చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: పాఠశాల పక్కనే టపాకాయలను పెద్దసంఖ్యలో నిల్వ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవా రం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదులను క్రైమ్ సీఐ జగన్‌మోహన్ రెడ్డి స్వీకరించారు. చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాల పక్కనే టపాకాయల నిల్వలు ఉంచి విక్రయిస్తున్నారన్నారని ఫిర్యాదు చేశారు.
ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ టపాకాయల గోడౌన్ పై గతంలోనే ఫిర్యాదులు చేశామన్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో గోడౌన్ నిర్వాహకులు తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు వారిపై క ఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవించారు. తమ వాహనం చోరీకి గురై కుప్పంలో ప్రత్యక్షమైందని, దానిని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్రం కొచ్చిన్‌కు చెందిన అశోక్ అనే వాహన యజమాని ఫిర్యాదు చేశాడు.
గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామంలో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ రోగులకు కాలంచెల్లిన మందుల ను పంపిణీ చేయడంతో, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, సకాలంలో వైద్యం చేయించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అతడిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు విన్నవించారు. పుంగనూరు మండలంలోని మేలిపట్ల, రాంపల్లె గ్రామాల్లోని అంగన్‌వాడీ సెంటర్లలో పౌష్టిక ఆహారం పక్కదోవ పడుతోందని మహిళలు ఫిర్యాదు చేశారు. పీలేరు సబ్‌జైల్‌లో ఉన్న ఖైదీలను చూడటానికి వెళ్తే, అక్కడున్న సిబ్బంది రూ.1000 లంచం డిమాండ్ చేస్తున్నారని ఖైదీల బంధువులు వాపోయారు.
గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన సర్పంచ్ ఇసుక రవాణా అనుమతి కోసం డబ్బు డిమాం డ్ చేస్తున్నారని ఫిర్యాదు అందింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో మూడు రోజుల క్రితం 10హెచ్05 ఏఎం1605 నెంబర్ లారీ ఆపి డీజల్ నింపుకుని, కత్తి చూపించి బెదిరించి డబ్బు ఇవ్వకుండా వెళ్లారని బాధిత పంప్ ఆపరేటర్ ఫిర్యాదు చేశాడు. పుత్తూరు, పుంగనూ రు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. వీటితో పా టు మొత్తం 35 ఫిర్యాదులు అందాయి.
పాఠశాల పక్కనే టపాకాయల గోడౌన్లు
Published Thu, Oct 3 2013 4:07 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM
Advertisement
Advertisement