=మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాభివృద్ధికి కృషి
=అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : జిల్లాలో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాభివృద్ధితోపాటు క్రీడల కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. వరంగల్ హంటర్‌రోడ్డులోని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మంచి అవకాశాలున్నాయన్నారు. ప్రధానంగా కుంగ్‌ఫూ, తైక్వాండో, జూడో, బాక్సింగ్‌లో ప్రవేశం ఉన్న క్రీడాకారులు సైతం ఈ ఆటలో పాల్గొనేందుకు అవకాశముంటుందని తెలిపారు. జిల్లా నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారుకావాలని, వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు.
అనంతరం జూడో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర టెక్నికల్ డెరైక్టర్ కైలాస్‌యాదవ్ మాట్లాడుతూ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు ముంబై, విశాఖలో ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయని, మూడో ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర, జాతీయ అసోసియేషన్ సెక్రటరీలతో చర్చించినట్లు వెల్లడించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో జనవరిలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అసోసియేషన్ కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షులు రాజు, శ్రీనివాస్, రవి, సారంగపాణి, వెంకట్, మహెందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలు వినీల్, ధన్‌రాజు, ఆదినారాయణ, బోగేశ్వర్, కోశాధికారి భాస్కర్, కార్యవర్గసభ్యులు నిశాంత్, రాజు, జనార్దన్, వంశీధర్, హరిబాబు పాల్గొన్నారు.