వైవీయూ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వెలువడే వరకు ఉద్యమానికి ఆపేది లేదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సహకరిస్తున్నారంటే ప్రజల్లో సమైక్యాంధ్ర అవసరం ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. ఉద్యమం తీవ్రస్థాయిలో చేయడం వల్లే ఇప్పటికీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొన్ని సంఘాలు మాత్రం విధులకు హాజరవుతున్నాయన్నారు.
విద్యార్థులు నష్టపోకూడదని, చాలామంది మధ్యాహ్న భోజనం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఉపాధ్యాయులు సమ్మెబాట వీడారని, అయితే ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారన్నారు. ఎన్‌జీఓ అధ్యక్షుడు కె.వి. శివారెడ్డి మాట్లాడుతూ అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామన్నారు. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులను కూడా ఉద్యమంలోకి తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నామన్నారు. జెడ్పీ సీఈఓ మాట్లాడతూ విధులకు హాజరవుతూ రోజుకో విభాగం వారితో ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఈశ్వరయ్య, కడప ఆర్డీఓ హరిత, నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు, పశుసంవర్థకశాఖ జేడీ వెంకట్రావు, మైనార్టీశాఖ ఈడీ శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి ఖాదర్‌బాషా, జిల్లా అధికారులు అపూర్వసుందరి, ప్రతిభాభారతి, భాస్కర్‌రెడ్డి, ప్రసాద్, ఎంఈఓ నాగమునిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమ్మెను ఆపేది లేదు
Published Sat, Oct 12 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement