Minister ayyanna
-
మంత్రి అయ్యన్న ఆరోపణల్లో వాస్తవం లేదు: కలెక్టర్
సాక్షి, విశాఖపట్నం: మెడ్‌టెక్ పార్కు భూసేకరణకోసం పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. భూసేకరణ, లబ్ధిదారుల ఎంపిక, పరిహారం చెల్లింపు నిబంధనలకనుగుణంగానే జరిగిందన్నారు. ఐదుసార్లు గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగానే లబ్ధిదారుల జాబితాను తయారుచేశామని, ఎక్కడా అవకతవకలు జరగలేదని చెప్పారు. ఎక్కడా సెంటు ప్రభుత్వ భూమిని.. ప్రభుత్వానికే అమ్మిన దాఖలాల్లేవన్నారు. ఎవరైనా అనర్హులు పరిహారం పొందినట్టు నిరూపిస్తే వారినుంచి రికవరీ చేయడమేకాదు.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మెడ్‌పార్క్ భూపరిహారం పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మంత్రి అయ్యన్న సిట్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. -
డబ్బుల కోసం ఆ మాత్రం నిలబడలేరా?
ప్రజల ఇబ్బందులపై మంత్రి అయ్యన్న చోడవరం: పాత నోట్ల రద్దు, బంగారంపై ట్యాక్స్ వ్యవహారంలో మీడియా అనవసరంగా అపోహలు సృష్టిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి సినిమా టికెట్ల కోసం 4 గంటలు లైన్లలో నిలబడే జనం.. అవసరమైన డబ్బుల కోసం గంటసేపు బ్యాంకుల వద్ద నిలబడలేరా? అంటూ ప్రశ్నించారు. బంగారంపై విధించిన నిబంధనల వల్ల ధనికులైన 20 శాతం మందే ఇబ్బంది పడతారని, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బందీ ఉండదని చెప్పారు. -
16 కోట్లు.. 20 రోజులు
మార్చి నెలాఖరు గడువు దగ్గర పడటంతో హడావుడిగా నిర్మాణాలు 11 నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు 20 రోజుల్లో రూ. 16 కోట్లకు టార్గెట్ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలు మార్చి నెలాఖరులోగా ఉపాధి హామీ, ఆర్థిక సంఘ నిధులు ఖర్చు చేయాలన్న నిబంధనవల్ల అధికారులు ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చాలాచోట్ల వారి పర్యవేక్షణ లేకుండా జరగడం వల్ల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇలాకాలో పరిస్థితి. నర్సీపట్నం: నర్సీపట్నం డివిజన్లో ఉపాధిహామీ, 13, 14 ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మార్చి నెలాఖరులోగా పూర్తిచేయకుంటే నిధులు రద్దయ్యే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆదర్శ గ్రామాలే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోట్లు కేటాయించడం తెలిసిందే. 20 రోజుల్లో ఎలా పూర్తి? నర్సీపట్నం డివిజన్లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకం, 13,14వ ఆర్థిక సంఘం నుంచి 675 పనులకు రూ.22.7 కోట్లు మంజూరయ్యాయి. 11 నెలల వ్యవధిలో రూ.6 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రూ.16.7 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు పనులు పూర్తి చేయించడానికి అధికారులు హైరానా పడుతున్నారు. ఏడాది కాలంగా పనులు పూర్తి చేయలేని అధికారులు స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి హెచ్చరించినా.. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను నిర్ధేశించిన సమయానికి ఖర్చు చేయకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే నిధులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నిధులను వచ్చే ఏడాది విడుదలయ్యే నిధుల్లోచూపించే అవకాశం ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేవలం 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవటం వారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కానరాని నాణ్యత నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేందుకు అధికారులు ఆదరాబాదరాగా పనులు చేపట్టడంతో వీటిలో నాణ్యత లోపించే అవకాశం లేకపోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలామంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వారంతా అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు జరిపించేస్తున్నారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం పనులు: 675 ఏడాదికి కేటాయించిన నిధులు: రూ.22.7కోట్లు 11 నెలల్లో పూర్తయినవి: రూ.6 కోట్ల విలువైన పనులు 20 రోజుల్లో పూర్తికావాల్సినవి: రూ.16.7కోట్ల విలువైన పనులు లక్ష్యాన్ని అధిగమిస్తాం ఇసుక కొరత వల్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. సాధ్యమైనంత వరకు మార్చి నెలాఖరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. - కె.ప్రభాకర్‌రెడ్డి, ఈఈ, పంచాయతీరాజ్ నర్సీపట్నం డివిజన్ -
అయ్యన్న మరిచిన అరణ్య రోదన!
⇒పెదగంగవరం గిరిజనేతరుల సమస్యపై ఏడాది క్రితం మంత్రి వాగ్దానం ⇒సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఆస్కారం లేకపోవడంపై విస్మయం ⇒ఇప్పటికీ బాధితులు పశువుల పాకల్లో తలదాచుకుంటున్న వైనం ⇒ఏళ్ల తరబడీ పరిష్కారం కాని సమస్య ‘ఇలాంటి సమస్య దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా చూడ లేదు.. వినలేదు. కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నా, ఇన్ని హక్కులు ఉండి కూడా మీ భూముల్లో మీరు పక్కా ఇళ్లు నిర్మించు కోకుండా అడ్డుపడటం దారుణం.. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకె ళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తా.. అది కూడా నా హయాంలోనే పరిష్కారమయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతా.. ఇటువంటి పరిస్థితి రావడం దారుణం’.. ఏడాది కిందట అనంతగిరి మండలం పెదగంగవరం గ్రామానికి చెందిన గిరిజనేతరుల సమస్య విన్న మంత్రి అయ్యన్న పాత్రుడి స్పందన ఇది. దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ బుచ్చింపాలెం గ్రామంలో నిర్మించిన మినీ రిజర్వాయర్ ప్రారంభానికి పెదగంగవరం మీదుగా గత ఏడాది ఫిబ్రవరి 27న వచ్చిన మంత్రి అయ్యన్న పాత్రుడిని పెదగంగవరం గ్రామస్తులు అడ్డుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పటికి సుమారు నెల రోజులు క్రితం ఇళ్లు అగ్నికి ఆహుతై పశువుల పాకల్లో తలదాచుకుంటున్న గ్రామస్తుల దుస్థితిని చూసి మంత్రి అయ్యన్న చలించిపోయారు. సమస్య పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తానని.. పరిష్కరించే వరకు వెనుకాడేది లేదని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది దాటిపోయింది. మంత్రి గారిని గ్రామస్తులు కలుస్తూనే ఉన్నారు.. ఇప్పటికీ సమస్య అలాగే ఉంది. దేవరాపల్లి: ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్య పరిష్కారానికి మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక దారి చూపిస్తారని పెదగంగవరం గ్రామస్తులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఏడాది కిందట మంత్రి గ్రామానికి వచ్చి అక్కడి గిరిజనేతరుల దుస్థితిని చూసి గ్రామ పెద్దలు ఫోన్ నంబర్లును తీసుకోవడంతో పాటు, తన ఫోన్ నంబర్‌ను కూడా గ్రామ పెద్దలకు ఇచ్చి తరుచూ కలు స్తూ ఉండాలని సూచించారు. అప్పటి నుండి గ్రామస్తులు పలుమార్లు మంత్రిని కలిశారు. మంత్రి హామీ ఇచ్చి ఏడాది గడిచినా పరిష్కార మార్గం కనిపించకపోవడంతో గ్రామస్తులు కలవరడుతున్నారు. సమస్య ఇదీ.. అనంతగిరి మండలం పెదగంగవరం గిరిజన గ్రామంలో గిరిజనేతరులైన సుమారు 300 కుటుంబాలు గ్రామం ఏర్పడిన 1847 నుండి నివాసం ఉంటున్నారు. వీరు పూర్వీకుల నుండి సంక్రమించిన భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి కొందరు గిరిజనులు, గిరిజన సంఘాల నాయుకులు 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులైన మీకు ఎటువంటి హక్కులు ఉండవని సమస్యను లేవెనెత్తడంతో అప్పటి నుండి గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై గిరిజనేతరులు మాత్రం 1/70 చట్టం ప్రకారం 1963 ముందు కంటే గిరిజన ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరులకు కూడా గిరిజనలతో సామాన హక్కులు ఉంటాయని, ఈ మేరకు 2/70 చట్టాన్ని జారీ చేశారని చెబుతున్నారు. దీని ప్రకారం తమకు గతంలో అధికారులు సెటిల్మెంట్ పట్టాలను, పాసు పుస్తకాలను, పట్టాదారు పుస్తకాలను జారీ చేశారని తెలిపారు. పక్కా ఇళ్లకు నోచుకోని వైనం గత ఏడాది జనవరి 17న గ్రామంలో గిరిజనేతరుల 29 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. జన్మభూమిలో ఇళ్లు మంజూరైనా గిరిజన సంఘాల నాయుకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి అన్ని హక్కులు ఉన్న తమకు ఎల్పీసీలు ఇవ్వడం లేదని గిరిజనేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాజ్యం కోర్టు పరిధిలో ఉంది. అన్నదమ్ముళ్లా ఉంటున్నాం.. గిరిజనులు, గిరిజనేతరులమైన తామంతా పూర్వీకుల నుండి అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉంటున్నాం.. కొందరు గిరిజన సంఘాల నాయకులు లేని సమస్యను సృష్టించి రాద్దాంతం చేస్తున్నారు.. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా పూర్తి భాద్యత ప్రభుత్వమే వహించాలి. చివరగా మంత్రి అయ్యన్నపైనే ఆశలు పెట్టుకున్నాం. ఆయన చొరవ తీసుకుంటే ఇచ్చిన హామీ మేరకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - కె.వి.రమణ, శ్రీరామా నాన్ ట్రైబుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి, పెదగంగవరం అన్ని పత్రాలు ఉన్నా హక్కు లేదంటున్నారు నా చిన్న నాటి నుండి గ్రామంలో నివాసం ఉంటున్నాను. మా భూములకు పాసు పుస్తకాలతో పాటు అన్ని పత్రాలు ఉన్నా పక్కా ఇళ్ళు నిర్మించుకోకుండా అడ్డుకోవడం అన్యాయం. పూరిళ్లు కాలిపోయి ఏడాది దాటిపోతున్నా.. వాటి స్థానంలో పక్కా ఇళ్లతో పాటు స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డు నిర్మించుకోకుండా అడ్డుకోవడం అత్యంత దారుణం. పశువుల పాకల్లో నివాసం ఉంటున్నాం. మేము బతికి ఉండగానే మంత్రి అయ్యన్న సమస్య పరిష్కరించాలి. - కొట్టాన అచ్చన్న, గిరిజనేతర వృద్ధుడు. -
మద్దతు ధర మాటేమిటి?
మంత్రి అయ్యన్నను నిలదీసిన చెరకు రైతులు అడ్డుకున్న ఎమ్మెల్యే రాజు ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు బుచ్చెయ్యపేట: టన్ను చెరకుకు మద్ధతు ధర ఎంత..గతేడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకు, దవ్వ డబ్బులు ఎప్పుడిస్తారంటూ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును పలువురు చెరకు రైతులు నిలదీశారు. ఆదివారం బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రిని ‘గోవాడ’ రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోయినా ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మంత్రి వివరణ ఇచ్చేలోపే చోడవరం ఎమ్మేల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కల్పించుకుని ఇది సమయం కాదని తర్వాత మాట్లాడుదామని రైతులను వారించడంతో పలువురు తీవ్ర ఆగ్రహం చెందారు. మిల్లుకు గతేడాది సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. సర్కారు విధానాలతో ఏలా బతకాలని వాపోయారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు గోవాడ ఫ్యాక్టరీని తమకు అప్పగిస్తే టన్నుకు రూ.3500 ధర చెల్లిస్తామంటూ రోడ్డేక్కి ఆందోళనలు చేపట్టిన ఎమ్మేల్యే ప్రస్తుతం మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే నోరు నొక్కడం శోచనీయమని పేర్కొన్నారు. గోవాడ ఫ్యాక్టరీలో రూ.16 కోట్లకుపైగా అవినీతి చోటుచేసుకుందన్న వాదన నేపథ్యంలో విచారణ జరుగుతుండగా ఎమ్మేల్యే రైతులను వారించడంపై విస్మయం వ్యక్తం చేశారు. -
మంత్రుల మధ్య ఆధిపత్య పోరు
డీఆర్ఓ పోస్టు కోసం జోరుగా పైరవీలు తాజాగా తెరపైకి కిషోర్‌కుమార్ నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) నియామకం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు అంటూ నెలకో పేరు తెరపైకి వస్తున్నా... భర్తీ మాత్రం జరగడం లేదు. మంత్రుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు ఉన్నతాధికారుల వైఖరి కూడా కొత్త డీఆర్ఓ రాకకు బ్రేకులేస్తున్నాయి. విశాఖపట్నం : డీఆర్ఓ పోస్టు కోసం జిల్లాలో గతంలో పనిచేసిన పలువురు అధికారులు తమదైన రీతిలో పైరవీలు సాగించారు. ఏజేసీగా పనిచేసిన జేఎల్ నరసింహారావు, జెడ్పీ సీఈఓగా పని చేసిన మహేశ్వరరెడ్డి కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నం చేశారు. మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికార్లు సైతం మోకాలడ్డడంతో నరసింహారావు చివరకు ఆర్ అండ్ ఆర్ ఎస్డీసీ పోస్టుతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. డీఆర్ఓగా వచ్చేందుకు మహేశ్వరరెడ్డి ఆశించినప్పటికీ ఇటీవలే బదిలీపై వెళ్లడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్రశేఖరరెడ్డిని విశాఖ డీఆర్ఓగా నియమిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి అయ్యన్న సిఫార్సుతో జరిగిన చంద్రశేఖరరెడ్డి నియామకానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మౌఖిక ఆదేశాలతో బ్రేకు పడింది. ఇంతలో విశాఖ ఆర్డీఓ వెంకటేశ్వర్లును డీఆర్ఓగా గత నెల 15న ప్రభుత్వం నియమించింది. మంత్రి అయ్యన్న చేసిన ఈ ప్రయత్నానికి గంటా మరోసారి అడ్డుపుల్ల వేయడంతో 24 గంటలు తిరక్కుండానే ఈ ఉత్తర్వులను అబియన్స్‌లో పెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు విడుదల చేసింది. చివరకు చంద్రశేఖరరెడ్డి రాక పట్ల గంట సుముఖంగానే ఉన్నారని అనుకున్నంతలోనే.. ఆయనను హైదరాబాద్ భూపరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. కిషోర్ కోసం గంటా యత్నాలు : తాజాగా వుడా కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన జి.కిషోర్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయ న్ని డీఆర్ఓగా తీసుకొచ్చేందుకు మంత్రి గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సిటీపై ఆధిపత్యం చలాయిస్తున్న మంత్రి గంటా డీఆర్ఓగా కిషోర్ వస్తే ఆయన్ని అడ్డం పెట్టుకుని రూరల్‌లో కూడా తన హవా సాగిస్తారన్న ఆందోళన అయ్యన్న వర్గంలో వ్యక్తమవుతోంది.తరచూ విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతుండడంతో ప్రధాని మొదలు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, నెలకు రెండు మూడుసార్లు ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రొటోకాల్ చూసే బాధ్యత డీఆర్ఓపై ఉంది. అలాంటి కీలకమైన పోస్ట్ ద్వారా జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరువురు మంత్రులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల వల్ల ఈ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగానే ఉండిపోయింది. -
మంత్రుల సిగపట్లు..
గంటా అండతో ఏపీఐఐసీ ఈడీగా సత్యసాయి శ్రీనివాస్ అడ్డుచక్రం వేసిన మంత్రి అయ్యన్న వారమైనా అందని రిలీవింగ్ ఉత్తర్వులు మరో రెండు పోస్టులకూ మంత్రుల మధ్య ఆధిపత్య పంతం నలిగిపోతున్న అధికారులు విశాఖపట్నం: మంత్రులకు చెలగాటం.. అధికారులకు ప్రాణసంకటం అన్నట్లుగా తయారైంది జిల్లాలో పాలనావ్యవస్థ. కీలకమైన స్థానాల్లో తమకు అనుకూల అధికారే ఉండాలని మంత్రులు గంటా మంత్రి.. అయ్యన్న ఎవరికి వారు పట్టుబడుతున్నారు. మొండికేస్తున్నారు. కీలక పోస్టుల్లో అధికారులను నియమించడం...అంతలోనే అబైయన్స్లో పెట్టడం... వారిని మాతృశాఖ నుంచి రిలీవ్ చేయకపోవడం... బదిలీ ఉత్తర్వులు రద్దు చేయడం... చివరికి ఆ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఏపీఐఐసీ ఈడీ పోస్టు కూడా మంత్రుల ఆధిపత్య పోరులో చిక్కుకుంది. డీఆర్వో, డీఎస్వో (విశాఖ సిటీ) పోస్టుల పరిస్థితి కూడా అంతే. శ్రీనివాస్‌కు అందలం పంచాయతీరాజ్ శాఖకు చెందిన సత్యసాయి శ్రీనివాస్ దీర్ఘకాలంగా డెప్యుటేషన్ మీద డీఆర్డీయే పీడీగా ఉన్నారు. ప్రభుత్వం ఆయన్ను ఇటీవల ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా బదిలీ నియమించింది. ఇందుకు మంత్రి గంటా సహకారం ఉందని తెలుస్తోంది. ఏపీఐఐసీ ద్వారానే భారీస్థాయిలో భూకేటాయింపులు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీలో తన మనిషి ఉండాలని మంత్రి గంటా వ్యూహాత్మకంగానే సత్యసాయి శ్రీనివాస్‌కు ఈడీగా నియమించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సత్యసాయి శ్రీనివాస్ డీఆర్డీయే నుంచి తన మాతృసంస్థ పంచాయతీరాజ్ శాఖకు వెనక్కి వెళ్లి... అక్కడి నుంచి ఏపీఐఐసీకి డెప్యుటేషన్ వేయించుకోవాలి. ఇంకేముందీ!...ఉత్తర్వులు వచ్చేశాయి కదా...ఏపీఐఐసీకి వెళ్లిపోదామని సత్యసాయి శ్రీనివాస్ భావించారు. కానీ కీలకమైన పీఠంపై గంటా అనుకూల అధికారి ఉండటం మంచిది కాదని అయ్యన్న పాత్రుడు భావించారు. తన శాఖకు చెందిన సత్యసాయి శ్రీనివాస్ తనకు తెలియకుండా గంటా ద్వారా పోస్టింగు తెప్పించుకోవడం ఆయన్ని అసహనానికి ఆగ్రహానికి గురి చేసింది. దాంతో అయ్యన్న పంచాయతీరాజ్ శాఖ నుంచి శ్రీనివాస్‌ను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులు దాటినప్పటికీ సత్యసాయి శ్రీనివాస్‌ను ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖ రిలీవ్ చేయలేదు. అటు ఏపీఐఐసీ ఈడీగా వెళ్లలేక... ఇటు మంత్రి అయ్యన్న ఆగ్రహానికి గురై పంచాయతీరాజ్ శాఖలో కొనసాగలేక సత్యసాయి శ్రీనివాస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఆధిపత్య పోరు మంత్రులు గంటా, అయ్యన్నల ఆధిపత్య పోరు వల్ల జిల్లాలో మరికొన్ని కీలక పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. జిల్లా రెవెన్యూ అధికారి( డీఆర్వో)గా తమ అనుకూల అధికారి కోసం ఇద్దరు మంత్రులు సిగపట్లు పడుతున్నారు. గతంలో విశాఖలో ఆర్డీవోగా పనిచేసిన వెంకటేశ్వరరావును డీఆర్వోగా నియమించేలా అయ్యన్న చక్రం తిప్పారు. ఇద్దరు మంత్రుల మధ్య వివాదంతో ఆ పోస్టింగును ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని రోజుల క్రితం మంత్రి గంటా చాపకిందనీరులా అనుకూల అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని డీఆర్వోగా నియమించేలా చేయగలిగారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీనిపై భగ్గుమన్న అయ్యన్న సీఎం వద్దే పంచాయితీ పెట్టారు. డీఆర్వోగా చంద్రశేఖరరెడ్డి నియమాకాన్ని కూడా ప్రభుత్వం అబయన్స్‌లో పెట్టింది. నగర పౌరసరఫరాల అధికారి పోస్టు కూడా ఇద్దరు మంత్రుల ఆధిపత్య పోరులో చిక్కుకుంది. తమ అనుకూల అధికారిని ఆ పోస్టులో నియమించుకునేందుకు ఇద్దరు మంత్రులు పంతానికి పోతున్నారు. దాంతో ఏడు నెలలుగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. -
తేలని పితలాటకం
పట్టువీడని మంత్రులు బీసీ అయితే కాశీ విశ్వనాథం!? ఎస్టీ అయితే ఎం.వి.ఎస్.{పసాద్లకు ఛాన్స్!? నిర్ణయం నేటికి వాయిదాటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిఎంపిక వ్యవహారం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పితలాటకం మరింత జఠిలంగా తయారైంది. జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పప్పల చలపతిరావు పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కాగా రెండో ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక మాత్రం టీడీపీలో వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది. సామాజికవర్గ సమీకరణలతోపాటు వర్గ రాజకీయాల పీటముడి బిగుసుకుంది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. మంత్రులు ఇద్దరు తమ మాటే నెగ్గాలని పంతం పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో శుక్రవారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో మంత్రులు గంటా, అయ్యన్నలతోపాటు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న తమకు అవకాశం కల్పించాలని విడివిడిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రామానాయుడు, పీలా శ్రీనివాస్, బొడ్డేటి కాశీవిశ్వనాథం, అనకాపల్లికిచెందిన డాక్టర్ సరస్వతి తదితరులు తమకు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓసీ వర్గానికి చెందిన పప్పల చలపతిరావుకు కేటాయించినందున రెండో స్థానాన్ని బీసీకిగానీ ఎస్టీకిగానీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దాంతో కన్నబాబు రాజుకు అవకాశాలు మూసుకుపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినందున ఎమ్మెల్సీగా అవకాశమివ్వలేనని రామానాయుడుకు సీఎం చెప్పేశారు. దాంతో అయ్నన్నపాత్రుడు బీసీ వర్గం నుంచి పీలా శ్రీనివాస్ పేరును ప్రతిపాదించారు. కాగా గంటా శ్రీనివాసరావు మాత్రం బీసీ వర్గానికే చెందిన కాశీ విశ్వనాథంకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. ఈమేరకు ఇద్దరు మంత్రులు కూడా సీఎంతో విడిగా మాట్లాడుతూ తమ వాదనను బలంగా వినిపించారు. దాంతో సీఎం ఏమీ తేల్చకుండా శుక్రవారం మరోసారి చర్చించిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేద్దామని చెప్పి అందర్నీ పంపించి వేశారు. ఎస్టీ అయితే ఎం.వి.ఎస్. ప్రసాద్!? తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. బీసీకే ఇవ్వాలని భావిస్తే కాశీ విశ్వనాథంకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పప్పల చలపతిరావు మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు. మరోవైపు అయ్యన్న ప్రతిపాదిస్తున్న పీలా శ్రీనివాస్ సోదరుడు గోవింద సత్యన్నారాయణ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి రెండో అభ్యర్థిగా మంత్రి గంటాతోపాటు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న కాశీ విశ్వనాథంకు అవకాశాలు మెరుగయ్యాయి. కానీ చంద్రబాబు మాత్రం ఎస్టీ నేతను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.సత్యన్నారాయణ కుమారుడు ఎం.వి.ప్రసాద్ పేర్లను పరిశీలిస్తున్నారు. మణికుమారి కంటే యువకుడైన ఎం.వి.ప్రసాద్ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలని నిర్ణయిస్తే కాశీ విశ్వనాథంను, ఎస్టీకి ఇవ్వాలని భావిస్తే ఎం.వి.ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. అనూహ్య మార్పులు జరిగితే తప్పా వీరిద్దరిలో ఒకరికి అవకాశం లభించొచ్చని టీడీపీవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో శుక్రవారం మరోసారి సమావేశమై చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. -
గంటాకు అయ్యన్న ఝలక్!?
బండారుకు దక్కని టీటీడీ పదవి ఆడారికి చెక్ పెట్టనున్న ప్రభుత్వం! సర్కారు చేతికి డెయిరీ పగ్గాలు ? ఆధిపత్యం సాధిస్తున్న అయ్యన్న విశాఖపట్నం: ఆధిపత్య పోరులో మంత్రి గంటాపై సహచర మంత్రి అయ్యన్న వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తున్నారు. గంటాను నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా ఆయన అనుచరవర్గాన్ని ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారుకు టీటీడీ పాలకమండలి పదవి రాకుండా అయ్యన్న చక్రం తిప్పారు. మరో ప్రధాన అనుచరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావును తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. ఆడారి అడ్డా అయిన విశాఖ డెయిరీ వ్యవహారాలను నేరుగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా అయ్యన్న పావులు కదుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో అయ్యన్న స్పష్టమైన ఆధిక్యత సాధించారనడానికి నిదర్శనంగా నిలుస్తున్న తాజా ఉదంతాలివిగో... తదుపరి లక్ష్యం ఆడారి!: గంటాకు ప్రధాన మద్దతుదారైన విశాఖడెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుపై అయ్యన్న గురిపెట్టారు. 27ఏళ్లుగా ఆయన ఆధిపత్యంలో ఉన్న విశాఖ డెయిరీపై దృష్టిసారించారు. అయ్యన్న ప్రధాన మద్దతుదారుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి జిల్లా కొన్ని రోజుల క్రితం బహిరంగంగానే తులసీరావు అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. విశాఖ డెయిరీని అడ్డంపెట్టుకుని రూ.500కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆడారిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాక్ట్-64 ప్రకారం ఈ డెయిరీని స్థాపిస్తే డెరైక్టర్లకు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి సంస్థను యాక్ట్- 95 యాక్ట్ కిందకు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. తాజాగా కంపెనీ యాక్టు-55ని వర్తింపజేస్తూ నిబంధనలు మార్చడాన్ని కూడా గవిరెడ్డి ప్రశ్నించారు. డెయిరీలో అక్రమాల చిట్టాను రూపొందించి గవిరెడ్డి సీఎంచంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమచారం. డెయిరీ వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే అంశాన్ని సీఎం కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక అధికారిని నియమించి డెయిరీ పాలనావ్యవహారాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. అదే జరిగితే జిల్లాలో గంటా వర్గాన్ని అయ్యన్న పూర్తిగా దెబ్బతీసినట్లే అవుతుంది. బండారుకు చుక్కెదురు గంటా వర్గంలో కీలక నేత, ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తిని మంత్రి అయ్యన్న అదను చూసి దెబ్బకొట్టారు. తనకు మంత్రి పదవి రాకుండా సైంధవ పాత్ర పోషించడానికి బండారును మంత్రి గంటా ప్రయోగించిన విషయాన్ని అయ్యన్న ఇంకా మరచిపోలేదు. సమయం కోసం వేచి చూసిన ఆయన టీటీడీ పాలకమండలి నియామక సమయంలో తన అస్త్రాన్ని ప్రయోగించారు. పాలకమండలిలో బండారుకు స్థానం కల్పించాలన్న గంటా వర్గం విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు మొదట సానుకూలంగా స్పందించారు. రెండువారాల క్రితం బండారును నియమాకం దాదాపు ఖాయమైందని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయ్యన్న వ్యూహాత్మకంగా వ్యవహరించి బండారు అవకాశాలను దెబ్బకొట్టారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ద్వారా పావులు కదిపినట్లు తెలుస్తోంది. బండారు సామాజికవర్గానికే చెందిన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును తెరపైకి తెచ్చారు. ఉత్తరాంధ్రకే చెందిన వెలమ సామాజికవర్గం నుంచి లలిత కుమారికి స్థానం ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన బండారుకు దారులు మూసుకుపోయాయి. -
అధ్యక్ష పదవులే లక్ష్యం
♦ టీడీపీలో మొదలైన సంస్థాగత సందడి ♦ మండల కమిటీల తర్వాతే జిల్లా కమిటీ ♦ జిల్లా, అర్బన్ పీఠాల కోసం పావులు కదుపుతున్న ఇరువర్గాలు ♦ అధ్యక్ష పీఠం కోసం ఆసక్తి చూపని ఎమ్మెల్యేలు ♦ మళ్లీ రచ్చకెక్కనున్న వర్గపోరు ‘అధ్యక్ష’ పదవులే లక్ష్యంగా టీడీపీలో వర్గపోరు సాగుతోంది. సంస్థాగత ఎన్నికలు ఇందుకు వేదిక అవుతున్నాయి. పార్టీలో పట్టుకోసం జిల్లాలోని ఇరువర్గాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మండల కమిటీలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు జిల్లా, అర్బన్ అధ్యక్ష పీఠాలపైనే గురిపెట్టాయి. అధినేత అందరి సమక్షంలో క్లాసు పీకినా..ఆధిపత్యం కోసం ఇరువర్గాలు కత్తులు నూరుతునే ఉన్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలుత మండల, ఏరియా, డివిజన్ కమిటీల నియామకం పూర్తి కాగానే విశాఖ నగర, రూరల్ జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశం హాట్‌టాపిక్ అయింది. పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయ్ అంటూ పార్టీ అధినేత వారిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలే చేశారు. అధినేత మందలించినంత మాత్రాన వీరిలో మార్పు వస్తుందను కుంటే పొరపాటేనని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు వీరి మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోయనున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది. కాగా జిల్లా, అర్బన్ అధ్యక్షుల మార్పు తప్పదని పార్టీ అధినేత సంకేతాలివ్వడంతో ఈ రెండు కీలక పదవులను తమవారికి కట్టబెట్టడం ద్వారా పార్టీలో పైచేయి సాధించాలని గంటా,అయ్యన్న వర్గాలు పావులు కదువుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న గవిరెడ్డి రామానాయుడు మంత్రి అయ్యన్నకు ప్రధాన అనుచరుడు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో గవిరెడ్డికి మంత్రి గంటాకు దూరం బాగా పెరిగింది. దీంతో గవిరెడ్డి స్థానంలో తన అనుచరుడు జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని భర్త భాస్కర్‌ను నిలబెట్టాలని మంత్రి గంటా పావులు కదుపుతున్నారు. గవిరెడ్డినే కొనసాగించాలని మంత్రి అయ్యన్న పట్టుబడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో యలమంచిలి సీటును ఆశించి భంగపడిన సుందర విజయ్‌కుమార్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బంటుమిల్లి మణిశంకర నాయుడులు కూడా జిల్లా పార్టీ పదవి రేసులో ఉన్నారు. వీరిలో పాటు మాజీ మంత్రి అప్పలనరసింహరాజు, చోడవరం సుగర్స చైర్మన్ గూనూరు మల్లునాయుడు కూడా ఈ పదవిపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షునిగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈయనపై కూడా మంత్రి గంటా వర్గీయునిగా ముద్రపడింది. వాసుపల్లి మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం టీడీపీకి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్‌తో పాటు జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ పట్టాభిరామ్, జహీర్ అహ్మద్, ఒమ్మి సన్యాసిరావు, కోన తాతారావు, పైలా ముత్యాలనాయుడు, హర్షవర్దన్ ప్రసాద్ తదితరులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఒక్క పల్లా శ్రీనివాసరావు మాత్రమే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు అర్బన్‌తో పాటు అటు జిల్లా పార్టీపై కూడా మరింత పట్టు సాధించేందుకు గంటా, అయ్యన్న వర్గాలు పావులు కదుపుతున్నాయి. మండల కమిటీల తర్వాతే పార్టీ సంస్థాగత ఎన్నికల సందడి శనివారం మొదలైంది. ఇప్పటికే పంచాయతీ స్థాయిలో వార్డు, గ్రామ కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ ఇప్పుడు మండల కమిటీలపై దృష్టి పెట్టింది. జీవీఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఏరియా, డివిజన్/వార్డు అధ్యక్ష ఎన్నికలకు తెరలేచింది. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకంగా ఎన్నికల పరిశీలకులను కూడా నియమించింది. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న జీవీఎంసీపై పట్టు సాధించేందుకు డివిజన్ కమిటీలపై ఆధిపత్యం కోసం విశాఖ పరిధిలో తమ అనుచర ఎమ్మెల్యేల ద్వారా పట్టు సాధించేందుకు గంటా, అయ్యన్నలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. -
చినబాబు పిలిచారని..
హడావుడిగా హైదరాబాద్ వెళ్లొచ్చిన ‘గంటా’ విశాఖపట్నం: నారా లోకేష్ సమావేశానికి హాజరుకావాలని పిలుపు రావడంతో మంత్రి గంటా ఆగమేఘాలపై శనివారం రాజధానికి వెళ్లి రావడంతో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో లోకేష్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అంశంపై మంత్రులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు హాజరయ్యారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడి నిశ్చితార్థ వేడుకల్లో బిజిగా ఉండడంతో హాజరు కాలేదు. విజయనగరం జిల్లా కొండపల్లి మండలంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉన్న మంత్రి గంటా మాత్రం ఫోన్‌కాల్ రాగానే హైదరాబాద్ పయనమయ్యారు. ప్రత్యేక కేబినెట్ సమావేశంలో పాల్గొని సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకున్నారు. తర్వాత ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విశాఖ ఉత్సవాల్లో పాల్గొన్నారు. విషయం ఏంటని ఆరా తీయగా స్మార్ట్ విలేజ్ పథకంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం మంత్రులతో చినబాబు సమీక్షించారని సమాచారం. ఏ హోదాలో చినబాబు కేబినెట్ మంత్రులతో ఈ భేటీ నిర్వహించారో వెళ్లొచ్చిన మంత్రులకే తెలియాలని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
రెవె‘న్యూ’.. జగడం
* గంటాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లో మంత్రి అయ్యన్న మంత్రాంగం * భూ వ్యవహారంపై విజిలెన్స్ విచారణతో కలకలం * ఆర్డీవోపై వేటు కోసం వ్యూహం! * మంత్రుల మధ్య వేడెక్కుతున్న రాజకీయం సాక్షి, విశాఖపట్నం : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో మంత్రి అయ్యన్న బాణం సంధించారు. కోట్ల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా స్వామి భక్తిని ప్రదర్శించే అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు మంత్రి గంటాకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటుకు మార్గం సుగమం చేశారు. అదను చూసి వేసిన ఎత్తుకు మంత్రి గంటా బిత్తరపోవాల్సిన పరిస్థితి కల్పించారు. భీమిలి, పరవాడలలో భూ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జిల్లా రాజకీయ, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఇప్పటికే ఉప్పూ నిప్పుగా ఉన్న అయ్యన్న, గంటాల మధ్య తాజా ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. ఇద్దరు మంత్రుల ఆధిపత్యపోరులో తాము అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో పనిచేయడం కంటే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడం ఉత్తమమని కూడా భావిస్తున్నారు. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... పరవాడ మండలంలో సర్వే నంబర్ 54లో 32.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఒక ప్రభుత్వ పెద్ద ఎప్పటి నుంచో కన్నేశారు. అదే విధంగా భీమిలి మండలం గంభీరంలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ఇదే రీతిలో ఆక్రమించాలని ఎప్పటినుంచో పథకం పన్నారు. ఈ భూములు ప్రస్తుతం రైతులు, స్థానికుల ఆక్రమణలో ఉన్నాయి. వీటిని ఎలాగైనా తన పరం చేసుకోవాలని కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో సదరు ప్రభుత్వ పెద్ద చక్రం తిప్పారు. తన అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారి ద్వారా కథ నడిపించారు. గత ప్రభుత్వ హయాంలోనే గంభీరం వద్ద ఉన్న భూములను క్రమబద్ధీకరించుకున్నారని సమాచారం. పరవాడలో రైతుల ఆక్రమణలో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చే విషయం పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ఆ కీలక నేత, ఈయన తనకు అనుకూలుడైన రెవెన్యూ అధికారి ఒకరు సదరు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను టాంపరింగ్ చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా పరిగణించారు. కానీ ఆ కీలక నేత ఒత్తిడితో టాంపరింగ్ విషయం తెలిసినా సదరు అధికారి మిన్నకుండిపోయినట్టుగా తెలియవచ్చింది. భీమునిపట్నం మండలంలోని చిప్పాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 86/4, 184/6లలో ఉన్న భూముల రికార్డులను తారుమారు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ సర్వే నంబర్లో సుమారు 500 ఎకరాల్లో ఓ లేబొరేటరీ ఉండగా, మిగిలిన భూముల్లో అటవీ, విజయనగరం జిల్లా మాన్సాస్ భూములు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీఎం, డీప్యూటీ సీఎంలకు ఫిర్యాదుల వెల్లువెత్తడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీల్లో రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమైన సదరు రెవెన్యూ అధికారిపై ఈ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. విచారణ పేరుతో సదరు అధికారిని బలవంతంగా పంపించేందుకే జిల్లాకు చెందిన కీలక మంత్రి పావులు కదిపినట్టుగా తెలుస్తోంది.