ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా క ర్లపాలెంలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామానికి చెందిన పరిశుద్ధరావు(20) కర్లపాలెంలో ఉన్న తన మేనమామ ఇంటికి వచ్చాడు. మేనమామ కుమారుడు అయ్యప్ప మాల ధరించడంతో.. అతనితో పాటు భజన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యప్ప స్వాములతో కలిసి కాలువ వద్ద స్నానానికి వెళ్లాడు.
ఈక్రమంలో ఇతినిక ఈత రాకపోవడంగో గట్టు పై కూర్చొని స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడి కాలువలో కొట్టుకుపోయాడు. స్థానికులు ఎంత వెతికిన లాభం లేకపోవడంతో గజ ఈత గాళ్లకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా.. గల్లంతైన యువకుడు జాతీయ స్థాయిలో ఎన్‌సీసీ పరేడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు స్థానికులు తెలిపారు.