మంత్రి అయ్యన్న ఆరోపణల్లో వాస్తవం లేదు: కలెక్టర్‌ | There is no truth in the allegations made by the minister Ayyanna says collector | Sakshi
Sakshi News home page

మంత్రి అయ్యన్న ఆరోపణల్లో వాస్తవం లేదు: కలెక్టర్‌

Published Sun, Jul 16 2017 5:16 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

There is no truth in the allegations made by the minister Ayyanna says collector

సాక్షి, విశాఖపట్నం: మెడ్‌టెక్‌ పార్కు భూసేకరణకోసం పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. భూసేకరణ, లబ్ధిదారుల ఎంపిక,  పరిహారం చెల్లింపు నిబంధనలకనుగుణంగానే జరిగిందన్నారు. ఐదుసార్లు గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగానే లబ్ధిదారుల జాబితాను తయారుచేశామని, ఎక్కడా అవకతవకలు జరగలేదని చెప్పారు.

ఎక్కడా సెంటు ప్రభుత్వ భూమిని.. ప్రభుత్వానికే అమ్మిన దాఖలాల్లేవన్నారు. ఎవరైనా అనర్హులు పరిహారం పొందినట్టు నిరూపిస్తే వారినుంచి రికవరీ చేయడమేకాదు.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మెడ్‌పార్క్‌ భూపరిహారం పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మంత్రి అయ్యన్న సిట్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement