పొరపాటు ప్రశ్నలు తొలగించి ఫలితాలు ప్రకటించొచ్చు
2011 గ్రూప్1 మెయిన్స్ పేపర్-5పై స్టాండింగ్ కౌన్సిల్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌లో నిర్వహించిన 2011 గ్రూప్-1 మెరుున్‌స పరీక్షల్లో పేపర్-5లో దొర్లిన తప్పుడు ప్రశ్నలను తొలగించి ఫలితాలు ప్రకటించవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కు స్టాండింగ్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సూచించింది. గ్రూప్1 మెయిన్స్ పరీక్షలోని పేపర్-5లో 42.5 మార్కులకు సంబంధించిన వివిధ ప్రశ్నల్లో తప్పులు దొర్లారుు. వీటిపై అభ్యంతరాలు రావడంతో నిపుణుల కమిటీ సలహాను కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రశ్నలను మొత్తంగా తొలగించి తక్కిన ప్రశ్నల మార్కులను వందశాతానికి పెంచి ఫలితాలు ప్రకటించవచ్చని స్టాండింగ్ కౌన్సిల్ కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. దీనివల్ల న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఉండవని పేర్కొంది. నివేదిక రావడంతో 2011 గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు.
కమిటీకి స్క్రీనింగ్ టెస్టు అభ్యంతరాలు
రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని 748 అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నవంబర్‌లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి కమిషన్ ఇటీవల కీ విడుదల చేసింది. దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చారుు. వీటిని పరిశీలించే బాధ్యతను కమిషన్ నిపుణుల కమిటీకి అప్పగించింది. నిపుణుల కమిటీ నివేదిక త్వరలోనే రానుందని, ఆ వెంటనే స్క్రీనింగ్ టెస్టు ఫలితాలు వెల్లడిస్తామని చైర్మన్ చెప్పారు. డిసెంబర్ 29, 30 తేదీల్లో ఏఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. గ్రూప్-3, గ్రూప్-1 పోస్టులకు సంబంధించి కొంత సమాచారం రావలసి ఉందని, డిసెంబర్ 15లోగా వాటిని రప్పించి నోటిఫికేషన్లు వెలువరిస్తామంది.