Crockery Godown
-
స్టీల్‌బ్యాంక్
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకునే సాధారణ గృహిణి తులికా సునేజా. ‘చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, అప్పుడే భవిష్యత్ తరాల మనుగడకు ఢోకా ఉండదన్న తాపత్రయం తనది. ‘వాయు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం’ అని చెప్పేవారే కానీ ఆచరించేవారు అరుదు. అందుకే కాలుష్య స్థాయుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదని భావించిన తులికా... పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించి ‘క్రోకరీ బ్యాంక్’ నడుపుతోంది. ఈ బ్యాంక్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషిచేస్తోంది. ఫరీదాబాద్‌కు చెందిన తులికా సునేజా ఓ రోజు పిల్లలతో బయటకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు... రోడ్డుమీద కొంతమంది ఉచితంగా అన్నదానం చేస్తుండడం చూసింది. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు అని సంతోష పడేలోపు.. చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు కనిపించాయి. తులికాతో ఉన్న తన పిల్లలు ‘‘అమ్మా ఇలా ప్లాస్టిక్ పడేయడం పర్యావరణానికి మంచిది కాదు, దీనిని నియంత్రించడానికి షరిష్కారమే లేదా?’’ అని తల్లిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్నకు తులికా దగ్గర సమాధానం లేదు. కానీ డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని రోజుల తరబడి ఆలోచించసాగింది. కొన్నిరోజుల తర్వాత తన మదిలో మెదిలిన ఐడియానే ‘క్రోకరీ బ్యాంక్’. ఎవరికీ నమ్మకం కుదరలేదు.. తనకు వచ్చిన క్రోకరీ బ్యాంక్ ఐడియాను తన స్నేహితులతో చెప్పింది తులిక. ‘‘బ్యాంక్ ఆలోచన బావుంది కానీ ఎవరు పాటిస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చాలా స్థలం, డబ్బులు కావాలి’’ అన్న వారే తప్ప సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చడానికి తన భర్త సాయం తీసుకుంది. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడంతో.. తాను దాచుకున్న డబ్బులతో స్టీ్టల్వి.. యాభై టిఫిన్ ప్లేట్లు, యాభై స్పూన్లు, యాభై భోజనం చేసే ప్లేట్లు, యాభై గ్లాసులు కొనింది. ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లోనే వచ్చేశాయి. ఈ స్టీల్ సామాన్లతో 2018లో తనింట్లోనే ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ గురించి తెలిసిన కొంతమంది తమ ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు ఈ సామాన్లు తీసుకెళ్లేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో చాలామంది ఫంక్షన్లకు ఈ ఇక్కడి నుంచే సామాన్లను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం తులికాకు మద్దతు ఇవ్వడంతో క్రోకరీ బ్యాంక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నాపెద్దా పుట్టినరోజు వేడుకలు, కిట్టీపార్టీలు, కొన్ని ఆర్గనైజేషన్లలో జరిగే చిన్నపాటి ఈవెంట్లకు సైతం ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంక్ నుంచే సామాన్లు తీసుకెళ్తున్నారు. తులికాను చూసి ఫరీదాబాద్‌లో పదికి పైగా స్టీల్ క్రోకరీ బ్యాంక్‌లు ఏర్పాటయ్యాయి. నేను చాలా చిన్నమొత్తంతో క్రోకరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాను. ఎవరైనా ఇలాంటి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. నాలా మరికొంతమంది పూనుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. దీని ద్వారా 2018నుంచి ఇప్పటిదాకా ఐదులక్షల డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించగలిగాను. భవిష్యత్‌లో మరింత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి భారీస్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిస్తాను. – తులికా -
ఎఫ్ఎస్ఎల్కు చేరిన హార్డ్ డిస్క్
వరంగల్ క్రైం : వరంగల్ కాశిబుగ్గ కోటిలింగాల గుడి ప్రాంతంలో భద్రకాళి ఫైర్వర్క్స్లో జరిగిన బాంబు పేళుళ్లలతో వరంగల్ నగరం ఉలిక్కిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెంది నేటికి నెల రోజులైంది. జూలై 4న జరిగిన ఈ పేలుళ్లను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించి భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని గుళ్లపెల్లి రాజ్‌కుమార్‌ను సంఘటన జరిగిన రాత్రే అరెస్టు చేసి జైలుకు పంపించారు. జనావాసాల్లో ప్రమాదకరమైన ఫైర్ వర్క్స్‌ను కొనసాగించటం, దానిని కొన్ని ప్రభుత్వ శాఖలు అనుమాతులు ఇవ్వడం, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు జరిగాయని ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పోలీసులు ఘటనకు కారణమైన నిందితుడిని అరెస్టు చేయడంతో అతడికి సంబంధించిన గోడౌన్లను సీజ్ చేశారు. ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు సహితం వినిపించాయి. దర్యాప్తునకు సాంకేతిక అడ్డంకులు... బాంబు పేలుళ్ల సంఘటన స్థలంలో పోలీసు అధికారులు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భద్రకాళి ఫైర్‌వర్క్స్‌లోకి పనికి వచ్చే కార్మికులకు సంబంధించిన హాజరు రిజిష్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను హైదరాబాద్‌లోని సైబర్ క్రైం విభాగానికి పంపించారు. అక్కడ దానిని ఓపెన్ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పడంతో తిరిగి హార్డ్‌డిస్క్‌ను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కు పంపించారు. ప్రస్తుతం హార్డ్ డిస్క్ హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్లో ఉంది. దీనిని ఓపెన్ చేయటానికి ముంబై నుంచి నిపుణులు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రమైన వేడి, మంటలకు హార్డ్ డిస్క్ భాగం దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో నిపుణుల సమక్షంలోనే దానిని ఓపెన్ చేయటానికి అధికారులు నిరీక్షిస్తున్నట్లు సమాచారం. హార్డ్ డిస్క్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారంపైనే కేసు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న విచారణ... ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తోంది. దీంతో బాధిత కుటుంబాల నుంచి ప్రజల నుంచి అధి కారులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని గుళ్లపెల్లి రాజ్‌కుమార్ బయటకు రావటానికి ఇప్పటికే నాలుగు సార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు అతడికి బెయిల్ మంజూరు కాలేదు. ప్రమాదం జరిగిన రోజున అనుమానాస్పదంగా ఉన్న మల్లికార్జున్, రాకేష్ మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నివేదికలను తెప్పించడంలో వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ తీవ్రంగా కృషి చేశారు. ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబరేటరీ ఫలితాలు వస్తే పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేస్తారని చెబుతున్నారు. మృతుల్లో 10 మంది.. జులై 4న వరంగల్ కాశిబుగ్గలోని కోటిలింగాల గుడి ప్రాంతంలో భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో జరిగిన పేళుళ్లలో మొత్తం 10 మంది మృతి చెందారు. సంఘటన జరిగిన రోజు 8 మందిని గుర్తించగా ఆ తరువాత ఇద్దరి మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మొత్తం 10 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో ... కాశిబుగ్గ తిలక్‌రోడ్‌కు చెందిన గాజుల హరిక్రిష్ణ (38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్డులోని బాలాజీ నగర్‌కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వలసదాసు అశోక్‌కుమార్(30),కాశిబుగ్గ సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన బాలినే రఘపతి (40), కీర్తి నగర్‌కు చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్యనగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన మల్లికార్జున్(35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్(22) బాంబు పేలుళ్లలో మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరందరి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. శోకసంద్రంలో బాధిత కుటుంబాలు భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. ప్రమాదంలో కుటుంబ పెద్ద, తల్లుల కోల్పోయిన పిల్లలు, భర్తలను కోల్పోయిన భార్యలు ఇలా... ఒక్కో కుటుంబంలో ఒక్కో రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించిన ఆ కుటుంబాలకు ఆసరా నివ్వలేక పోతున్నాయి. ప్రమాదంలో మరణించిన మృతులంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారే కావడంతో అన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం , ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు ఏదైన ఉపాధి అవకాశాలు చూపెడితే తప్ప కోలుకోలేని స్థితుల్లో ఆ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం.. భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగిణించి దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. సాధారణంగా డీఎన్ఏ రిపోర్టు రావటానికి నాలుగైదు నెలలు పడుతుంది. కాని మూడు నాలుగు రోజుల్లో డీఎన్ఏ రిపోర్ట్ తెప్పించి వారికి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చేశాం. కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో ఉంది. దానిని ఓపెన్ చేసి నివేదిక తెప్పించటానికి సంబంధిత అధికారులతో మాట్లాడాం. దీంతోపాటు నిందితుడు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నాం. ఫైర్, విద్యుత్ శాఖల నివేదికలు కూడా రావాల్సి ఉంది. త్వరలో జన సంచార ప్రదేశాల్లో ఉన్న షాపులన్నింటికి నోటీసులు జారీ చేస్తాం. దీంతో వారి అనుమతులు రద్దవుతాయి. బాధితులకు పోలీసు శాఖపరంగా అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ విశ్వనాథ రవీందర్ పోలీసు కమిషనర్ -
పాఠశాల పక్కనే టపాకాయల గోడౌన్లు
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: పాఠశాల పక్కనే టపాకాయలను పెద్దసంఖ్యలో నిల్వ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవా రం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదులను క్రైమ్ సీఐ జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాల పక్కనే టపాకాయల నిల్వలు ఉంచి విక్రయిస్తున్నారన్నారని ఫిర్యాదు చేశారు. ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ టపాకాయల గోడౌన్ పై గతంలోనే ఫిర్యాదులు చేశామన్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో గోడౌన్ నిర్వాహకులు తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు వారిపై క ఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవించారు. తమ వాహనం చోరీకి గురై కుప్పంలో ప్రత్యక్షమైందని, దానిని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్రం కొచ్చిన్‌కు చెందిన అశోక్ అనే వాహన యజమాని ఫిర్యాదు చేశాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ రోగులకు కాలంచెల్లిన మందుల ను పంపిణీ చేయడంతో, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, సకాలంలో వైద్యం చేయించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అతడిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు విన్నవించారు. పుంగనూరు మండలంలోని మేలిపట్ల, రాంపల్లె గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లలో పౌష్టిక ఆహారం పక్కదోవ పడుతోందని మహిళలు ఫిర్యాదు చేశారు. పీలేరు సబ్జైల్లో ఉన్న ఖైదీలను చూడటానికి వెళ్తే, అక్కడున్న సిబ్బంది రూ.1000 లంచం డిమాండ్ చేస్తున్నారని ఖైదీల బంధువులు వాపోయారు. గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన సర్పంచ్ ఇసుక రవాణా అనుమతి కోసం డబ్బు డిమాం డ్ చేస్తున్నారని ఫిర్యాదు అందింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో మూడు రోజుల క్రితం 10హెచ్05 ఏఎం1605 నెంబర్ లారీ ఆపి డీజల్ నింపుకుని, కత్తి చూపించి బెదిరించి డబ్బు ఇవ్వకుండా వెళ్లారని బాధిత పంప్ ఆపరేటర్ ఫిర్యాదు చేశాడు. పుత్తూరు, పుంగనూ రు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. వీటితో పా టు మొత్తం 35 ఫిర్యాదులు అందాయి.