందాయి

Published Mon, Jun 2 2014 9:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

తొలి రోజే తెలంగాణకు కేంద్ర నిధులు అందాయి - Sakshi

తొలి రోజే తెలంగాణకు కేంద్ర నిధులు అందాయి

న్యూఢిల్లీ: భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు అందడం సోమవారం నుంచి ఆరంభమయ్యాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్రానికి అందించాల్సిన నిధులను సోమవారం నుంచి ఇవ్వడం ప్రారంభించామని ఆర్ధిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
13వ ప్లానింగ్ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ప్రతి నెల తొలి పనిదినాన అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు చట్టం 2014 ద్వారా ఏర్పడిన తెలంగాణ జూన్ 2 తేదిన అవిర్భవించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖర్ రావు పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement