
ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఉందని తవ్వకాలు
- అల్లిఖానుడిపాలెంలో ఉత్కంఠ
అనకాపల్లి: మండలంలోని అల్లిఖానుడిపాలెం గ్రామస్థులు ముత్యాలమ్మతల్లి విగ్రహం కోసం తవ్వకాలు ప్రారంభించారు. కొద్ది వారాలుగా గ్రామంలోని వేపచెట్టు నుంచి పాలు కారుతుండటంతో పాటు అమ్మవారు పలువురిని ఆవహించి ఇక్కడ విగ్రహం ఆనవాళ్లు చెప్పినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. దీంతో బుధవారం రాత్రి వేపచెట్టుకు పూజలు చేసి, గోతులు తీశారు. ఉదయం నుంచి స్థానికులంతా అక్కడకు చేరుకొని అమ్మవారి విగ్రహం కోసం తవ్వకాలు ప్రారంభించారు. అమ్మవారి విగ్రహం దొరికిన వెంటనే ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అమ్మవారి పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మవారి విగ్రహం కోసం గ్రామానికి చెందిన పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు ఎదురుచూడటంతో ఉత్కంఠ నెలకొంది.