
ఫైబర్‌గ్రిడ్ టెక్నాలజీతో ప్రధాన రహదారి
మంత్రి నారాయణ వెల్లడి
తుళ్లూరు : జపాన్‌కు చెందిన బయోటెక్స్ ఫైబర్‌గ్రిడ్ టెక్నాలజీతో తాత్కాలిక సచివాలయం ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టబోతున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాపురం నుంచి సచివాలయం వరకు 20 రోజుల్లో 1.65 కి.మీ. రహదారి నిర్మించేందుకు రోడ్లు భవనాల శాఖను ఆదేశించామన్నారు.
మంచి రోజులు లేని కారణంగా సోమవారం పలు ప్రభుత్వ శాఖల భవనాలు ప్రారంభించలేదని వివరించారు. ఈ నెల 13వ తేదీన ఐదో బ్లాక్‌లో మొదటి అంతస్తు, రెండో బ్లాక్‌ను ప్రభుత్వ శాఖలకు అందజేయనున్నట్లు చెప్పారు. అదే రోజు ఏఏ శాఖలు వస్తాయనే విషయంలో స్పష్టత ఇస్తామని తెలిపారు.