సుజనా పేరు సిఫారసు చేశా | The name has been recommended for sujana -babu | Sakshi
Sakshi News home page

సుజనా పేరు సిఫారసు చేశా

Published Sun, Nov 9 2014 1:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

The name has been recommended for sujana -babu

కేంద్ర మంత్రి పదవిపై చంద్రబాబు

హైదరాబాద్: టీడీపీ తరఫున పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వై.సత్యనారాయణ చౌదరి (సుజనా) ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. విస్తరణ గురించి ప్రధాని నరేంద్రమోదీ తనకు ఫోన్ చేశారని తెలిపారు. ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, ఆ పదవికి సుజనా  పేరు సిఫారసు చేశానన్నారు.మరోసారి అవకాశం వస్తే  తెలంగాణకు కేటాయిస్తామని చెప్పారు.

పీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది: సుజనా

చంద్రబాబుతో శనివారమిక్కడ సుజనా చౌదరి భేటీ అయ్యారు. విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వక భేటీయేనన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement