స్వయం ఉపాధికి సమాధి
సబ్సిడీ చెల్లించని సర్కారు
పేరుకుపోతున్న బకాయిలు
ముందుకురాని బ్యాంకులు
సీఎంకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు
అయినా లెక్కలేస్తున్న అధికారులు
విశాఖపట్నం: ఈ ఏడాది స్వయం ఉపాధి కింద యూనిట్ల ఏర్పాటు సందేహమే. సర్కా రు నుంచి సబ్సిడీ రాక..లబ్ధిదారుల నుంచి రికవరీ లేక బ్యాంక ర్లు ముఖం చాటేస్తున్నాయి. అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల మేర సబ్సిడీ విడుదల కాకపోవడంతో రుణాలిచ్చేం దుకు విముఖత చూపుతున్నాయి. జిల్లా లో ఏటా యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం..ఆనక సబ్సిడీ విడుదల కాక యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం పరిపాటిగా మా రిపోయింది. గతేడాది డిసెం బర్‌లో ఆదరాబాదరాగా ఎస్సీ, బీసీ కార్పొ రేషన్లకు యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సర్కార్ నేటికి సబ్సిడీ విడుదల చేయలేదు. ఈ ఏడాది కూడా సబ్సిడీ విడుదలవుతుందో లేదోననే ఆందోళన అటు బ్యాంకర్లలోనూ ఇటు అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. తాజాగా కొత్త గా యూనిట్స్ నెలకొల్పేందుకు సంక్షేమ శాఖలన్నీ సిద్ధమవుతున్నాయి. సబ్సిడీ బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంక ర్లు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. పైగా సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచి రికవరీ పెద్దగా లేకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీంతో సబ్సిడీ మొత్తాన్ని డిపాజిట్‌గా పెట్టుకుని రుణాలిస్తామని చెబుతున్నాయి. బ్యాంక ర్ల తీరును తప్పుబడు తూ అధికార పార్టీ ఎ మ్మెల్యేలు జిల్లాకు వ చ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. బ్యాంకర్లు వ్యాపార ధోరణితో ఆలోచించడం సరికాదని..సామాజిక బాధ్యత కోణంలో చూడాలని ఇటీవల సీఎం కూడా వ్యాఖ్యానించిన ట్టు సమాచారం. సబ్సిడీ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చినప్పటికీ బ్యాంకర్లు మాత్రం విశ్వసించడం లేదు. సబ్సిడీ విడుదల కాకుం డా రుణం ఇవ్వలేమని తెగేసి చెబుతున్నాయి.
బకాయిలన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఆశతో లబ్దిదారులెవ్వరూ ఒక్క పైసా చెల్లించడం లేదని..ఈ విధంగా జిల్లాలో రూ.450కోట్లకు పైగా పేరుకుపోయాయని చెబుతున్నారు. బ్యాంకర్ల నుంచి సహాయనిరాకరణ ఎదురవుతున్నా...జిల్లా యంత్రాంగం మాత్రం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి సర్కార్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎస్సీ,బీసీ, మైనార్టీ తదితర సంక్షేమ శాఖల ద్వారా 9760 యూనిట్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గతేడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నెలకొల్పిన787 యూనిట్స్‌కు రూ.12.53కోట్ల మేర సబ్సిడీ ఇటీవలే విడుదలైంది. మిగిలిన బీసీ, మైనార్టీ తదితర సంక్షేమ శాఖల ద్వారా గ్రౌండ్ చేసిన యూనిట్స్‌కు నేటికీ సబ్సిడీ మొత్తం విడుదల కాలేదు. ఈనేపథ్యంలో ఈ ఏడాది నిర్ధేశించిన యాక్షన్ ప్లాన్ అమలుపై సందేహాలు ముసురుకున్నాయి.