మూడేళ్లలో రైతులకు కొత్త పంపుసెట్లు
దుర్ముఖి నామ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
♦ రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల పంప్సెట్ల మార్పిడి
♦ జూలైలోగా అన్ని గ్రామాలకూ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్
♦ 76 మందికి కళారత్న, ఉగాది పురస్కారాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న 15 లక్షల వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో తయారైన ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నామనీ, రైతులకు వీటిని ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే మూ డేళ్లలోగా ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నామన్నారు. కొత్త తెలుగు సంవత్సరం సందర్భంగా పంపుసెట్ల పంపిణీ ఫైలుపై తొలి సంతకం చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక, దేవాదాయ ధర్మాదా య శాఖలు సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉగాది వే డుకల్లో సీఎం పాల్గొన్నారు. జూలై లోగా రా ష్ట్రంలోని అన్ని గ్రామాలకూ ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
శ్రీనివాస గార్గేయ పంచాంగ పఠనం..
ఈ సందర్భంగా వేదికపై పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ దుర్ముఖినామ సంవత్సర పంచాంగ పఠనం చేశారు. దుర్ముఖి అనగానే ప్రతి ఒక్కరూ ఇదో వ్యతిరేక గుణమున్నదిగా భావిస్తారని, వాస్తవానికి పంచాంగ చరిత్రలో అద్భుత గ్రహస్థితులు ఈ ఏడాదే రాబోతున్నాయన్నారు. శుక్రుడు రాజ్యాధిపతిగానూ, బుధుడు మంత్రిగానూ మిత్రత్వంతో మెలగ డం వల్ల పాలన బాగుంటుందన్నారు. ఆగస్టు నుంచి నైరుతీ రుతుపవనాల కారణంగా మంచి వర్షాలు పడతాయన్నారు. నల్ల నేలలు, నల్లనిపంటలు సాగుకు అనుకూలమనీ, అక్టోబరు తర్వాతనే ఎరుపు, పసుపు పంటలకు అనుకూలమన్నారు.
ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం 99 భాగాలైతే, వ్యయం 105 భాగాలన్నారు.ఈ ఏడాదిలో సేనాధిపతి అయిన కుజుడు 139 రోజుల పాటు శత్రువైన శనితో సంఘర్షణ పడుతుంటాడనీ, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పాలకులు జాగ్రత్తగా ఉండాలని గోచార, గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పసిడి ధరలు బాగా తగ్గుతాయన్నారు. ఏడాదిలో వ్యతిరేకంగా కనిపించే 139 రోజుల్లోనూ యజ్ఞయాగాదులు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. తర్వాత డాక్టర్ బి నరసింహదీక్షితులు కూడా పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు తయారు చేసిన పంచాంగాలను బాబు ఆవిష్కరించారు.
వేడుకగా పురస్కారాల ప్రదానం...
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని 76 మంది కళా, సాహిత్య రంగాల ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే చాగంటి కోటేశ్వరరావుకు మొట్టమొదటి కళారత్న పురస్కారాన్ని అందజేశారు. సినీనటి, గాయత్రీ ఉపాసకురాలు కాంచన, ఎస్ఆర్ మిశ్రో, కథా రచయిత కలవకొలను సదానంద, సంగీత విద్వాంసులు బీవీ మోహనకృష్ణ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా చాగంటి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం నిర్ణయం తీసుకున్నా రు. సమాజ వికాసం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను అభివృద్ధి కాముకులుగా మార్చే దిశగా సేవలందించేందుకు చాగంటిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి విధులను స్వీకరించి, రాష్ట్రమంతా పర్యటించి ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి చాగంటికి అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు.