వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిపై మంత్రి కామినేని ఆగ్రహం
విజయవాడ : వైద్య, ఆరోగ్య శాఖలో ఒక్కరైనా సరిగ్గా పనిచేస్తున్నారా? పట్టాలు పొంది, సెలవులు తీసుకుంటుంటే ప్రజలకు వైద్య సేవలు ఎవరందిస్తారు? అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి పనితీరును ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి మంత్రి సమీక్షించారు.
మంత్రి కామినేని మాట్లాడుతూ రూ.కోట్లు ఖర్చయ్యే పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేయడానికి ప్రభుత్వ సర్వీసులో చేరుతున్న వారిని ఉపేక్షించేదిలేదని పేర్కొన్నారు. వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టర్ బాబు.ఎ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగమల్లేశ్వరి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి పాల్గొన్నారు. .
ఒక్కరైనా సరిగా పనిచేస్తున్నారా..?
Published Sat, Dec 5 2015 1:05 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement