డబ్బుల కోసం ఆ మాత్రం నిలబడలేరా? | Minister ayyanna comments on demonisation | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం ఆ మాత్రం నిలబడలేరా?

Published Mon, Dec 5 2016 4:31 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

డబ్బుల కోసం ఆ మాత్రం నిలబడలేరా? - Sakshi

డబ్బుల కోసం ఆ మాత్రం నిలబడలేరా?

ప్రజల ఇబ్బందులపై మంత్రి అయ్యన్న

 చోడవరం: పాత నోట్ల రద్దు, బంగారంపై ట్యాక్స్ వ్యవహారంలో మీడియా అనవసరంగా అపోహలు సృష్టిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు.

విశాఖ జిల్లా చోడవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి సినిమా టికెట్ల కోసం 4 గంటలు లైన్లలో నిలబడే జనం.. అవసరమైన డబ్బుల కోసం గంటసేపు బ్యాంకుల వద్ద నిలబడలేరా? అంటూ ప్రశ్నించారు. బంగారంపై విధించిన నిబంధనల వల్ల ధనికులైన 20 శాతం మందే ఇబ్బంది పడతారని, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బందీ ఉండదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement