Union Minister of State
-
పోలవరం తొలిదశ పూర్తికి 12,911 కోట్లు.. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొలిదశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 12,911 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు 10 వేల 911.15 కోట్ల రూపాయలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్ 5న తెలిపిందని పేర్కొన్నారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు. పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 17,144 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జూన్ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించి మార్చి 15, 2022న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జూలై 15, 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణలోకి తీసుకున్న పిమ్మటే మొత్తం 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. -
జిల్లాకు అన్యాయం
* గిరిజన వర్సిటీ తరలిపోతున్నా పట్టించుకోని కేంద్ర మంత్రి * వైఎస్ఆర్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సుజయ్ బొబ్బిలి(విజయనగరం): ‘‘ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం, ప్రతీ కమిటీ ఇదే నివేదిక ఇస్తోంది, రాష్ట్ర విభజనలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు...అయితే ఇక్కడకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని పక్క జిల్లాకు తరలిస్తున్నారు ఇదేనా అభివృద్ధి చేయడమంటే ’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్కృష్ణ రంగారావు ప్రశ్నించారు. బొబ్బిలిలో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినా ఇప్పటివరకూ ఒక్కటి కూడా అమలులోకి రాలేదన్నారు. పార్వతీపురం డివిజన్లో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారని, దీంతో జిల్లా వాసులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. మాన్సాస్ భూములు ఇస్తుండడంతో ఎంతో సంతోషపడ్డారని చెప్పారు. అయితే ఇప్పుడు విశాఖపట్నానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని తరలించడం అన్యాయమన్నారు. ఇదేనా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయడం అని ఆయన ప్రశ్నించారు. సొంత జిల్లాకి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చూస్తూ ఊరుకోవడం సబబుగా లేదన్నారు. -
సుజనా పేరు సిఫారసు చేశా
కేంద్ర మంత్రి పదవిపై చంద్రబాబు హైదరాబాద్: టీడీపీ తరఫున పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వై.సత్యనారాయణ చౌదరి (సుజనా) ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. విస్తరణ గురించి ప్రధాని నరేంద్రమోదీ తనకు ఫోన్ చేశారని తెలిపారు. ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, ఆ పదవికి సుజనా పేరు సిఫారసు చేశానన్నారు.మరోసారి అవకాశం వస్తే తెలంగాణకు కేటాయిస్తామని చెప్పారు. పీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది: సుజనా చంద్రబాబుతో శనివారమిక్కడ సుజనా చౌదరి భేటీ అయ్యారు. విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వక భేటీయేనన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. -
కేంద్ర మంత్రి ఏరీ.. ఎక్కడ?
అరకు రూరల్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర ప్రకటనను వెనక్కు తీసుకోవాలని కోరుతూ అరకులోయలో ఎన్జీవో, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు చేపడుతున్న ఉద్యమం దినదినం హోరెత్తుతోంది. అరకులోయలోని వైఎస్సార్ జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఏపీఎన్జీవో, ఉపాధ్యాయులు, సమైకాంధ్ర జేఏసీ నాయకులు, వర్తకులు ఆదివారం అరకులోయలో రాజకీయ పార్టీల నాయకులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. అరకు నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది మంత్రి పదవి స్వీకరించి, ఈ ప్రాంతాన్నే మరిచిపోయిన కిషోర్ చంద్రదేవ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసన బ్యానర్లో మంత్రి ఫొటోలు పెట్టి ర్యాలీ నిర్వహించి అరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా దీక్షా శిబిరంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ టి. నర్శింగరావు మాట్లాడారు. ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపడుతున్న పోరాటంలో అన్ని పార్టీలు కలసికట్టుగా పొల్గొనా లని సూచించారు. దేశంలోని మన్యసీమ ప్రాంతాలను కలుపుకొని దండకారణ్య రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపున అరకులోయలో తెలుగుదేశం చేపట్టిన నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది.