Optical fiber grid
-
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్. -
ఇంటింటికీ ఇంటర్నెట్
ఉట్నూర్(ఖానాపూర్): రాబోయే రోజుల్లో జిల్లాలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2022 నాటికి టీ–ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైట్ ఆఫ్ వే అనుమతులు ఇవ్వడంతో ప్రతి ఇంటికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు మమ్మురం చేసింది. ఆయా ప్రాంతాల్లో టీఫైబర్ ఏర్పాటు చేసే పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్(పీవోపీ)లకు ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణాల కోసం ఉచితంగా స్థలం కేటాయించనుంది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆధునిక సాంకేతికత అభివృద్ధి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ గ్రీడ్ ద్వారా ఇంటింటా ఇంటర్నెట్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, వ్యక్తిగత గృహాలు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ కేబుల్ వేయనున్నారు. కేబుల్ వేసే బాధ్యతలను ఎల్అండ్టీ, స్టెరిలైట్ టెక్పాలజీస్ లిమిటెడ్‌లకు టెండర్ల ద్వారా అప్పగించారు. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలు కేబుల్స్‌ను భూగర్భం(అండర్ గ్రౌండ్)లో, స్తంబాల (ఏరియల్) ద్వారా విస్తరించనున్నారు. అవసరమైనచోట మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా వేసిన హై డెన్సిటీ పాలిఇథైలిన్ పైపుల ద్వారా కేబుల్ వేయనున్నారు. ఫైబర్ కేబుల్స్ పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనుంది. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రైట్ ఆఫ్‌వే ఆదేశాలు జారీచేసింది. మొదట గ్రామ పంచాయతీలకు.. జిల్లాలో 18 మండలాలు, 468 గ్రామపంచాయతీలు, 508 రెవెన్యూ గ్రామాలు, 2,02,954 నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్లైన్లతో పాటు ఇంటర్నెట్కు సంబంధించిన ఫైబర్ కేబుల్ పైపులైన్ వేశారు. మొదటి విడతలో అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభించింది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపిండ్ యార్డులు, నర్సరీలు, హరిత వనం, తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఈ పనులకు సంబందించిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పొందుపర్చాల్సి ఉంది. అదీకాక గ్రామాల్లో జనన, మరణ వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్ సేవలు అత్యవసరం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేక పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని మండల పరిషత్ కార్యాలయాలకు పంపిస్తే కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో రికార్డు చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అటు తర్వాత నివాసాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టింది. ఆదేశాలు రాగానే చర్యలు జీపీలకు ఇంటర్నెట్ సౌకర్యంపై పూర్తిస్థాయిలో ఆదేశాలు రాగానే తగిన చర్యలు చేపడుతాం. ఇంటర్నెట్ వసతుల కల్పనకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనులు చేయాల్సి ఉంటుంది. టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో కిందిస్థాయి నుంచి అధికారులు నిర్వహించే విధుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్ పనులు వేగంగా జరుగుతాయి. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి -
మూడేళ్లలో రైతులకు కొత్త పంపుసెట్లు
దుర్ముఖి నామ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ♦ రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల పంప్సెట్ల మార్పిడి ♦ జూలైలోగా అన్ని గ్రామాలకూ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ♦ 76 మందికి కళారత్న, ఉగాది పురస్కారాలు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న 15 లక్షల వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో తయారైన ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నామనీ, రైతులకు వీటిని ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే మూ డేళ్లలోగా ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నామన్నారు. కొత్త తెలుగు సంవత్సరం సందర్భంగా పంపుసెట్ల పంపిణీ ఫైలుపై తొలి సంతకం చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక, దేవాదాయ ధర్మాదా య శాఖలు సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉగాది వే డుకల్లో సీఎం పాల్గొన్నారు. జూలై లోగా రా ష్ట్రంలోని అన్ని గ్రామాలకూ ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. శ్రీనివాస గార్గేయ పంచాంగ పఠనం.. ఈ సందర్భంగా వేదికపై పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ దుర్ముఖినామ సంవత్సర పంచాంగ పఠనం చేశారు. దుర్ముఖి అనగానే ప్రతి ఒక్కరూ ఇదో వ్యతిరేక గుణమున్నదిగా భావిస్తారని, వాస్తవానికి పంచాంగ చరిత్రలో అద్భుత గ్రహస్థితులు ఈ ఏడాదే రాబోతున్నాయన్నారు. శుక్రుడు రాజ్యాధిపతిగానూ, బుధుడు మంత్రిగానూ మిత్రత్వంతో మెలగ డం వల్ల పాలన బాగుంటుందన్నారు. ఆగస్టు నుంచి నైరుతీ రుతుపవనాల కారణంగా మంచి వర్షాలు పడతాయన్నారు. నల్ల నేలలు, నల్లనిపంటలు సాగుకు అనుకూలమనీ, అక్టోబరు తర్వాతనే ఎరుపు, పసుపు పంటలకు అనుకూలమన్నారు. ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం 99 భాగాలైతే, వ్యయం 105 భాగాలన్నారు.ఈ ఏడాదిలో సేనాధిపతి అయిన కుజుడు 139 రోజుల పాటు శత్రువైన శనితో సంఘర్షణ పడుతుంటాడనీ, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పాలకులు జాగ్రత్తగా ఉండాలని గోచార, గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పసిడి ధరలు బాగా తగ్గుతాయన్నారు. ఏడాదిలో వ్యతిరేకంగా కనిపించే 139 రోజుల్లోనూ యజ్ఞయాగాదులు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. తర్వాత డాక్టర్ బి నరసింహదీక్షితులు కూడా పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు తయారు చేసిన పంచాంగాలను బాబు ఆవిష్కరించారు. వేడుకగా పురస్కారాల ప్రదానం... ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని 76 మంది కళా, సాహిత్య రంగాల ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే చాగంటి కోటేశ్వరరావుకు మొట్టమొదటి కళారత్న పురస్కారాన్ని అందజేశారు. సినీనటి, గాయత్రీ ఉపాసకురాలు కాంచన, ఎస్ఆర్ మిశ్రో, కథా రచయిత కలవకొలను సదానంద, సంగీత విద్వాంసులు బీవీ మోహనకృష్ణ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా చాగంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం నిర్ణయం తీసుకున్నా రు. సమాజ వికాసం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను అభివృద్ధి కాముకులుగా మార్చే దిశగా సేవలందించేందుకు చాగంటిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి విధులను స్వీకరించి, రాష్ట్రమంతా పర్యటించి ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి చాగంటికి అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు.