జగదేవ్‌పూర్/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్ :
అప్పుల బాధలు తాళలేక ఇరువురు రైతులు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగదేవ్‌పూర్ మండలం చేబర్తి మదిరా నర్సన్నపేట గ్రామానికి చెందిన గిలక మల్ల య్య (48) పురుగుల మందు తాగగా.. సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామానికి చెందిన రాములు (33) ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు..
నర్సన్నపేట గ్రామానికి చెందిన గిలక మల్లయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తనకున్న రెండు ఎకరాల్లో పంటల సాగుకు 15 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన భూకల మల్లేశం వద్ద తన భూమిని తాకట్టు పెట్టి రూ. 60 వేలు అప్పు చేశాడు. అయితే చేసిన అప్పు తీర్చాలని, లేని పక్షంలో భూమి తన పేరున మార్చాలని మల్లేశం మృతుడిని తరచూ వేధించేవాడు. ఇదిలా ఉండగా.. గ్రామానికి రెవెన్యూ అధికారి వచ్చినప్పుడు మృతుడు పహణీలో తన పేరు మీద సర్వే నంబర్ చూసుకోగా పట్టా భూమి భూకల మల్లేశం పేరు రావడంతో కంగు తిన్నాడు. దీంతో రైతు మల్లయ్య గ్రా మంలో మంగళవారం పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టాడు. అయితే ఈ పంచాయితీకి భూకల మల్లేశం రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన రైతు ఇంట్లో రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుం బీకులు ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపు మృతి చెందాడు. అనంతరం మృతుడి కుటుంబీకు లు మల్లయ్య మృతదే హంతో రుణదాత భూ కల మల్లేశం ఇంటి ఎదుట బైఠాయించా రు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకోవడంతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. మృతుడికి భార్య నర్సమ్మ, కుమారుడు రాంచంద్రంలు ఉన్నారు. మృతుడికి మరో రూ. లక్ష అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామానికి చెందిన రైతు బక్కి బాలయ్య వ్యవసాయం పనులతో పాటు దినసరి కూలీగా పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం కుమార్తె, ఏడాది కింద కుమారుడి పెళ్లి చేశాడు. పెళ్లి కోసం, పంటల పెట్టుబడులు, బోర్లు వే సేందుకు అప్పులు చేశాడు. బోర్లు వేసినా అందులో నీరు పడలేదు. దీనికి తోడు చేసిన అప్పులు తీర్చమని రుణ దాతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. తండ్రి బాలయ్య చేసిన అప్పులు ఎలా తీర్చాల అని రైతు రాములు (33) కుటుంబ సభ్యులతో చర్చించాడు. అయతే అప్పుల విషయంలో రాములు, రమ దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రమ వారం కిందట పుట్టినింటికి వెళ్లింది. అప్పులు తీర్చే మార్గం లేక రాములు మదన పడ్డాడు. దీంతో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాములుకు ఏడాది వయస్సు గల కుమార్తె, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వం రాములు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతుడికి రూ. 2.5 లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.
ఇరువురి రైతుల ఆత్మహత్య
Published Wed, Nov 20 2013 11:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement